న్యూఇయర్ నాడు చంద్ర సంచారంతో నాలుగు రాశులకు గోల్డెన్ డేస్.. డబ్బు, అదృష్టం, ఆనందంతో పాటు ఎన్నో !
జనవరి 1న, న్యూఇయర్ మొదటి రోజు చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అలాగే రోహిణి నక్షత్రంలో ఉంటాడు. దీంతో కొన్ని రాశులకు ఈ చంద్ర సంచారం కలిసి రాబోతోంది. చంద్ర సంచారంతో ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. ఊహించని మార్పులను చూస్తారు. సానుకూల ఫలితాలను పొందుతారు.
గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు, అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు తీసుకొస్తుంది. మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. జనవరి 1న, న్యూఇయర్ మొదటి రోజు చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అలాగే రోహిణి నక్షత్రంలో ఉంటాడు. దీంతో కొన్ని రాశులకు ఈ చంద్రసంచారం కలిసి రాబోతోంది. చంద్రసంచారంతో ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి.

చంద్ర సంచారం
చంద్రుడు రెండు లేదా మూడు రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తూ ఉంటాడు. చంద్రుని సంచారంలో మార్పు వచ్చినప్పుడు, అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. కొన్నిసార్లు శుభ ఫలితాలు ఎదురైతే, కొన్ని సార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
చంద్ర సంచారంతో న్యూఇయర్ నాడు ఈ రాశుల వారికి పండగే
1.వృషభ రాశి:
వృషభ రాశి వారికి చంద్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. న్యూఇయర్ రోజు ఈ రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. న్యూ ఇయర్ మొదటి వారం ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. పురోగతిని చూస్తారు.
2.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి చంద్ర సంచారం బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు చంద్రుని సంచారంతో అనేక విధాలుగా లాభాలను పొందుతారు. న్యూ ఇయర్ మొదటి రోజు ఈ రాశి వారు ఊహించని మార్పులను చూస్తారు. సానుకూల ఫలితాలను పొందుతారు. కెరీర్‌లో కూడా బాగా కలిసి వస్తుంది. పురోగతిని చూస్తారు. ఆర్థికపరంగా కూడా ఈ రాశి వారికి బాగుంటుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. ఇలా న్యూ ఇయర్ నాడు ఈ రాశి వారు కూడా అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఆనందంగా ఉంటారు.
3.కన్యా రాశి:
కన్యా రాశి వారికి కొత్త సంవత్సరం అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. కొత్త సంవత్సరం మొదటి రోజు ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. అదృష్టం కూడా కలిసి వస్తుంది. అవకాశాలను అందుకుంటారు. ఆర్థిక నష్టాలు తొలగిపోతాయి. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు.
4.కుంభ రాశి:
కుంభ రాశి వారికి చంద్రుని సంచారం బాగా కలిసి వస్తుంది. కుంభ రాశి వారు చంద్రుని సంచారంతో ఆనందంగా ఉంటారు. న్యూ ఇయర్ నాడు ఈ రాశి వారు సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. తల్లిదండ్రులతో సంబంధం మరింత బాగుంటుంది. పాజిటివ్‌గా కొత్త సంవత్సరాన్ని మొదలుపెడతారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


