మణిద్వీప వర్ణన పారాయణం, 7 చింతపిక్కల పరిహారం.. మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే ఇలా చేయండి!

Wealth Remedies: ఆర్థిక ఇబ్బందులు, దిష్టి దోషాలు, కుటుంబ కలహాల నుంచి బయటపడటానికి మన పురాణాలు, సంప్రదాయాల్లో కొన్ని అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి. చింతపిక్కల నుండి హుండీలో వేసే డబ్బు వరకు ఏవి ఎలా పనిచేస్తాయో ఇక్కడ తెలుసుకోండి. 

Published on: May 26, 2026, 17:00:48 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలా మంది ఇళ్లల్లో రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సమస్యల నుంచి బయటపడడానికి, ఆర్థిక బాధల నుంచి, కలహాల నుంచి, దిష్టి బాధల నుంచి బయటపడడానికి కొన్ని చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈరోజు సంతోషంగా ఉండడానికి, అదృష్టం పెరగడానికి కొన్ని పరిహారాలను చూద్దాం. ఇవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. సమస్యలను చిటికెలో తొలగిస్తాయి.

మణిద్వీప వర్ణన పారాయణం, 7 చింతపిక్కల పరిహారం.. మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే ఇలా చేయండి! (pinterest)
మణిద్వీప వర్ణన పారాయణం, 7 చింతపిక్కల పరిహారం.. మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే ఇలా చేయండి! (pinterest)

చీమలు పట్టే చోట ఇలా చేయండి

ఏడు చింతపిక్కలను తీసుకుని ఎక్కడైనా చీమలు పట్టే చోట వాటిని వేయండి. చీమలు తినే కొద్దీ దిష్టి తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. వివిధ మార్గాల ద్వారా డబ్బు మీ చేతికి వస్తుంది.

మంగళవారం నాడు ఈ పరిహారాన్ని పాటించండి

మంగళవారం కొంచెం చింతపండును ఎవరూ తిరగని చోట, నిర్మానుష్య ప్రదేశంలో వేయండి. దీంతో కుటుంబంలో ఉన్న కలహాలు దూరం అవుతాయి. అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది.

హుండీలో ఎంత వేయాలి? దాని వలన కలిగే ప్రయోజనాలు ఏంటి?

హుండీలో 7 రూపాయలు వేయడం వలన అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. ఆరోగ్యంగా ఉండొచ్చు.

హుండీలో 9 రూపాయలు వేయడం వలన శత్రు భయం తొలగిపోయి, శని దోషాలు కూడా తొలగిపోతాయి.

హుండీలో 11 రూపాయలు వేస్తే అప్పుల బాధల నుంచి బయటపడొచ్చు. ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరంగా ఉండొచ్చు.

హుండీలో 12 రూపాయలు వేస్తే సుఖసంతోషాలు కలుగుతాయి. ఎలాంటి చిన్న సమస్యలు ఉన్నా సరే మాయమైపోతాయి.

హుండీలో 21 రూపాయలు వేయడం వలన దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుంది. ఆనందంగా ఉండొచ్చు.

లక్ష్మీ కటాక్షానికి రాజమార్గం మణిద్వీప వర్ణన పారాయణం

లక్ష్మీదేవి ఎప్పుడూ ఒకే చోట ఉండదు. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి. అలాగే ఇంట్లో మణిద్వీప వర్ణన పారాయణం చేస్తే కూడా మంచి జరుగుతుంది. శుక్రవారం, పౌర్ణమి, అమావాస్య నాడు మణిద్వీపవర్ణన పారాయణం చేస్తే చాలా మంచిది. మణిద్వీప వర్ణన పారాయణం ప్రదోషకాలంలో చేయాలి. అంటే సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు.

11 రకాల పూలతో 11 సార్లు మణిద్వీప వర్ణన పారాయణం చేయడం వలన మనశ్శాంతి కలుగుతుంది. ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.

21 రకాల పుష్పాలతో 21 సార్లు పారాయణం చేస్తే కార్యసిద్ధి కలుగుతుంది.

32 సార్లు, 32 రకాల పువ్వులతో మణిద్వీప వర్ణన పారాయణం చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది.

మణిద్వీప వర్ణన పారాయణం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు

ఉతికిన బట్టలతో పూజగదిలో కూర్చుని మణిద్వీప వర్ణన పారాయణం చేయాలి.

ముందు ఆవు నెయ్యితో రెండు దీపాలను వెలిగించి, ఆ తర్వాత పూజ చేయాలి.

అమ్మవారికి సంకల్పం చెప్పుకోవాలి. మీకు ఏది కావాలనుకుంటే అది సంకల్పం చెప్పుకుని, మణిద్వీపం అద్భుతాలను తలుచుకుంటూ ఏకాగ్రతతో పూజ చేయాలి.

చివరగా ఆ అమ్మకు పాలు, పండ్లు నైవేద్యంగా సమర్పించాలి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More