ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత రోజున పోలి పాడ్యమిని జరుపుకుంటాము. పోలి పాడ్యమి ఈసారి ఎప్పుడు వచ్చింది? ఆ రోజున ఎలాంటి పద్ధతుల్ని పాటించాలి, పూజా విధానం, పరిహారాలతో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పోలి పాడ్యమి 2025 తేదీ, సమయం:

పాడ్యమి తిధి నవంబర్ 20 ఉదయం 10:30కి ప్రారంభమవుతుంది. నవంబర్ 21 మధ్యాహ్నం 12:45తో ముగుస్తుంది. ఈ కారణంగా పోలి పాడ్యమిని నవంబర్ 21 శుక్రవారం నాడు జరుపుకోవాలి. ఈ రోజున పూజలు చేయడం, తర్పణాలు చేయడం వంటివి పాటిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. అందుకనే ఈ రోజుని “పోలి పాడ్యమి” అని కూడా అంటారు. ఈరోజు పూజలు, తర్పణాలు చేయడం వలన పితృదేవతలకు శాంతి కలుగుతుందని, వారి ఆశీర్వాదాలు మనపై ఉంటాయని నమ్ముతారు.
పోలి పాడ్యమి నాడు ఏం చేయాలి? పూజా విధానంతో పాటుగా పూర్తి వివరాలు తెలుసుకోండి
- పోలి పాడ్యమి నాడు ఉదయాన్నే తలస్నానం చేసి, అరటి దొప్పలలో 30 వత్తులు వేసి దీపాలను వెలిగించాలి.
- వీటిని నీటిలో వదలడం వలన పాపాలు తొలగిపోతాయి. దీపాలు వదలిన తర్వాత మూడు సార్లు నీటిని తోసి నమస్కారం చేయాలి. పోలి స్వర్గం పూజా విధానంలో ఇది చాలా ముఖ్యమైనది.
- పోలి పాడ్యమి నాడు శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకుంటే మంచిదే.
- “ఓం నమశ్శివాయ” అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.
- పోలి పాడ్యమి నాడు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర, తులసి మొక్క దగ్గర దీపాలను వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయి. ఈ రోజున దీపదానం చేయడం కూడా ఎంతో శ్రేయస్కరం.
- పోలి పాడ్యమి నాడు పోలి స్వర్గం కథ విన్నా, చదివినా శుభ ఫలితాలు కలుగుతాయి. కుటుంబానికి శాంతి, ఐశ్వర్యం లభిస్తాయి.
ఎన్ని వత్తులతో దీప దానం చెయ్యాలి?
రెండు వత్తులతో దీప దానం – శాంతి
{{/usCountry}}రెండు వత్తులతో దీప దానం – శాంతి
{{/usCountry}}మూడు వత్తులతో దీప దానం – ధన వృద్ధి
ఐదు వత్తులతో దీప దానం – అఖండ ఐశ్వర్యం
ఏడు వత్తులతో దీప దానం – మోక్షప్రదం
శుక్రవారం నాడు పోలి దీపాలను వదిలిపెట్టచ్చా?
శుక్రవారం నాడు, మంగళవారం నాడు పోలి పాడ్యమిని జరుపుకోవచ్చా? పోలి దీపాలను ఈ రెండు రోజులు వదలకూడదని చాలా మంది అంటున్నారు. అయితే, నిజానికి పోలి పాడ్యమిని ‘తిథి’ ఆధారంగా జరుపుకోవాలి. వారంతో సంబంధం లేదు. ఒకవేళ అలా కాదని మరుసటి రోజు శనివారం చేసుకుంటే, ఆ రోజు పాడ్యమి తిథి ఉండదు కదా! అందువల్ల పాడ్యమి తిథి వచ్చిన రోజునే పోలి పాడ్యమిని చేసుకోవాలి. దీపాలను వదిలి, కథ చదువుకుని, పూజ చేసుకోవాలి.