Poli Swargam: ఈ ఏడాది పోలి పాడ్యమి 21న, 22న? తేదీ, సమయం, పూజా విధానంతో పాటు ఎన్ని దీపాలను వదిలి పెట్టాలో తెలుసుకోండి!
ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత రోజున పోలి పాడ్యమిని జరుపుకుంటాము. పోలి పాడ్యమి ఈసారి ఎప్పుడు వచ్చింది? ఆ రోజున ఎలాంటి పద్ధతుల్ని పాటించాలి, పూజా విధానం, శుక్రవారం నాడు పోలి దీపాలను వదిలిపెట్టచ్చా?పరిహారాలతో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత రోజున పోలి పాడ్యమిని జరుపుకుంటాము. పోలి పాడ్యమి ఈసారి ఎప్పుడు వచ్చింది? ఆ రోజున ఎలాంటి పద్ధతుల్ని పాటించాలి, పూజా విధానం, పరిహారాలతో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పోలి పాడ్యమి 2025 తేదీ, సమయం:
పాడ్యమి తిధి నవంబర్ 20 ఉదయం 10:30కి ప్రారంభమవుతుంది. నవంబర్ 21 మధ్యాహ్నం 12:45తో ముగుస్తుంది. ఈ కారణంగా పోలి పాడ్యమిని నవంబర్ 21 శుక్రవారం నాడు జరుపుకోవాలి. ఈ రోజున పూజలు చేయడం, తర్పణాలు చేయడం వంటివి పాటిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. అందుకనే ఈ రోజుని “పోలి పాడ్యమి” అని కూడా అంటారు. ఈరోజు పూజలు, తర్పణాలు చేయడం వలన పితృదేవతలకు శాంతి కలుగుతుందని, వారి ఆశీర్వాదాలు మనపై ఉంటాయని నమ్ముతారు.
పోలి పాడ్యమి నాడు ఏం చేయాలి? పూజా విధానంతో పాటుగా పూర్తి వివరాలు తెలుసుకోండి
- పోలి పాడ్యమి నాడు ఉదయాన్నే తలస్నానం చేసి, అరటి దొప్పలలో 30 వత్తులు వేసి దీపాలను వెలిగించాలి.
- వీటిని నీటిలో వదలడం వలన పాపాలు తొలగిపోతాయి. దీపాలు వదలిన తర్వాత మూడు సార్లు నీటిని తోసి నమస్కారం చేయాలి. పోలి స్వర్గం పూజా విధానంలో ఇది చాలా ముఖ్యమైనది.
- పోలి పాడ్యమి నాడు శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకుంటే మంచిదే.
- “ఓం నమశ్శివాయ” అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.
- పోలి పాడ్యమి నాడు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర, తులసి మొక్క దగ్గర దీపాలను వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయి. ఈ రోజున దీపదానం చేయడం కూడా ఎంతో శ్రేయస్కరం.
- పోలి పాడ్యమి నాడు పోలి స్వర్గం కథ విన్నా, చదివినా శుభ ఫలితాలు కలుగుతాయి. కుటుంబానికి శాంతి, ఐశ్వర్యం లభిస్తాయి.
ఎన్ని వత్తులతో దీప దానం చెయ్యాలి?
రెండు వత్తులతో దీప దానం – శాంతి
మూడు వత్తులతో దీప దానం – ధన వృద్ధి
ఐదు వత్తులతో దీప దానం – అఖండ ఐశ్వర్యం
ఏడు వత్తులతో దీప దానం – మోక్షప్రదం
శుక్రవారం నాడు పోలి దీపాలను వదిలిపెట్టచ్చా?
శుక్రవారం నాడు, మంగళవారం నాడు పోలి పాడ్యమిని జరుపుకోవచ్చా? పోలి దీపాలను ఈ రెండు రోజులు వదలకూడదని చాలా మంది అంటున్నారు. అయితే, నిజానికి పోలి పాడ్యమిని ‘తిథి’ ఆధారంగా జరుపుకోవాలి. వారంతో సంబంధం లేదు. ఒకవేళ అలా కాదని మరుసటి రోజు శనివారం చేసుకుంటే, ఆ రోజు పాడ్యమి తిథి ఉండదు కదా! అందువల్ల పాడ్యమి తిథి వచ్చిన రోజునే పోలి పాడ్యమిని చేసుకోవాలి. దీపాలను వదిలి, కథ చదువుకుని, పూజ చేసుకోవాలి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


