వాస్తు చిట్కాలు: ఇంట్లో ఓడ చిత్రం ఉండచ్చా? ఏ దిశలో ఉంటే ఐశ్వర్యం? చెయ్యకూడని తప్పులు తెలుసుకోండి!

ఇంట్లో ఓడ బొమ్మ లేదా చిత్రాన్ని ఉంచడం వల్ల కెరీర్, వ్యాపారంలో అద్భుతమైన ఎదుగుదల ఉంటుంది. అయితే దాన్ని ఏ దిశలో పెట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాస్తు శాస్త్ర నియమాలను ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jun 6, 2026, 08:00:39 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి మనం రకరకాల వస్తువులను కొనుగోలు చేస్తుంటాం. కొందరు లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని పెడితే, మరికొందరు ఏడు గుర్రాల పెయింటింగ్ తగిలిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచే ప్రతి వస్తువుకూ ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అవి మన ఇంట్లోని శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ క్రమంలోనే చాలా మంది తమ ఇల్లు లేదా ఆఫీసుల్లో డెకరేషన్ కోసం అందమైన ఓడ చిత్రాలను వాడుతుంటారు. అయితే, ఈ ఓడ బొమ్మను వాస్తు ప్రకారం సరైన దిశలో పెట్టకపోతే లాభాల కంటే నష్టాలే ఎక్కువ వస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఓడ చిత్రాన్ని ఏ దిశలో ఉంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

వాస్తు చిట్కాలు: ఇంట్లో ఓడ బొమ్మ ఏ దిశలో ఉంటే ఐశ్వర్యం వస్తుంది?
వాస్తు చిట్కాలు: ఇంట్లో ఓడ బొమ్మ ఏ దిశలో ఉంటే ఐశ్వర్యం వస్తుంది?

పురోగతికి ప్రతీక.. ఏ దిశలో పెట్టాలి?

వాస్తు శాస్త్రంలో సముద్రంలో ప్రయాణించే ఓడను ఉన్నతికి, జీవితంలో ముందుకు సాగడానికి ప్రతీకగా భావిస్తారు. ఇది ఇంట్లో సానుకూల శక్తిని (పాజిటివ్ ఎనర్జీని) పెంచుతుంది. వ్యాపారంలో లాభాలు రావాలన్నా, కెరీర్ లో కొత్త అవకాశాలు అందుకోవాలన్నా ఓడ చిత్రాన్ని ఉత్తర దిశలో పెట్టడం ఎంతో శుభప్రదం. అలాగే తూర్పు దిశలో ఉంచడం వల్ల సమాజంలో కీర్తిప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి.

సానుకూల శక్తి కోసం సరైన కోణం

ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషం, పాజిటివ్ వైబ్స్ ఉండాలంటే ఓడ బొమ్మను ఈశాన్య దిశలో అమర్చాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన నియమాన్ని గుర్తుంచుకోవాలి. "ఓడ మన ఇల్లు లేదా ఆఫీసు లోపలికి ప్రవేశిస్తున్నట్లుగా ఉండాలి కానీ, బయటకు వెళ్తున్నట్లుగా అస్సలు పెట్టకూడదు," అని ప్రముఖ వాస్తు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. లోపలికి వస్తున్నట్లు ఉంటే లక్ష్మీదేవి నడుచుకుంటూ ఇంట్లోకి వస్తుందని నమ్ముతారు. అదే ఓడ ముఖం బయటకు ఉంటే, ఇంట్లోని సంపద, సానుకూల శక్తి కూడా బయటకు వెళ్లిపోతాయి.

ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

ఓడ చిత్రాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పెట్టే చిత్రంలో సముద్రపు నీరు ఎంతో ప్రశాంతంగా, శుభ్రంగా ఉండాలి. ఓడ బొమ్మను ఎప్పుడూ కూడా బాత్‌రూమ్ ఎదురుగా అమర్చకూడదు. దీనివల్ల ఇంట్లో తీవ్రమైన వాస్తు దోషాలు ఏర్పడి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

మునిగిపోయే ఓడ చిత్రాలు ప్రమాదకరం

చాలా మంది తెలియక తుఫానులో చిక్కుకున్నట్లు ఉన్న ఓడల చిత్రాలను లేదా అలల మధ్య కొట్టుమిట్టాడుతున్న నౌకల ఫొటోలను ఇంట్లో పెడుతుంటారు. వాస్తు ప్రకారం ఇది అత్యంత ప్రమాదకరం. ప్రమాదానికి గురైన లేదా మునిగిపోతున్న ఓడ చిత్రాలను ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల జీవితాల్లోనూ ఊహించని ఒడిదొడుకులు, ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారాలు అకస్మాత్తుగా నష్టాల్లోకి జారుకుంటాయి. కాబట్టి ఎల్లప్పుడూ ప్రశాంతమైన వాతావరణంలో, గంభీరంగా సాగిపోయే ఓడల చిత్రాలను మాత్రమే ఎంచుకోవాలి.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, వాస్తు శాస్త్ర ఆధారంగా రాసినది మాత్రమే. దీనిని పూర్తిగా ధృవీకరించడం లేదు. మరింత సమాచారం కోసం సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More