వాస్తు చిట్కాలు: మీ ఇంట్లో ఈ 5 పెయింటింగ్స్ ఉంటే చాలు.. అదృష్టం మీ తలుపు తడుతుంది!
ఇంటి అందాన్ని పెంచడమే కాదు, వాస్తు దోషాలను తొలగించి సానుకూల శక్తిని ఆహ్వానించడంలో కొన్ని చిత్రపటాలు కీలక పాత్ర పోషిస్తాయి. మీ జాతకాన్ని మార్చే ఆ 5 పెయింటింగ్స్ ఏవో తెలుసుకోండి.
చాలా మంది ఇళ్లల్లో వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఈ పెయింటింగ్స్‌ని పెట్టడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి ఇల్లంతా వ్యాపిస్తుంది. చాలా మంది ఇళ్లల్లో రకరకాల పెయింటింగ్లు, చిత్రాలు వంటివి పెడుతూ ఉంటారు.

ఇవి అందానికే కాదు, వాస్తుని సరి చేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి. వాస్తు దోషాలను తగ్గించే శక్తి వీటికి ఉంటుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు, మానసిక ప్రశాంతత ఇలా ఎన్నో వాటికి సహాయ పడతాయి. ఈ పెయింటింగ్స్‌ని ఇంట్లో పెట్టడం వలన ఒక్కసారిగా అనేక మార్పులను చూడొచ్చు.
ఇంట్లో ఈ ఐదు పెయింటింగ్స్‌ని పెట్టండి. వాస్తు దోషాలు తగ్గి, సంతోషం పెరుగుతుంది
1.సూర్యోదయం
సూర్యోదయానికి సంబంధించిన పెయింటింగ్స్ లేదా చిత్రాలను ఇంట్లో పెట్టడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఈ పెయింటింగ్‌ని ఇంట్లో పెట్టినప్పుడు తూర్పు వైపు పెట్టడం మంచిది. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. బాగా కలిసి వస్తుంది.
2.ఏడు గుర్రాల ఫోటో
ఏడు గుర్రాల ఫోటో లేదా పెయింటింగ్ ఇంట్లో పెట్టడం వలన అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. వాస్తు ప్రకారం ఈ ఫోటో లేదా పెయింటింగ్‌ని దక్షిణ దిశలో పెట్టడం మంచిది. బెడ్‌రూమ్ లేదా డ్రాయింగ్ రూమ్‌లో పెడితే శుభ ఫలితాలను చూడొచ్చు.
3.రాధాకృష్ణుల ఫోటో
రాధాకృష్ణుల ఫోటోను చాలా మంది బెడ్‌రూమ్‌లో పెడుతూ ఉంటారు. నిజానికి ఈ ఫోటోని ఉంచడం వలన సానుకూల శక్తి పెరుగుతుంది. భార్యా భర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఆనందంగా ఉండడానికి వీలవుతుంది.
4.ఎగురుతున్న హంసలు
ఎగురుతున్న హంసలు లేదా ఇతర పక్షుల ఫోటోలను ఇంట్లో పెట్టడం వలన ప్రతికూల శక్తి తగ్గి, సానుకూల శక్తి పెరుగుతుంది. ఈ పెయింటింగ్‌ని ఉత్తరం లేదా తూర్పు వైపు పెట్టడం మంచిది. దీనితో సంపద పెరుగుతుంది. సానుకూల శక్తి కూడా ఎక్కువ అవుతుంది.
5.తామర పువ్వుల ఫోటోలు
ఈ ఫోటోలు లేదా పెయింటింగ్లను కూడా ఇంట్లో పెట్టండి. ఇవి కూడా సానుకూల శక్తిని తీసుకురావడానికి సహాయం చేస్తాయి. లివింగ్ రూమ్‌లో పెడితే శుభ ఫలితాలు ఎదురవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది.
ఈ పెయింటింగ్స్ ని ఇంట్లో పెట్టడం వలన ఇల్లు అందం పెరగడంతో పాటుగా పైన చెప్పిన లాభాలు అన్నిటిని పొందవచ్చు. సానుకూల శక్తి పెరుగుతుంది. కుటుంబ సమస్యలు తగ్గుతాయి. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండొచ్చు. ఇబ్బందులు అన్నీ కూడా తగ్గుతాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


