Tulasi Mala: తులసి మాలను ఏ రోజు ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? ధరించే ముందు నియమాలు, ప్రయోజనాలు తెలుసుకోండి!

Tulasi Mala: హిందూ ధర్మంలో తులసికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. 'విష్ణు ప్రియ'గా పిలిచే తులసిని ధరించడం వల్ల సకల పాపాలు తొలగిపోవడమే కాకుండా, సాక్షాత్తు మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే, తులసీ మాలను ధరించేటప్పుడు పాటించాల్సిన నియమాలివే!

Published on: Apr 27, 2026, 12:01:03 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తులసి మొక్కను ఎంత పవిత్రంగా పూజిస్తామో, దాని కాండం నుంచి తయారు చేసిన తులసీ మాలను ధరించడం కూడా అంతే పవిత్రమైనది. ఏ ఇంట్లో తులసి కోట ఉంటుందో అక్కడ సానుకూల శక్తి వెల్లివిరుస్తుందని మన నమ్మకం. అదేవిధంగా, తులసి మాలను కంఠంలో ధరించడం వల్ల మనపై ఎటువంటి ప్రతికూల శక్తుల ప్రభావం పడదు. కానీ, తులసి మాలను ధరించడం అంటే కేవలం ఒక ఆభరణం వేసుకోవడం కాదు, ఒక క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టడమే.

Tulasi Mala: తులసి మాలను ఏ రోజు ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి?
Tulasi Mala: తులసి మాలను ఏ రోజు ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి?

తులసి మాల ధారణకు ప్రేమానంద్ మహారాజ్ సూచనలు

మధుర-బృందావనానికి చెందిన ప్రముఖ సంత్ ప్రేమానంద్ మహారాజ్ అభిప్రాయం ప్రకారం, తులసీ మాలను ఎవరైనా ధరించవచ్చు. కానీ దీనికి కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి:

ఆహార నియమాలు: మాలను ధరించిన వారు మాంసాహారం, మద్యానికి పూర్తి దూరంగా ఉండాలి. తామసిక ఆహారాన్ని త్యజించాలి.

వాక్కు శుద్ధి: తులసి మాల వేసుకున్న వ్యక్తి ఎప్పుడూ అబద్ధాలు ఆడకూడదు, ఇతరులను దూషించకూడదు లేదా అసభ్య పదజాలం వాడకూడదు. నోటితో నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలి.

మరణ సూతకం: ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు (సూతకం ఉన్నప్పుడు) కొత్తగా మాలను ధరించకూడదు. సూతకం ముగిసిన 13వ రోజున స్నానాది కార్యక్రమాల తర్వాతే మాలను ధరించాలి.

నిరంతర ధారణ: ఒక్కసారి మాలను ధరిస్తే, దానిని మాటిమాటికీ తీసి పక్కన పెట్టకూడదు. ప్రతిరోజూ పూజ చేసేటప్పుడు మాలకు కూడా నమస్కరించుకోవాలి.

మాల ధరించేటప్పుడు గమనించాల్సిన అంశాలు

తులసి మాల ద్వారా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లేదా విష్ణుమూర్తి కృప పొందాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి:

ఖండిత మాల వద్దు: పూసలు పగిలిపోయిన లేదా దారం తెగిపోయిన మాలను అస్సలు ధరించకూడదు. అది అశుభంగా భావిస్తారు.

ప్రసాదంగా స్వీకరించండి: వీలైతే ఏదైనా పవిత్ర క్షేత్రంలో లేదా అనుభవజ్ఞులైన సాధువుల చేతుల మీదుగా పూజ చేయించిన మాలను ప్రసాదంగా ధరించడం విశేష ఫలితాన్నిస్తుంది.

ధరించే విధానం: ఒకవేళ గొలుసులా మెడలో వేసుకోవడం కుదరకపోతే, మణికట్టుకు (కుడి చేతికి) ధరించవచ్చు. ఏదైనా కారణం చేత మాలను తీయాల్సి వస్తే, మళ్ళీ వేసుకునే ముందు గంగాజలంతో శుద్ధి చేయాలి.

ఏ రోజు ధరిస్తే మంచిది?

ధార్మిక విశ్వాసాల ప్రకారం, తులసీ మాలను ధరించడానికి గురువారం అత్యంత ప్రశస్తమైన రోజు. ఎందుకంటే గురువారం విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. ఇది కాకుండా ఏకాదశి, పౌర్ణమి లేదా ఏదైనా శుభ ముహూర్తంలో స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో కూర్చుని, భగవంతుడిని ధ్యానిస్తూ మాలను ధరించాలి. ఇది మనసులో సానుకూలతను, ప్రశాంతతను నింపుతుంది.

తులసి మాల ధారణ వల్ల కలిగే ప్రయోజనాలు

తులసి మాలను ధరించడం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా మానసికంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. దీనివల్ల వ్యక్తిలో భక్తి భావం పెరుగుతుంది. మనసులోని చంచలత్వం తగ్గి స్థిరత్వం లభిస్తుంది. శాస్త్రాల ప్రకారం, తులసి మాలను ధరించిన వ్యక్తిపై యమధర్మరాజు దృష్టి పడదని, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, మన జీవనశైలిని పవిత్రంగా మార్చుకోవడానికి ఒక గొప్ప మార్గం.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More