...
...
Next Story

నేడే పరమ ఏకాదశి.. సాయంత్రం ఈ 4 చోట్ల దీపాలు పెడితే దరిద్రం పరార్! మళ్ళీ మూడేళ్ళ వరకు ఈ భాగ్యం కలగదు!

పరమ ఏకాదశి రోజున దీపదానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. సాయంత్రం వేళ ఇంట్లోని ఈ నాలుగు ప్రత్యేక స్థలాల్లో దీపాలు వెలిగిస్తే శని దోషాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది.

Published on: Jun 11, 2026, 08:45:42 IST
Advertisement

అధిక మాసంలో వచ్చే పరమ ఏకాదశికి హిందూ శాస్త్రాల్లో అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. ఈ రోజున చేసే విష్ణు పూజ, ఉపవాసాలు ఎంతటి పుణ్యాన్ని ఇస్తాయో, సాయంత్రం వేళ చేసే దీపదానానికి కూడా అంతే శక్తి ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత దీపాలు వెలిగించడం వల్ల జాతకంలోని గ్రహ దోషాలు తొలగిపోవడమే కాకుండా, ఇంట్లోని ప్రతికూల శక్తులు నశిస్తాయి. జీవితంలో ఎదురయ్యే ఆర్థిక కష్టాలు, కుటుంబ కలహాల నుంచి ఉపశమనం పొందడానికి ఈ రోజు సాయంత్రం నాలుగు ప్రత్యేక ప్రదేశాల్లో దీపాలు పెట్టాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

లక్ష్మీదేవి నడయాడే ఈ 4 ప్రదేశాల్లో దీపాలు పెట్టండి

1.ఇంటి ఈశాన్య మూల

నేడే పరమ ఏకాదశి.. సాయంత్రం ఈ 4 చోట్ల దీపాలు పెడితే దరిద్రం పరార్! మళ్ళీ మూడేళ్ళ వరకు ఈ భాగ్యం కలగదు!
నేడే పరమ ఏకాదశి.. సాయంత్రం ఈ 4 చోట్ల దీపాలు పెడితే దరిద్రం పరార్! మళ్ళీ మూడేళ్ళ వరకు ఈ భాగ్యం కలగదు!

పరమ ఏకాదశి రోజు సాయంత్రం మీ ఇంటి పూజా గదిలో లేదా ఈశాన్య మూలలో తప్పనిసరిగా ఒక దీపాన్ని వెలిగించండి. ఈశాన్యం దేవతలకు నిలయం. ఇక్కడ దీపం పెట్టడం వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. దీనివల్ల ఇంట్లో ధనధాన్యాలకు ఎన్నటికీ లోటుండదు.

2.రావి చెట్టు కింద

సాయంత్రం వేళ సమీపంలోని రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. పురాణాల ప్రకారం రావి చెట్టులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు శని దేవుడు కూడా కొలువై ఉంటాడు. ఏకాదశి నాడు ఇక్కడ దీపం పెట్టడం వల్ల జీవితంలో ఎదురయ్యే పెద్ద పెద్ద సంక్షోభాలు కూడా సులభంగా తొలగిపోతాయి. శని దోష తీవ్రత తగ్గుతుంది.

3.ఇంటి సింహద్వారం

పరమ ఏకాదశి సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారం బయట, మీరు బయటకు వెళ్లేటప్పుడు కుడి వైపున వచ్చేలా ఒక దీపాన్ని ఏర్పాటు చేయండి. ఈ దీపం ముఖం దక్షిణ దిశ వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల నరగోష, ప్రతికూల శక్తులు ఇంటి లోపలికి ప్రవేశించలేవు.

4.విష్ణు ఆలయం

వీలైతే ఈ రోజు సాయంత్రం ఏదైనా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లి, స్వామివారి పాదాల చెంత దీపదానం చేయండి. ఇది మీ జీవితంలో సుఖసంతోషాలను, ఐశ్వర్యాన్ని పెంచుతుంది.

దీపం వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలు

ఈ పవిత్రమైన రోజున ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం ఉత్తమం. వత్తి కోసం ఎరుపు రంగు దారాన్ని లేదా మామూలు పత్తి వత్తిని ఉపయోగించవచ్చు. ఒకవేళ పితృదేవతల స్మరణార్థం సింహద్వారం వద్ద దీపం పెడుతుంటే, అందులో కొన్ని నల్ల మినుములు వేయడం ఆనవాయితీ.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం జ్యోతిష్య నిపుణుల సూచనలు, శాస్త్రాల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. దీనిని పూర్తిగా ధృవీకరించడం లేదు. మరింత సమాచారం కోసం సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks