Padmini Ekadashi: పద్మిని ఏకాదశి ఎప్పుడు? తేదీ, సమయంతో పాటు లక్ష్మీదేవి, విష్ణువు అనుగ్రహం కోసం ఏం చెయ్యాలో తెలుసుకోండి!

అధిక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని పద్మిని ఏకాదశి అని అంటాము. ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? తేదీ, శుభ సమయం, ప్రాముఖ్యత తో పాటుగా పూజా విధానం గురించి కూడా తెలుసుకోండి. ఈ ఏకాదశి నాడు వీటిని పాటిస్తే విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.

Published on: May 20, 2026, 17:58:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అధిక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పద్మిని ఏకాదశి అని అంటాము. ఈ సంవత్సరం ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? విశేషమైన పురుషోత్తమ మాసంలో వచ్చే ఈ ఏకాదశి తేదీ, సమయంతో పాటు పూజా విధానం, పఠించాల్సిన మంత్రాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం.

పద్మిని ఏకాదశి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు లక్ష్మీదేవి, విష్ణువు అనుగ్రహం కోసం ఏం చెయ్యాలో తెలుసుకోండి! (pinterest)
పద్మిని ఏకాదశి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు లక్ష్మీదేవి, విష్ణువు అనుగ్రహం కోసం ఏం చెయ్యాలో తెలుసుకోండి! (pinterest)

ఈ పద్మిని ఏకాదశిని పురుషోత్తమ ఏకాదశి లేదా కమల ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే విష్ణు అనుగ్రహం కలిగి పాపాలన్నీ తొలగిపోతాయి. సుఖశాంతులు, ఐశ్వర్యం కలుగుతాయి.

పద్మిని ఏకాదశి 2026

మామూలుగా ప్రతి నెలలో కూడా రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో. అంటే సంవత్సరానికి 24 ఏకాదశులను మనం జరుపుకుంటాము. ప్రత్యేకమైన యోగం ఈ పద్మిని ఏకాదశి నాడు రాబోతోంది. ఈ ఏడాది అధిక మాసం కాబట్టి 26 ఏకాదశులు వచ్చాయి. అధిక జ్యేష్ఠ మాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పద్మిని ఏకాదశిగా మనం జరుపుకుంటాము.

పద్మిని ఏకాదశి తేదీ, శుభ సమయం

అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్ష పద్మిని ఏకాదశి మే 27, బుధవారం నాడు వచ్చింది. ఏకాదశి తిథి మే 26 ఉదయం 5:10కి మొదలవుతుంది. మే 27 ఉదయం 6:21తో ఏకాదశి తిథి ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఏకాదశి వ్రతాన్ని మే 27, బుధవారం నాడు జరుపుకోవాలి. వ్రత పారణ సమయం మే 28 ఉదయం 5:25 నుంచి 7:56 గంటల మధ్య ఉంటుంది.

పద్మిని ఏకాదశి ప్రాముఖ్యత

ఈ ఏకాదశిని పురుషోత్తమ ఏకాదశి అని కూడా అంటాము. శాస్త్రాల ప్రకారం చూసినట్లయితే అధిక మాసానికి అధిదేవత విష్ణువు. అందుకనే ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే ఎంతో పుణ్యం కలుగుతుంది.

నెలలో చేసే దానం, తపస్సు, జపానికి ఎన్నో రెట్లు ఫలితాన్ని పొందవచ్చు. పద్మిని ఏకాదశి వ్రతం చేస్తే యజ్ఞాలు చేసినంత ఫలితం లభిస్తుంది.

భక్తిశ్రద్ధలతో పద్మిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే యజ్ఞాలు చేసినంత పుణ్యం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పబడింది. చేసిన పాపాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయి. మోక్షం లభిస్తుంది.

పద్మిని ఏకాదశి నాడు పూజ ఎలా చేసుకోవాలి?

  1. విష్ణువు, లక్ష్మీదేవితో కలిసి ఉన్న ఫోటోలను పెట్టి ఈరోజు ఆరాధించాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు కట్టుకోవాలి. విష్ణువు ముందు కూర్చుని ఉపవాస సంకల్పం చెప్పుకోండి.
  2. ఆ తర్వాత ఒక పీటపై వస్త్రం వేసి విష్ణువు, లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహాన్ని పెట్టండి. ఈరోజు విష్ణువుకి ఎంతో ఇష్టమైన పసుపు పూలు, పసుపు రంగులో ఉండే పండ్లను సమర్పించండి. దీపం, ధూపాలతో పూజ చేయండి.
  3. తులసి దళాలను తప్పకుండా విష్ణువుకి సమర్పించండి. విష్ణు మంత్రాలను జపించి వ్రత కథను కూడా చదువుకోండి. ఏకాదశి నాడు జాగరణ చేస్తే కూడా ఎంతో మంచి ఫలితం ఉంటుంది.
  4. ఈ విశేషమైన రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే విష్ణువు అనుగ్రహం కలుగుతుంది.
  5. తర్వాత వచ్చే ద్వాదశి నాడు శుభ ముహూర్తంలో బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది.
  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More