పాపాంకుశ ఏకాదశి: హిందూ సంప్రదాయంలో ఏకాదశి వ్రతానికి విశేషమైన స్థానం ఉంది. ప్రతి నెలా వచ్చే ఏకాదశులకు ప్రత్యేక విశిష్టత ఉన్నప్పటికీ, ఆశ్వయుజ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పాపాంకుశ ఏకాదశికి సమస్త పాపాలను హరించే శక్తి ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర రోజున భక్తులు పద్మనాభ వాసుదేవుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సమస్త సుఖాలు, మోక్షం ప్రాప్తిస్తాయని విశ్వాసం.
పాపాంకుశ ఏకాదశి తిథి మరియు ముహూర్తం

ఈ ఏడాది పాపాంకుశ ఏకాదశి తేదీకి సంబంధించి భక్తులలో స్పష్టత ఉండటం ముఖ్యం. పంచాంగం ప్రకారం, అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 2:12 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. అయితే ఆ రోజు దశమి యుక్త ఏకాదశి కావడంతో, ఉదయ తిథి ప్రకారం అక్టోబర్ 22వ తేదీన సూర్యోదయంతో ఏకాదశి వ్యాపించి ఉంటుంది.
ఆ రోజు మధ్యాహ్నం 2:49 గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది. కాబట్టి ద్వాదశి యుక్త ఏకాదశి వ్రతాన్ని అక్టోబర్ 22నే ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు. ఇక ఏకాదశి వ్రత విరమణ అక్టోబర్ 23వ తేదీ ఉదయం చేయాల్సి ఉంటుంది. ఈ పవిత్ర వ్రతాన్ని ఆచరించడం ద్వారా కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని ప్రతీతి.
ఏకాదశి ప్రాముఖ్యత
ఈ ఏకాదశి అత్యంత అరుదైనదిగా మరియు శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఒకే రోజులో ఏకాదశి, ద్వాదశి మరియు రాత్రి సమయంలో త్రయోదశి తిథులు కలిసి వస్తే దానిని త్రిస్పృశ ఏకాదశి అంటారు. ఇందులో ఎక్కడా దశమి స్పర్శ ఉండదు. అటువంటి త్రిస్పృశ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం కోట్లాది పాపాలను క్షణంలో నశింపజేస్తుందని పురాణ వచనం.
పూర్వకాలంలో శ్రీ మహావిశ్వేశ్వరుడు స్వయంగా ఈ త్రిస్పృశ వ్రత మహత్యాన్ని వివరించారు. వంద కోట్ల తీర్థయాత్రలతో సమానమైన పుణ్యాన్ని ఈ ఒక్క వ్రతం ప్రసాదిస్తుందని నమ్ముతారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే నాలుగు పురుషార్థాలను అందించే ఈ విశిష్ట వ్రతాన్ని ఏ నెలలో వచ్చినా, శుక్ల పక్షమైనా లేదా కృష్ణ పక్షమైనా సరే భక్తితో ఆచరించడం శ్రేయస్కరం.
{{/usCountry}}పూర్వకాలంలో శ్రీ మహావిశ్వేశ్వరుడు స్వయంగా ఈ త్రిస్పృశ వ్రత మహత్యాన్ని వివరించారు. వంద కోట్ల తీర్థయాత్రలతో సమానమైన పుణ్యాన్ని ఈ ఒక్క వ్రతం ప్రసాదిస్తుందని నమ్ముతారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే నాలుగు పురుషార్థాలను అందించే ఈ విశిష్ట వ్రతాన్ని ఏ నెలలో వచ్చినా, శుక్ల పక్షమైనా లేదా కృష్ణ పక్షమైనా సరే భక్తితో ఆచరించడం శ్రేయస్కరం.
{{/usCountry}}ఇంట ఉంటూనే ప్రయాగలో మరణించినంత లేదా ద్వారకలో గోమతీ నదిలో స్నానం చేసినంత పవిత్రతను ఈ వ్రతం ద్వారా పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారంపై, అవి పూర్తిగా నిజమైనవి మరియు ఖచ్చితమైనవి అని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.