Deeparadhana: ఉప్పు, కుంభ, ఆవు పేడ ఇలా 16 రకాల దీపాలు.. కష్టాలు తీరాలంటే ఏ దీపం వెలిగించాలో తెలుసుకోండి!

Deeparadhana: దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 'దీపం జ్యోతి పరబ్రహ్మ' అని మన పెద్దలు చెబుతుంటారు. ధర్మశాస్త్రాల ప్రకారం వివిధ రకాల ప్రమిదలు, వత్తులతో దీపం వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. మీ సమస్యను బట్టి ఏ రకమైన దీపం వెలిగించాలో ఇక్కడ క్షుణ్ణంగా తెలుసుకుందాం.

Published on: May 16, 2026, 11:00:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతిరోజు దీపం వెలిగించడం అనేది మన సంస్కృతిలో ఒక భాగం అని చెప్పొచ్చు. అయితే ప్రతి సమస్యకి కూడా కొన్ని రకాల దీపాలు అద్భుతంగా పని చేస్తాయి. చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు మొదలు ఆరోగ్య సమస్యల దాకా, ఈరోజు ఏ దీపాలను వెలిగించడం వలన లాభాలను పొందవచ్చో తెలుసుకుందాం.

Deeparadhana: ఉప్పు, కుంభ, ఆవు పేడ ఇలా 16 రకాల దీపాలు.. కష్టాలు తీరాలంటే ఏ దీపం వెలిగించాలో తెలుసుకోండి! (pinterest)
Deeparadhana: ఉప్పు, కుంభ, ఆవు పేడ ఇలా 16 రకాల దీపాలు.. కష్టాలు తీరాలంటే ఏ దీపం వెలిగించాలో తెలుసుకోండి! (pinterest)

సాధారణంగా మనం మనకి నచ్చిన నూనెతో దీపారాధన చేస్తూ ఉంటాము. కానీ ఎన్ని రకాల దీపాలు ఉన్నాయో మీకు తెలుసా? ఈరోజు విశిష్ట దీపారాధన రకాలు, వాటి వలన కలిగే ఫలితాలు తెలుసుకుందాం.

విశిష్ట దీపారాధన రకాలు.. వాటి వలన కలిగే ఫలితాలు

1.ఉప్పు దీపం

ఒక ప్రమిదిలో ఉప్పు వేసి, అందులో మరో ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించినట్లయితే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడపొచ్చు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడడానికి ఇది అద్భుత పరిష్కారం.

2.కొబ్బరికాయ దీపం

దీనిని నారికేళ దీపం అని కూడా అంటారు. కొబ్బరికాయను సగానికి పగలగొట్టి, అందులో నూనె పోసి వత్తులు వేసి దీపారాధన చేయాలి. కార్యసిద్ధికి, విఘ్నాలు తొలగిపోవడానికి ఈ దీపాన్ని వెలిగిస్తారు. వినాయకుడి ముందు వెలిగిస్తే విఘ్నాలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు.

3.నీటి దీపం

నీటిపై నూనె పోసి వెలిగించే దీపాన్ని నీటి దీపం అంటారు. ఇలా దీపాన్ని వెలిగించడం వలన మనశ్శాంతి కలుగుతుంది. జాతకంలో రాహు దోషాలు ఉన్నవారు ఈ దీపాన్ని వెలిగిస్తే ప్రశాంతత లభిస్తుంది. సంతోషంగా జీవించచ్చు.

4.నిమ్మకాయ దీపం

దీనిని ఎలా వెలిగించాలి అంటే, నిమ్మకాయను సగానికి కోసి లోపలి భాగాన్ని తీసేసి ప్రమిదలా చేసి, వత్తులు వేసి నూనె పోసి వెలిగించాలి. రాహుకాలంలో దుర్గాదేవికి వెలిగిస్తే శత్రుభాధల నుంచి బయటపడొచ్చు. అలాగే దృష్టి దోషం పోయి సంతోషంగా ఉండొచ్చు.

5.బియ్యం పిండి దీపం

బియ్యం పిండితో ప్రమిదలు చేసి ఈ దీపాలను వెలిగించాలి. కోరిన కోరికలు నెరవేరడానికి అద్భుతంగా పనిచేస్తుంది. పెళ్లి కుదరడానికి కూడా ఈ దీపారాధన చేయడం మంచిది.

6.ఉసిరికాయ దీపం

ఉసిరికాయలో చిన్న గుంత చేసి, వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. కార్తీకమాసంలో మనం దీనిని వెలిగిస్తూ ఉంటాము. ఇలా దీపం వెలిగించడం వలన గత జన్మ పాపాలు కూడా తొలగిపోతాయని నమ్మకం. ఐశ్వర్యం కూడా కలుగుతుంది.

7.వెండి దీపం

మహాలక్ష్మికి వెండి దీపం అంటే ఎంతో ఇష్టం. ఇంట్లో వెండి ప్రమిదతో దీపం వెలిగించినట్లయితే సంపద కలుగుతుంది. సంతోషంగా ఉండొచ్చు.

8.కంచు దీపం

ఇది విజయానికి సంకేతం అని చెప్పొచ్చు. కంచు ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తే బుద్ధి, బలం కూడా పెరుగుతాయి.

9.పిడక దీపం

ఆవు పేడతో చేసిన ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వలన యజ్ఞం చేసినంత ఫలితం కలుగుతుంది. వాతావరణం కూడా శుద్ధి అవుతుంది.

10.తామర వత్తుల దీపం

తామర కాడతో చేసిన వత్తులతో దీపాన్ని వెలిగిస్తే పూర్వజన్మ కర్మలను తొలగించుకోవచ్చు. ఐశ్వర్యం కూడా కలుగుతుంది.

11.కర్పూర దీపం

హారతి ఇచ్చినప్పుడు దీనిని మనం వెలిగిస్తాము. ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే సానుకూల శక్తి వ్యాపిస్తుంది.

12.కుంభ దీపం

చిన్న కుండలో దీపాన్ని పెట్టి వెలిగిస్తే దానిని కుంభ దీపం అంటారు. వంశాభివృద్ధికి, మంగళకరమైన పనులకు ఇది సూచనగా భావిస్తారు.

13.నవగ్రహ దీపాలు

తొమ్మిది ప్రమిదల్లో విడివిడిగా దీపాలు వెలిగించాలి. గ్రహ దోషాల ప్రభావం నుంచి బయటపడడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

14.బెల్లం దీపం

కొన్ని ప్రత్యేక వ్రతాల్లో బెల్లం ముక్కలో దీపం పెడతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్మకం.

15.అఖండ దీపం

పగలు, రాత్రి అలా వెలుగుతూ ఉండే దీపాన్ని అఖండ దీపం అంటారు. ఇంటికి రక్షణ కవచంలా ఇది పనిచేస్తుంది.

16.మట్టి దీపం

మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది. ఇది శ్రేష్ఠం కూడా.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More