4 గ్రహణాలు, పన్నెండుకు పైగా ముఖ్యమైన గ్రహ సంచారాలు, కొత్త సంవత్సరం అత్యద్భుతం.. 2026 ఎవరికి అదృష్టమో తెలుసుకోండి!

కొన్ని రోజుల్లో 2026 రాబోతోంది. 2026లో నాలుగు గ్రహణాలు, 12 గ్రహ సంచారాలు ఉన్నాయి. అయితే 2026 ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది? ఎవరికి ఏ విధంగా కలిసి రాబోతోందో ఈ రోజు తెలుసుకుందాం. 2026లో మొత్తం నాలుగు గ్రహణాలు ఉన్నాయి. ఐదు రాశుల వారికి 2026 బాగా కలిసి వస్తుంది. మరి ఏ రాశుల వారికి 2026 బాగా కలిసి వస్తుంది?

Published on: Oct 11, 2025, 13:30:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2025 ఇక చివరికి వచ్చేసింది. మరి కొన్ని రోజుల్లో 2026 రాబోతోంది. 2026లో నాలుగు గ్రహణాలు, 12 గ్రహ సంచారాలు ఉన్నాయి. అయితే 2026 ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది? ఎవరికి ఏ విధంగా కలిసి రాబోతోందో ఈ రోజు తెలుసుకుందాం. 2026లో మొత్తం నాలుగు గ్రహణాలు ఉన్నాయి. అందులో రెండు సూర్య గ్రహణాలు కాగా, రెండు చంద్ర గ్రహణాలు. 2026 ఫిబ్రవరి 17న సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

2026లో ఈ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.. వీరు పట్టిందల్లా బంగారమే (pinterest)
2026లో ఈ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.. వీరు పట్టిందల్లా బంగారమే (pinterest)

2026లో ఎవరికి బాగుంటుంది?

మార్చి 3, 2026న మరో సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఆగస్టు 12, 2026న ఒక చంద్రగ్రహణం, ఆగస్టు 28, 2026లో మరో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అలాగే 2026లో శని, గురు, రాహు, కేతు సంచారంలో మార్పు ఉంటుంది. అయితే ఈ కారణాల వలన కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి.

ముఖ్యంగా ఐదు రాశుల వారికి 2026 బాగా కలిసి వస్తుంది. మరి ఏ రాశుల వారికి 2026 బాగా కలిసి వస్తుంది? ఎవరు అదృష్టాన్ని పొందుతారు? కొత్త సంవత్సరం ఎవరికి బాగుంటుంది? ఇప్పుడు తెలుసుకుందాం.

2026లో ఈ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.. వీరు పట్టిందల్లా బంగారమే!

1.మేష రాశి:

మేష రాశి వారికి 2026 బంగారు సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు పెద్ద పెద్ద సమస్యల నుంచి సులువుగా బయటపడతారు. కెరీర్‌లో బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.

2.వృషభ రాశి:

వృషభ రాశి వారికి 2026 బాగా కలిసి వస్తుంది. కెరీర్‌లో స్థిరత్వం ఉంటుంది. విజయాలను అందుకుంటారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. వ్యాపారస్తులకు కూడా 2026లో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

3.సింహ రాశి:

సింహ రాశి వారికి 2026 బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. సంతోషంగా ఉంటారు. జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి.

4.తులా రాశి:

తులా రాశి వారికి 2026లో బాగా కలిసి వస్తుంది. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. వ్యాపారస్తులకు కూడా ఇదే సరైన సమయం. ఎక్కువ లాభాలు వస్తాయి. వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కూడా వీలవుతుంది. అయితే వీటి దృష్టిలో పడిపోయే పర్సనల్ లైఫ్‌ని వదులుకోవడం మంచిది కాదు.

5.ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారికి 2026 బాగుంటుంది. ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. సంపద ఎక్కువవుతుంది. ఇల్లు, కారు కొనుగోలు చేస్తారు. పూర్తి సంతోషంతో ఉంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More