...
...
Next Story

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు కింగ్‌లా జీవిస్తారు.. పడిన కష్టం వృధా కాదు, శని వారి జీవితాన్నే మార్చేస్తాడు!

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు త్వరగా సక్సెస్‌ను అందుకోరు. కొన్ని ఏళ్ల తర్వాత మాత్రమే సక్సెస్‌ను చూస్తారు. కానీ ఆ సక్సెస్ ఎలా ఉంటుందంటే, ఏకంగా కోటీశ్వరులు అయిపోతారు. పేరు, ప్రతిష్టలను తెచ్చుకుంటారు. ఊహించని విధంగా వారి స్థాయి మారిపోతుంది. కార్లు, విదేశీ ప్రయాణాలు ఇలా ఎన్నో ఉంటాయి.

Published on: Dec 19, 2025, 16:31:07 IST
Advertisement

Numerology: న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా అనేక విషయాలను చెప్పడానికి వీలవుతుంది. ఒక మనిషి పుట్టిన తేదీ ప్రకారం చాలా రహస్యాలను తెలుసుకోవచ్చు. ఈరోజు కొన్ని తేదీల్లో పుట్టిన వ్యక్తుల గురించి తెలుసుకుందాం.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు కింగ్‌లా జీవిస్తారు (pinterest)
Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు కింగ్‌లా జీవిస్తారు (pinterest)

ఈ తేదీల్లో పుట్టిన వారు త్వరగా సక్సెస్‌ను అందుకోరు. కొన్ని ఏళ్ల తర్వాత మాత్రమే సక్సెస్‌ను చూస్తారు. కానీ ఆ సక్సెస్ ఎలా ఉంటుందంటే, ఏకంగా కోటీశ్వరులు అయిపోతారు. పేరు, ప్రతిష్టలను తెచ్చుకుంటారు. ఊహించని విధంగా వారి స్థాయి మారిపోతుంది. కార్లు, విదేశీ ప్రయాణాలు ఇలా ఎన్నో ఉంటాయి.

రాడిక్స్ నెంబర్ 8

ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 8 అవుతుంది. రాడిక్స్ నెంబర్ 8 వారు అంత ఈజీగా సక్సెస్‌ను అందుకోరు. అయితే వారు సక్సెస్‌ను అందుకోవాలంటే కనీసం 40 ఏళ్ల వరకు ఎదురు చూడాలి. అందరితో పోల్చుకుంటే ఈ తేదీల్లో పుట్టిన వారికి కాస్త ఆలస్యంగానే సక్సెస్ వస్తుంది.

శని కారణంగా సమస్యలు

రాడిక్స్ నెంబర్ 8కి అధిపతి శని. శని న్యాయదేవుడు. మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. ఈ సంఖ్యలకు అధిపతి శని కనుక, శని ప్రభావం వల్ల కొంచెం ఆలస్యంగానే సక్సెస్‌ను అందుకుంటారు. ఎంతో కష్టపడితే కానీ సక్సెస్‌ను అందుకోరు. అలాగే మకర రాశి, కుంభ రాశికి కూడా అధిపతి శని. ఈ రాశుల వారికి కూడా కొంచెం ఆలస్యంగానే విజయాలు ఉంటాయి. శని కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో విపరీతంగా కష్టపడితే కానీ విజయాన్ని అందుకోలేరు. కొంచెం కష్టపడి పని చేస్తేనే సక్సెస్ వస్తుంది.

కాస్త కష్టపడితే విజయాలను అందుకోవచ్చు

రాడిక్స్ నెంబర్ 8కి చెందిన వారు ఎక్కువ కష్టపడతారు. వీరికి నిజాయితీ కూడా ఎక్కువ. ఇతరులకు సహాయం చేయడానికి కూడా ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ ముందుంటారు. వీరిలో ఉండే ఈ లక్షణాలు సమాజంలో మంచి గౌరవాన్ని తెస్తాయి. చక్కటి జీవితం గడుపుతారు. కానీ వీరి కష్టం వృధా కాదు. కొన్ని ఏళ్ల తర్వాత పడిన కష్టం కంటే ఎక్కువ ఫలితాన్ని చూస్తారు. రాజులాంటి జీవితాన్ని గడుపుతారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks