Remedies: అన్ని దారులూ మూసుకుపోయాయా? అయితే ఈ సతనాజ పరిహారం పాటించండి.. ఈ 7 ధాన్యాలతో అదృష్టం మీ సొంతం!
Remedies: జీవితంలో వరుస కష్టాలు, ఆగిపోతున్న పనులతో సతమతమవుతున్నారా? సతనాజా అనే ఏడు ధాన్యాల శక్తివంతమైన పరిహారం మీ సమస్యలకు ఎలా చెక్ పెడుతుందో, వివాహ ప్రయత్నాల్లో విజయం ఎలా సిద్ధిస్తుందో ఇక్కడ చదవండి.
ఒక్కోసారి అన్ని దారులు మూసుకుపోతాయి. అలాంటప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితి కలుగుతుంది. ఏది ఏమైనా వాటిని దాటాలని ఎంతో ట్రై చేస్తుంటారు. అయినప్పటికీ ఒక్కోసారి అనుకున్నట్టు జరగవు. అలాంటప్పుడు కొన్ని పరిహారాలను ప్రయత్నించడం మంచిది. ముఖ్యంగా అన్ని దారులు మూసుకుపోయి ఏం చేయాలో తోచనప్పుడు ఈ సతనాజ ఉపాయాన్ని ట్రై చేసి చూడండి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఉన్న అడ్డంకుల్ని, ఇబ్బందుల్ని పోగొడుతుంది.

ఈ సమస్యలు పరిష్కారమవుతాయి
ఒక్కోసారి కష్టపడినా ఫలితం ఉండదు. అలాగే ఇంట్లో ఏదో ఒక అనారోగ్య సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు మనల్ని వదలకుండా మనతోనే ఉంటాయి. అదృష్టం కూడా ఆ సమయంలో కలిసి రాకపోవచ్చు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ సతనాజా ఉపాయాన్ని ప్రయత్నం చేసి చూడండి. అద్భుతంగా ఆ పని చేయొచ్చు. మీకున్న అడ్డంకులు, సమస్యలు తొలగిపోవచ్చు.
సతనాజ అంటే ఏంటి?
సతనాజ అంటే 7 ధాన్యాల మిశ్రమం. సంస్కృతంలో “సప్త” అంటే ఏడు అని అర్థం. “నాజా” అంటే ధాన్యం. ఈ ఏడు ధాన్యాల పరిహారాన్ని సతనాజా పరిహారం అంటారు.
ఆ ధాన్యాలు ఏంటి?
జొన్నలు, మొక్కజొన్న, గోధుమలు, సెనగలు, సజ్జలు, బియ్యం, బార్లీ.
ఈ పరిహారాన్ని ఎలా పాటించాలి?
ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు, అడ్డంకులతో ఇబ్బందులు పడుతున్నప్పుడు, పనులు ఆగిపోతున్నప్పుడు, లేకపోతే పెద్ద సంక్షోభం ఎదురవుతున్నప్పుడు ఉదయం పూట ఈ పరిహారాన్ని పాటించండి. ఉదయం 3 గుప్పెల సతనాజాను తీసుకోండి.
ఒంట్లో బాగోకపోతే, ఎవరికైతే బాగోలేదో వారి చుట్టూ మూడు సార్లు క్లాక్‌వైస్‌లో, మూడు సార్లు యాంటీ క్లాక్‌వైస్‌లో తిప్పాలి. ఆ తర్వాత ఆ ధాన్యాన్ని తీసుకువెళ్లి పక్షులకు ఆహారంగా పెట్టండి.
అలాగే ఎవరైతే కష్ట పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరికి అదృష్టం కలిసి రాకపోతున్నదో, అడ్డంకులు ఎదురవుతున్నాయో, ఇలా వారి చుట్టూ ధాన్యాన్ని తిప్పి ఆ తర్వాత పక్షులకు వేయండి. ఇలా చేయడం వలన అసాధ్యం అనుకున్నవి కూడా సుసాధ్యంగా మారుతాయి. అడ్డంకులు తొలగిపోతాయి. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. అన్ని వైపుల నుంచి మూసుకుపోయిన ద్వారాలు తెరుచుకుంటాయి. ఇలా ఈ పరిహారాలతో అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు. జీవితంలో అనేక మార్పులు వస్తాయి.
వివాహ పరిష్కారాలు
ఒకవేళ వివాహం అవ్వక ఇబ్బంది పడుతున్న వారు వివాహ ప్రాప్తి కోసం ఈ ముఖ్యమైన మంత్రాలను పఠించండి. ఇక అద్భుతమైన మార్పులు వస్తాయి.
వివాహ ప్రాప్తి కోసం పాటించాల్సిన మంత్రాలు, చేయాల్సిన పూజలు:
ఓం గం గణపతయే నమః
కాత్యాయనీ మహామాయే మహాయోగిన్యధీశ్వరి
నందగోపసుతం దేవి పతిం మే కురు తే నమః
ఈ మంత్రాలను, శ్లోకాలను చదువుకుంటే మంచి ఫలితాలను చూడొచ్చు.
పూజ ఎలా చేయాలి?
ప్రతి శుక్రవారం లేదా మంగళవారం నాడు పూజ చేయండి.
గణేశుడికి, పార్వతీ పరమేశ్వరులకు పూజ చేయండి.
అష్టోత్తర నామాలను చదవండి.
కాత్యాయనీ వ్రతం లేదా కాత్యాయనీ దేవికి ప్రత్యేక పూజ చేస్తే కూడా వివాహం అవుతుంది.
గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే కూడా వివాహం కుదురుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


