కెరీర్‌లో సమస్యలు బలహీనమైన గురువుకు సంకేతం, రేపు గురువు తిరోగమనం సమస్యగా మారచ్చు.. వెంటనే ఈ పరిహారాలను పాటించండి!
గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఒక్కోసారి గ్రహాలు తిరోగమనం చెందుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు ఉంటాయి. నవంబర్ 11 అంటే రేపటి నుంచి గురువు తిరుగమనంలో ఉంటాడు. గురువు తిరుగమనం అశుభ ఫలితాలను కూడా తీసుకు వచ్చే అవకాశం ఉంది.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అశుభ యోగాలు, శుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. గురువు జ్ఞానం, సంతోషం, అదృష్టం మొదలైన వాటికే కారకుడు. జ్యోతిష్య శాస్త్రంలో దేవగురువు బృహస్పతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒకవేళ జాతకంలో గురువు శుభస్థానంలో ఉంటే, ఆ వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, అదృష్టం కూడా కలిసి వస్తుంది. అదే ఒకవేళ జాతకంలో గురువు స్థానం బలహీనంగా ఉంటే, కెరీర్‌లో, వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

రేపటి నుంచి గురువు తిరోగమనం
గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఒక్కోసారి గ్రహాలు తిరోగమనం చెందుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు ఉంటాయి. నవంబర్ 11 అంటే రేపటి నుంచి గురువు తిరుగమనంలో ఉంటాడు.
గురువు తిరుగమనం అశుభ ఫలితాలను కూడా తీసుకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జాతకంలో గురువు స్థానం బలహీనంగా ఉన్న వారికి సమస్యలు రావచ్చు. అయితే గురువు బలంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా కొన్ని మార్పులను చూడొచ్చు. ఒకవేళ బలహీనంగా ఉంటే మాత్రం చాలా సమస్యలు వస్తాయి.
జాతకంలో గురువు బలహీనంగా ఉంటే ఎలాంటి సమస్యలు రావచ్చు?
జాతకంలో గురువు స్థానం బలహీనంగా ఉంటే చదువు పరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చాలా కన్ఫ్యూజ్ అవుతారు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కెరీర్‌లో కూడా సమస్యలు వస్తాయి. కష్టానికి తగ్గ ఫలితాలను అందుకోలేరు. ఆస్తికి సంబంధించిన తగాదాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. నష్టాల నుంచి బయటపడలేరు.
జాతకంలో గురువు స్థానం బలహీనంగా ఉంటే ఈ పరిహారాలను పాటించండి:
జాతకంలో గురువు స్థానం బలహీనంగా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిహారాలను పాటించినట్లయితే, జాతకంలో గురువు స్థానాన్ని బలపరుచుకోవచ్చు. గురువు స్థానం జాతకంలో బలంగా ఉంటే, విద్యకు సంబంధించి చాలా మంచి ఫలితాలను చూస్తారు. జ్ఞానం ఎక్కువగా పెరుగుతుంది, అదృష్టం కూడా కలిసి వస్తుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది, సక్సెస్‌ని అందుకుంటారు. కనుక ఒకవేళ జాతకంలో గురువు స్థానం బలహీనంగా ఉంటే ఈ పరిహారాలను పాటించడం మంచిది.
- గురువు స్థానం బలహీనంగా ఉన్నట్లయితే గురువారం నాడు విష్ణుమూర్తిని పూజించండి. అదే విధంగా ఉపవాసం ఉండండి.
- పసుపు రంగు వస్తువులను, దుస్తులను దానం చేయడం శుభప్రదం.
- రక్తదానం చేస్తే కూడా మంచి జరుగుతుంది.
- గురువు స్థానం బలపడడానికి “ఓం గ్రమ్ గ్రీమ్ గ్రౌమ్ సహ గురవే నమః” లేదా “ఓం బ్రిం బృహస్పతయే నమః” అనే మంత్రాలను జపించండి.
- అరటి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే కూడా మంచి జరుగుతుంది.
- పెద్దవాళ్లను, గురువులను, బ్రాహ్మణులను గౌరవించండి.
- గోవులకు ఆహారం పెట్టండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


