Ekadashi: అపర ఏకాదశి మే 12న, 13న? ఈ ఒక్క తప్పు చేసినా పుణ్యమంతా హరించుకు పోతుంది.. అంతులేని ఐశ్వర్యం కోసం ఇలా చేయండి!

Ekadashi: హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా జ్యేష్ఠ మాసంలో వచ్చే 'అపర ఏకాదశి' భక్తుల పాపాలను హరించి, అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది అపరా ఏకాదశి ఎప్పుడు? పూజా విధానం, ముహూర్తం మరియు నియమాలపై ప్రత్యేక కథనం.

Published on: May 8, 2026, 08:00:35 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Apara Ekadashi 2026: హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి వ్రతం అత్యంత శక్తివంతమైనది. 'అపర' అంటే అపారమైన లేదా అంతులేని అని అర్థం. ఈ రోజున భక్తులు చేసే పూజలు, దానధర్మాల వల్ల అపారమైన పుణ్యఫలం దక్కుతుంది కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. తెలిసి తెలియక చేసే పాపాల నుంచి విముక్తి పొందడానికి, మానసిక ప్రశాంతతను దక్కించుకోవడానికి ఈ ఏకాదశి వ్రతం ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది.

Ekadashi: అపర ఏకాదశి మే 12న, 13న? ఈ ఒక్క తప్పు చేసినా పుణ్యమంతా హరించుకు పోతుంది
Ekadashi: అపర ఏకాదశి మే 12న, 13న? ఈ ఒక్క తప్పు చేసినా పుణ్యమంతా హరించుకు పోతుంది

ముహూర్తం, తిథి వివరాలు

ఈ ఏడాది ఏకాదశి తిథి మే 12వ తేదీ మధ్యాహ్నం 09:56 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే, మన సనాతన ధర్మంలో ఉదయ తిథికి (సూర్యోదయ సమయానికి ఉన్న తిథి) ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి, మే 13, బుధవారం నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని పండితులు నిర్ణయించారు.

వ్రత ప్రారంభం: మే 13, 2026

వ్రత పారణ (ఉపవాస విరమణ): మే 14, ఉదయం 06:00 గంటల నుంచి 07:41 గంటల మధ్య.

ద్వాదశి తిథి ముగింపు: మే 14, ఉదయం 07:41 గంటలకు.

పూజా విధానం: ఇలా చేస్తే విష్ణువు అనుగ్రహం మీ సొంతం!

అపర ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో కొలిచే వారు ఈ పద్ధతిని పాటించాలి:

శుచీ శుభ్రత: సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాదికాలు ముగించుకోవాలి. వీలైతే స్నానపు నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకోవడం శ్రేయస్కరం.

సంకల్పం: పూజ గదిలో దీపం వెలిగించి, రోజంతా ఉపవాసం ఉంటానని, విష్ణువుకు సేవ చేస్తానని సంకల్పం చెప్పుకోవాలి.

అభిషేకం: “ఓం లక్ష్మీ నారాయణాయ నమః” అనే మంత్రాన్ని జపిస్తూ స్వామివారికి పాలు, పంచామృతాలు మరియు శుద్ధ జలంతో అభిషేకం చేయాలి.

అలంకరణ: విష్ణుమూర్తికి చందనం, కుంకుమ, పసుపు, పూలు మరియు తులసి దళాలను సమర్పించాలి. లక్ష్మీదేవికి పసుపు, కుంకుమలతో పూజ చేయాలి.

నైవేద్యం: పండ్లు, తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి. పూజ ముగిసిన తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంపిణీ చేయాలి.

ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారు కొన్ని కఠిన నియమాలను పాటించడం తప్పనిసరి. లేదంటే వ్రత ఫలం దక్కదు.

అపర ఏకాదశి నాడు చేయాల్సిన పనులు:

జాగరణ: ఏకాదశి రాత్రి నిద్రపోకూడదు. రాత్రంతా విష్ణు సహస్రనామ పారాయణం, భజనలు లేదా స్వామివారి మంత్రాలను జపిస్తూ గడపాలి. దీని వల్ల వంశాభివృద్ధి మరియు పురోభివృద్ధి కలుగుతుంది.

దానం: శక్తి కొద్దీ పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి.

అపర ఏకాదశి నాడు చేయకూడని పనులు:

అన్నం తినవద్దు: ఏకాదశి రోజున వ్రతం ఉన్నా లేకపోయినా బియ్యంతో చేసిన పదార్థాలను అస్సలు తినకూడదు. పురాణాల ప్రకారం ఈ రోజున అన్నం తింటే వచ్చే జన్మలో కీటకాలుగా పుడతారని ఒక నమ్మకం ఉంది.

తులసి ఆకులు: ఏకాదశి రోజున తులసి ఆకులను కోయడం మహా పాపంగా పరిగణిస్తారు. పూజకు కావాల్సిన ఆకులను ముందు రోజే కోసి పెట్టుకోవాలి.

అశుభ్రత: ఈ రోజున జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు తీసుకోవడం వంటి పనులు చేయకూడదు.

ప్రవర్తన: కోపం, అసూయ, ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం వంటివి మానుకోవాలి. ఎప్పుడూ భగవన్నామ స్మరణలోనే ఉండాలి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More