త్వరలో శుక్ర-కేతువుల కలయిక.. ఈ 3 రాశులకు కష్టాలు.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది!
జూలై 4న సింహ రాశిలో శుక్రుడు, కేతువు కలవబోతున్నారు. ఈ అరుదైన గ్రహ గతుల వల్ల వృషభ, తులా, కుంభ రాశుల వారు ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో తీవ్ర జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా సంపద, వైభవం, విలాసాలకు కారకుడైన శుక్రుడు.. ఆధ్యాత్మికత, మోక్షం, అనూహ్య మార్పులకు సంకేతమైన కేతువుతో కలిసినప్పుడు విలక్షణమైన పరిస్థితులు ఏర్పడతాయి. 2026 జూలై మాసంలో ఇలాంటి ఒక అరుదైన కలయిక సింహ రాశిలో జరగబోతోంది.

ప్రస్తుతం సింహ రాశిలో కేతువు ఉన్నాడు. జూలై 4వ తేదీన శుక్రుడు కూడా అదే రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసొస్తే, మరికొన్ని రాశుల వారు మాత్రం మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ్ఞతుంది.
సింహ రాశిలో ఈ గ్రహాల కలయిక వల్ల రిలేషన్ షిప్స్ లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భావోద్వేగాల విషయంలో పొరపాట్లు జరిగే ప్రమాదం ఉంది. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. పండితుల విశ్లేషణ ప్రకారం ఏయే రాశుల వారు అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం.
వృషభ రాశి: పెరగనున్న మానసిక ఆందోళన
ఈ రాశి వారికి శుక్ర-కేతువుల కలయిక కొంత కష్టకాలంగానే మారుతుంది. ముఖ్యంగా వ్యక్తిగత బంధాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరిగి ప్రశాంతత లోపిస్తుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి, తద్వారా ఆర్థిక స్థితి గతి తలకిందులయ్యే ప్రమాదం ఉంది. ఆఫీసు పనుల్లో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. ఇంట్లో గొడవలు రాకుండా మాట విషయంలో నిగ్రహం పాటించాలి.
తులా రాశి: ధన లావాదేవీల్లో జాగ్రత్త
తులా రాశి వారికి ఈ సమయం ఏ మాత్రం అనుకూలంగా లేదు. "ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో ఈ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి," అని పండితులు సూచిస్తున్నారు. ఆదాయం ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. ఆఫీసులో మీపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
కుంభ రాశి: ఆరోగ్యమే మహాభాగ్యం
కుంభ రాశి వారు కుటుంబ జీవితంలో పోరాడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆర్థికంగా కొంత బలహీనపడే సూచనలు ఉన్నాయి. ఆదాయాన్ని మించి ఖర్చులు పెరగడంతో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్య పరంగా హెచ్చుతగ్గులు ఉంటాయి కాబట్టి వైద్య పరీక్షలు చేయించుకోవడం మేలు. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. రిస్క్ తో కూడిన పనులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
జ్యోతిష్య శాస్త్రం అందించిన ఈ సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉంటుంది. మీ వ్యక్తిగత జాతక చక్రం ఆధారంగా ఫలితాలు మారవచ్చు. ఖచ్చితమైన విశ్లేషణ కోసం నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


