బంగారం, పట్టుచీరలు వద్దు.. ఈ అమ్మవారికి ఐదు రాళ్లు, ఒకపువ్వు సమర్పిస్తే చాలు!
అమ్మవారికి ఎవరైనా పట్టువస్త్రాలు, మెుక్కుకుంటే బంగారంలాంటివి సమర్పిస్తారు. కానీ మా బాగదాయి అమ్మవారికి ఐదు రాళ్లు, పువ్వు సమర్పిస్తే చాలు.
భారతదేశవ్యాప్తంగా ఉన్న శక్తి పీఠాల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పండ్లు లేదా నైవేద్యాలు సమర్పించడం మనం చూస్తుంటాం. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లా, దట్టమైన అడవుల మధ్య కొలువై ఉన్న మా బాగదాయి ఆలయం వీటన్నింటికీ భిన్నం. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ అమ్మవారికి సమర్పించేది కేవలం ఐదు రాళ్లు, ఒక పువ్వు మాత్రమే!

రాళ్ల సమర్పణ వెనుక కథ
శతాబ్దాల నాటి ఈ వింత ఆచారం వెనుక ఒక కథ ఉంది. స్థానిక కథనం ప్రకారం.. సుమారు వందేళ్ల క్రితం ఒక పేద గొర్రెల కాపరి అడవిలో దేవి విగ్రహాన్ని కనుగొన్నాడు. అమ్మవారు అతడి కలలోకి వచ్చి తనను అక్కడే ప్రతిష్టించాలని కోరింది.
అమ్మవారి ఆజ్ఞ ప్రకారం ఆ భక్తుడు చిన్న గుడిని నిర్మించాడు. అయితే, దేవికి సమర్పించడానికి అతడి వద్ద కొబ్బరికాయ గానీ, ఇతర ఖరీదైన వస్తువులు గానీ లేవు. తన పేదరికాన్ని తలచుకుని కన్నీరు మున్నీరైన ఆ భక్తుడికి దేవి మళ్ళీ దర్శనమిచ్చి ఇలా చెప్పిందట: “నాయనా! నాకు నీ ఆడంబరాలు అక్కర్లేదు, నీ నిష్కల్మషమైన ప్రేమే చాలు. ఇక్కడ పడి ఉన్న ఐదు రాళ్లనే నాకు భక్తితో సమర్పించు.” అప్పటి నుండి నేటి వరకు, ఈ ఆలయంలో ఆ ఐదు రాళ్లే మహాప్రసాదంగా కొనసాగుతున్నాయి. వాటితోపాటుగా ఒక పవ్వును అమ్మవారికి సమర్పిస్తారు.
కోరికలు తీర్చే శిలలు
ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమ మనసులోని కోరికలను అమ్మవారికి చెప్పుకుంటూ ఐదు రాళ్లు, ఒక పువ్వును పూర్తి హృదయంతో సమర్పిస్తారు. ఒకసారి కోరిక నెరవేరిన తర్వాత, భక్తులు మళ్ళీ ఆలయానికి వచ్చి కృతజ్ఞతగా మరో ఐదు రాళ్లను అమ్మవారి పాదాల చెంత ఉంచుతారు. ఇలా చేయడం వల్ల దుష్టశక్తుల ప్రభావం తొలగి, జీవితంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.
ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక సంబరం
ప్రతి ఏటా చైత్ర మాసం, శరన్నవరాత్రుల సమయంలో మా బాగదాయి ఆలయం భక్తజన సంద్రమవుతుంది. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరిస్తారు. దట్టమైన అడవి మధ్యలో జరిగే ఈ ఉత్సవాలు ప్రకృతి సౌందర్యంతో పాటు మధురమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


