2026 శుభప్రదంగా ప్రారంభమవుతుంది.. ఈ 5 రాశుల వారు గురువు, శని అనుగ్రహంతో డబ్బు, అదృష్టంతో పాటు ఎన్నో!

గ్రహాల మార్పులు ద్వాదశ రాశుల వారి జీవితంలో ప్రభావం చూపిస్తాయి. కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు. గురువు కర్కాటకం నుంచి సింహరాశిలోకి వెళ్తాడు. అలాగే శని మీన రాశిలో సంచారం చేస్తాడు. మరి ఏ రాశుల వారికి గురువు, శని 2026లో శుభఫలితాలను తీసుకు రాబోతున్నారు?

Published on: Oct 30, 2025, 11:00:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభయోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. మరో రెండు నెలల్లో 2025 ముగుస్తుంది. 2026లో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు జరగనుంది. 2026లో జరిగే గ్రహాల మార్పులు ద్వాదశ రాశుల వారి జీవితంలో ప్రభావం చూపిస్తాయి. కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు. గురువు కర్కాటకం నుంచి సింహరాశిలోకి వెళ్తాడు. అలాగే శని మీన రాశిలో సంచారం చేస్తాడు.

5 రాశుల వారు గురువు, శని అనుగ్రహంతో డబ్బు, అదృష్టంతో పాటు ఎన్నో (pinterest)
5 రాశుల వారు గురువు, శని అనుగ్రహంతో డబ్బు, అదృష్టంతో పాటు ఎన్నో (pinterest)

జ్యోతిష్యుల ప్రకారం ఈ రెండు గ్రహాల స్థానంలో మార్పు 12 రాశుల వారి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకువస్తుంది. కొంతమందికి ఈ రెండు గ్రహాల సంచారంలో మార్పు ఆర్థికపరంగా లాభాలను తీసుకు వస్తుంది. పురోగతిని చూస్తారు. కొత్త అవకాశాలను పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. మరి ఏ రాశుల వారికి గురువు, శని 2026లో శుభఫలితాలను తీసుకు రాబోతున్నారు? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.

2026లో గురువు, శని సంచారంలో మార్పు

2026లో గురువు, శని కొన్ని రాశుల వారి అదృష్ట తలుపులు తెరుస్తున్నారు. ఈ సమయంలో ఈ రాశుల వారు సంతోషంగా ఉంటారు. కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. సానుకూల మార్పులను చూస్తారు.

1.వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రెండు గ్రహాల అనుగ్రహంతో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కెరీర్‌లో కూడా ఊహించని మార్పులు ఉంటాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రియమైన వారి సపోర్ట్‌ను పొందుతారు. అయితే ఈ సమయంలో ఈ రాశి వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోవాలి.

2.మిథున రాశి

మిథున రాశి వారికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది. మిధున రాశి వారు సంతోషంగా ఉంటారు, అనేక విధాలుగా లాభాలను పొందుతారు. గురువు, శని అనుగ్రహంతో అదృష్టం కలిసి వస్తుంది. పురోగతిని చూస్తారు. మీడియా, మార్కెటింగ్ రంగాల వారికి కూడా బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలను పొందుతారు. స్నేహితులు, తోటి ఉద్యోగస్తుల సపోర్ట్ ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే సులువుగా బయటపడగలరు. సంతోషంగా ఉంటారు.

3.తులా రాశి

ఈ సమయంలో ఈ రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సులువుగా సక్సెస్‌ను అందుకుంటారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇది శుభ సమయం. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More