Apara Ekadashi: ఈరోజు అపర ఏకాదశి వేళ చేయాల్సిన 10 పనులు, తులసి పరిహారాలు, పఠించాల్సిన మంత్రాలు ఇవే!

Apara Ekadashi: విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన ఏకాదశి పర్వదినాన తులసి దేవిని ఆరాధించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి అపర ఏకాదశి నాడు పాటించాల్సిన కొన్ని శక్తివంతమైన తులసి పరిహారాలు ఇక్కడ ఉన్నాయి.

Published on: May 13, 2026, 07:30:09 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశినే అపర ఏకాదశి అని అంటాము. అపర ఏకాదశి నాడు విష్ణువును భక్తితో ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఏకాదశిని అచల ఏకాదశి, భద్రకాళి ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి తిథి మే 12 మధ్యాహ్నం 2:52కి ప్రారంభమై, మే 13 మధ్యాహ్నం 1:29తో ముగుస్తుంది. ఈ లెక్కన మే 13, బుధవారం నాడు అపర ఏకాదశిని జరుపుకోవాలి.

Apara Ekadashi: ఈరోజు అపర ఏకాదశి వేళ చేయాల్సిన 10 పనులు, తులసి పరిహారాలు, పఠించాల్సిన మంత్రాలు (pinterest)
Apara Ekadashi: ఈరోజు అపర ఏకాదశి వేళ చేయాల్సిన 10 పనులు, తులసి పరిహారాలు, పఠించాల్సిన మంత్రాలు (pinterest)

ఈరోజు అపర ఏకాదశిని పాటించేవారు కచ్చితంగా ఈ 10 పనులను కూడా పాటించేలా చూసుకోండి. అలాగే ఈ తులసి పరిహారాలను కూడా తప్పక పాటించండి. ఈ మంత్రాలనూ పఠించండి. దీంతో అనేక విధాలుగా శుభ ఫలితాలను పొందవచ్చు.

ఈరోజు అపర ఏకాదశి వేళ తప్పకుండా చేయాల్సిన పది పనులు:

1.ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి:

ఏకాదశి నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే శుభ ఫలితాలను పొందవచ్చు. ఆ తర్వాత స్నానం చేసి దేవుడిని ప్రార్థించడం వలన మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది.

2.ఉపవాసం:

ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యం వస్తుంది. అన్నం తినకుండా పాలు, పండ్లు తీసుకుని ఉపవాసం ఉండొచ్చు. ఇలా చేస్తే శరీరం, మనసు రెండూ కూడా పవిత్రంగా మారుతాయి.

3.విష్ణువును పూజించండి:

ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఆరాధన తప్పక చేయాలి. తులసి దళాలతో విష్ణువును ఆరాధించడం వలన ప్రత్యేకమైన ఫలితాలను పొందవచ్చు.

4.తులసి మొక్క పూజ:

తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావిస్తాము. ఏకాదశి నాడు తులసి మొక్క ముందు దీపం పెట్టి పూజ చేయడం వలన శుభం, సంపద కలుగుతాయి.

5.విష్ణు సహస్రనామం:

ఈరోజు విష్ణు సహస్రనామం లేదా భగవద్గీత చదవండి. ఇది చాలా మంచిది. పాపాలన్నీ తొలగిపోతాయి. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది.

6.దానాలు:

ఏకాదశి నాడు దానాలు చేస్తే కూడా విశేషమైన ఫలితాలను పొందవచ్చు. పేదవారికి బట్టలు, ఆహారం, ధాన్యం లాంటివి దానం చేయండి. దానం చేయడం వలన అనేక రెట్లు ఫలితాన్ని పొందడానికి వీలవుతుంది.

7.విష్ణు ఆలయ దర్శనం:

విష్ణు ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటే శుభ ఫలితాలను పొందవచ్చు. ఆలయంలో కాసేపు సమయాన్ని గడిపితే భక్తి భావం పెరుగుతుంది.

8.సాత్విక ఆహారం:

ఏకాదశి నాడు ఉపవాసం ఉండని వారు ఉల్లి, వెల్లుల్లి లాంటి ఆహారాలను తీసుకోవద్దు. సాత్విక ఆహారం తీసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది.

9.కోపం, చెడు మాటలు వద్దు:

ఏకాదశి నాడు ఎవరి మీద కోప్పడకండి. ఎవరిని బాధ పెట్టకండి. మంచి ఆలోచనలతో, మంచి మాటలతో ఉండడం వలన పుణ్యం కలుగుతుంది.

10.జాగరణ:

ఏకాదశి రోజు చాలా మంది భజనలు, ప్రార్థనలు చేస్తూ జాగరణ ఉంటారు. అలా చేస్తే విష్ణువు అనుగ్రహం లభిస్తుంది.

ఏకాదశి నాడు ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఈ తులసి పరిహారాలను పాటించండి:

  • అపర ఏకాదశి నాడు తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపం పెడితే శుభ ఫలితాలను పొందవచ్చు.
  • అలాగే “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
  • తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచి జరుగుతుంది. 11 లేదా 21 ప్రదక్షిణలు చేస్తే విష్ణు అనుగ్రహాన్ని, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు.
  • ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు రాగి పాత్రలో నీళ్లు పోసి, చిటికెడు పసుపు వేసి తులసి మొక్క మొదట్లో వేయండి. ఈ చిన్న పరిహారంతో విష్ణు అనుగ్రహం లభిస్తుంది. ధనప్రాప్తి కూడా కలుగుతుంది.
  • తులసి మొక్క దగ్గర కూర్చుని విష్ణు సహస్రనామం లేదా అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదువుకోండి. ఇలా చేయడం వలన కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గిపోతాయి. ప్రశాంతత ఉంటుంది.

ఈ మంత్రాలను పఠిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు.. అపర ఏకాదశి వేళ ఈ మంత్రాలను చదువుకోండి:

1.విష్ణు గాయత్రి మంత్రం:

“ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్”

2.అచ్యుతానంద గోవింద మంత్రం:

“అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజాత్

నశ్యంతి సకల రోగాః సత్యం సత్యం వదామ్యహం”

3.లక్ష్మీనారాయణ మంత్రం:

“ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీనారాయణాయ నమః”

ఈ మంత్రం చదవడం వలన కార్యసిద్ధి కలుగుతుంది.

4.రామ నామ మంత్రం:

“శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే”

వీటిని చదువుకుంటే జీవితంలో గొప్ప మలుపు వస్తుంది. విష్ణు నామస్మరణతో ఈ ఏకాదశిని పవిత్రం చేసుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More