న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయన్నది చెప్పడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు చెప్పడానికి వీలవుతుంది. ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు ఉంటాయి. వీటి ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఈ తేదీల్లో పుట్టిన వారిలో కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి.

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలైతే ఎవరికోసమైనా ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వీరి మనసు ఎంతో విశాలం. ఎవరికైనా సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా వెనుకడుగు వేయరు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కానీ ఎప్పుడూ సహాయం చేయడాన్ని వారి బాధ్యతగా భావిస్తారు. మరి వీరిలో మీరు కూడా ఒకరేమో చూసుకోండి.
రాడిక్స్ సంఖ్య ఒకటి:
ఏదైనా నెలలో 1, 10, 19 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య ఒకటి అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి సూర్యుడు. సూర్యుడు గ్రహాలకు రాజు. అలాగే ఈ సంఖ్యకు కూడా అధిపతి. రాడిక్స్ సంఖ్య ఒకటికి చెందిన అమ్మాయిలు ఎంతో తెలివితేటలు కలిగి ఉంటారు. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. వీరికి నాయకత్వం వహించడానికి ఇష్టం ఉంటుంది.
మొండితనం:
రాడిక్స్ సంఖ్య ఒకటికి చెందిన అమ్మాయిలు చాలా మొండిగా ఉంటారు. అలాగే నాయకత్వం వహించడానికి కూడా ఇష్టపడతారు. చిన్నప్పటి నుంచి బాధ్యతగా ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎక్కువగా ఉంటుంది. వారి నిర్ణయాలు వారు సొంతంగా తీసుకోగలరు. ఇతరులకి ఒత్తిడి కల్పించకూడదని భావిస్తారు. అలాగే స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. వారి జీవితం, వారి రూల్స్ అన్న విధంగా వ్యవహరిస్తారు.
విశాలమైన హృదయం:
న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు విశాలమైన హృదయం ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు. మరో ఆలోచన లేకుండా సహాయం చేస్తారు. స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల కోసం ఏదైనా చేయడానికి ముందుంటారు. అది వారి బాధ్యతగా భావిస్తారు.
మానసికంగా ధృడంగా:
{{/usCountry}}న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు విశాలమైన హృదయం ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు. మరో ఆలోచన లేకుండా సహాయం చేస్తారు. స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల కోసం ఏదైనా చేయడానికి ముందుంటారు. అది వారి బాధ్యతగా భావిస్తారు.
మానసికంగా ధృడంగా:
{{/usCountry}}రాడిక్స్ సంఖ్య ఒకటికి చెందిన అమ్మాయిలు మానసికంగా దృఢంగా ఉంటారు. ఇతరుల కోసం ఏదైనా త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అప్పుడప్పుడు వారిని అందరూ వదిలేసినట్లుగా అనిపిస్తుంది. అదే వారికి కాస్త మానసిక ఇబ్బందిని కలిగిస్తుంది.
వీరి బలాలు:
రాడిక్స్ సంఖ్య ఒకటికి చెందిన వారికి ఏ మాత్రం భయం ఉండదు. అదే వారిలో ఉన్న అతి పెద్ద బలం. ఎలాంటి సమస్యకైనా పరిష్కారాన్ని సులువుగా వెతకగలరు. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే భయపడరు. కెరియర్‌లో కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా వీరిపై ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఈ తేదీల్లో పుట్టిన వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.