30 ఏళ్ల తర్వాత భారీ మార్పు.. ఈ తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం!
జన్మతేదీ ఆధారంగా రాడిక్స్ సంఖ్యను లెక్కించి, వ్యక్తుల స్వభావం, జీవితం, భవిష్యత్తు గురించి న్యూమరాలజీలో కొన్ని అంచనాలు చెబుతారు. ముఖ్యంగా మూలాంకం 8, మూలాంకం 4 ఉన్నవారు జీవిత ప్రారంభంలో కష్టాలు, ఆలస్యాలను ఎదుర్కొన్నప్పటికీ, వయసు పెరిగే కొద్దీ పరిస్థితులు మెరుగుపడతాయని నమ్మకం ఉంది.
ప్రతి వ్యక్తి జన్మతేదీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. పుట్టిన తేదీ ఆధారంగా మనిషి ప్రవర్తన, పేరు ఎలా ఉన్నాయో చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది. పుట్టిన తేదీ ఆధారంగానే రాడిక్స్ సంఖ్యను లెక్కిస్తారు.

కొన్ని మూలాంకాలు ఉన్న వ్యక్తులు విజయం కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ పరిస్థితులు చక్కబడతాయి. 30 ఏళ్ల తర్వాత అదృష్టం కలిసి వస్తుంది. ఆ సంఖ్యలు వారు ఎవరు? 30 తర్వాత భారీగా మార్పును చూస్తారు. కలిసి వస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ తేదీల్లో పుట్టిన వారికి 30 తర్వాత బాగా కలిసి వస్తుంది.. విజయాన్ని సులువుగా చేరుకుంటారు.
మూలాంకం ఎనిమిది:
ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే, వారి మూలాంకం 8 అవుతుంది. న్యూమరాలజీలో మూలాంకం ఎనిమిదిని శని దేవుడితో ముడిపడి ఉందని చెప్తారు. మూలాంకం 8 ఉన్న వ్యక్తులు తొలి దశలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు.
కెరీర్‌లో విజయాలను సాధించడానికి శ్రమ పడాల్సి ఉంటుంది. ఫలితాలు తరచుగా ఆలస్యంగా వస్తాయి. ఈ పోరాటం వారిని మరింత బలంగా మారుస్తుంది. వయసు పెరిగే కొద్దీ బాధ్యత, అవగాహన కూడా పెరుగుతాయి. 30 ఏళ్ల తర్వాత ఆర్థికపరంగా అవకాశాలు వస్తాయి. మెరుగుదలను చూస్తారు.
మూలాంకం నాలుగు:
ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినట్లయితే, వారి మూలాంకం నాలుగు అవుతుంది. న్యూమరాలజీలో ఈ మూలాంకాన్ని రాహువుతో ముడిపెడతారు. ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు చాలా భిన్నంగా ఆలోచిస్తారు. సొంత షరతులపై పనిచేయడం వారికి అలవాటు. తొలి దశలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి.
విజయాన్ని సాధించడానికి చాలాసార్లు ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. కాలం గడిచే కొద్దీ మార్పులు వస్తాయి. తర్వాత ఏ తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం పెరుగుతుంది, మంచి ఫలితాలను చూస్తారు. విజయాన్ని సాధించడానికి ఎదురుచూడాల్సి ఉంటుంది. కానీ కష్టపడితే కచ్చితంగా విజయాన్ని అందుకుంటారు.
మూలాంకం ఎనిమిది:
ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే, వారి మూలాంకం 8 అవుతుంది. ఈ సంఖ్యలో పుట్టిన వారు జీవితం ఆరంభంలో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కెరీర్‌లో విజయాన్ని సాధించడానికి శ్రమ పడాలి. ఫలితాలు కాస్త ఆలస్యంగానే వస్తాయి. ఈ పోరాటం వారిని ఇంకా బలంగా మారుస్తుంది. వయసు పెరిగే కొద్దీ బాధ్యత భావం మరియు అవగాహన పెరుగుతాయి. 30 తర్వాత కెరీర్ అభివృద్ధికి అవకాశాలు లభిస్తాయి.
మూలాంకం నాలుగు:
ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినట్లయితే, వారి మూలాంకం నాలుగు అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు భిన్నంగా ఆలోచిస్తారు. సొంత నియమాల ప్రకారం పని చేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన ప్రారంభంలో కాస్త ఇబ్బందులు రావచ్చు.
విజయాన్ని సాధించడానికి మళ్లీ మళ్లీ ట్రై చేయాల్సి ఉంటుంది. తప్పుల నుంచి నేర్చుకుంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. 30 తర్వాత జీవితంలో స్థిరత్వం వస్తుంది. కెరీర్‌లో ముందుకు సాగడానికి కొత్త అవకాశాలను పొందుతారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


