Venus Rise: ఫిబ్రవరి 1న శుక్రుడు ఉదయిస్తాడు, మూడు రాశుల వారి జీవితాల్లో అద్భుతాలే.. డబ్బు, ఆనందం, అదృష్టంతో పాటు ఎన్నో!
ఫిబ్రవరి 1న శుక్రుడి సంచారంలో మార్పు రాబోతోంది. ప్రస్తుతం శుక్రుడు మకర రాశిలో ఉన్నాడు. ఫిబ్రవరి 1న ఉదయిస్తాడు. దీంతో 12 రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి. కొత్త అవకాశాలు రావడం, వ్యాపారంలో, కెరీర్‌లో ఎక్కువ మార్పులు, విజయాలు ఉంటాయి. శుక్రుడి ఉదయంతో ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది?
గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా అనేక మార్పులను తీసుకువస్తుంది. శుక్రుడు డబ్బు, సంతోషం, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. త్వరలోనే శుక్రుడు ఉదయిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి.

ఫిబ్రవరి 1న శుక్రుడి సంచారంలో మార్పు రాబోతోంది. ప్రస్తుతం శుక్రుడు మకర రాశిలో ఉన్నాడు. ఇదే రాశిలో ఫిబ్రవరి 1న ఉదయిస్తాడు. దీంతో 12 రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి. కొత్త అవకాశాలు రావడం, వ్యాపారంలో, కెరీర్‌లో ఎక్కువ మార్పులు, విజయాలు ఉంటాయి. మరి శుక్రుడి ఉదయంతో ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? ఏ రాశుల వారు ఎక్కువ లాభాలను పొందబోతున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిబ్రవరి 1న శుక్రుడు ఉదయిస్తాడు.. ఈ రాశులకు అద్భుతాలే
మేష రాశి
- మేష రాశి వారికి శుక్రుడి ఉదయంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. అనేక విధాలుగా లాభాలను పొందుతారు.
- శుక్రుడు ఈ రాశి పదవ స్థానంలో ఉన్నాడు. దీంతో శుక్రుడు ఉదయించినప్పుడు కెరీర్‌లో, వ్యాపారంలో పురోగతిని చూస్తారు.
- నిరుద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. మంచి అవకాశాలతో సంతోషంగా ఉంటారు.
- వ్యాపారంలో కొత్త డీల్స్ రావడం, పురోగతిని చూడడం వంటి విషయాలు జరగవచ్చు.
- అలాగే శుక్రుడి ఉదయం ఈ రాశి వారికి ధనాన్ని తీసుకువస్తుంది.
- పాలిటిక్స్‌లో ఉన్నవారు గొప్ప అవకాశాలను పొందుతారు.
- ఆర్థికపరంగా కూడా లాభాలు ఉంటాయి.
కర్కాటక రాశి
- కర్కాటక రాశి వారికి శుక్రుడి ఉదయం బాగా కలిసి వస్తుంది. ఇది సానుకూల మార్పులను తీసుకొస్తుంది.
- శుక్రుడు ఈ రాశి ఏడవ ఇంట్లో సంచరించడంతో వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. సమస్యలన్నీ తొలగిపోతాయి.
- శుక్రుడి సంచారంలో మార్పుతో ఈ రాశి వారు సంతోషం, ప్రశాంతతను కూడా పొందుతారు.
- కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది.
- శుక్రుడి ఉదయంతో ఈ రాశి వారు కొత్త అవకాశాలను పొందుతారు.
- ఆర్థికపరంగా బాగుంటుంది.
- బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది.
మీన రాశి
- మీన రాశి వారికి కూడా శుక్రుడి ఉదయం బాగా కలిసి వచ్చేలా చేస్తుంది.
- ఈ సమయంలో ఈ రాశి వారు చాలా లాభాలను పొందుతారు. అనేక విధాలుగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది.
- ఈ రాశి 11వ ఇంట్లో శుక్రుడి సంచారం జరగడంతో ఆదాయం పెరుగుతుంది.
- ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది.
- అపార్థాలు తొలగిపోతాయి.
- ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది.
- పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇలా అనేక విధాలుగా లాభాలు ఉంటాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


