అక్షయ నవమి ఎప్పుడు వచ్చింది? అక్టోబర్ 30న, 31? తేదీ, శుభ సమయంతో పాటు పూజా విధానం, పఠించాల్సిన మంత్రాలు తెలుసుకోండి!
ప్రతి ఏటా కార్తీకమాసంలో వచ్చే శుక్లపక్ష నవమి నాడు అక్షయ నవమి లేదా ఉసిరి నవమిగా జరుపుకుంటాము. ఇంటి ఆవరణలో ఉసిరి మొక్కలను నాటితే కూడా ఎంతో మంచి జరుగుతుంది. ఈ ఏడాది అక్షయ నవమి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటుగా ఆ రోజు పాటించాల్సిన వాటి గురించి, పూజా విధానాన్ని తెలుసుకుందాం.
కార్తీకమాసం చాలా విశిష్టమైనది. కార్తీకమాసంలో చేసే దీపారాధనకు, నది స్నానానికి ఎంతో విశిష్టత ఉంది. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా కార్తీకమాసంలో వచ్చే శుక్లపక్ష నవమి నాడు అక్షయ నవమి లేదా ఉసిరి నవమిగా జరుపుకుంటాము. ఈ ఏడాది అక్షయ నవమి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటుగా ఆ రోజు పాటించాల్సిన వాటి గురించి, పూజా విధానాన్ని తెలుసుకుందాం.

ఈ ఏడాది అక్షయ నవమి ఎప్పుడు వచ్చింది?
పంచాంగం ప్రకారం చూసినట్లయితే, కార్తీక శుక్ల నవమి తిథి అక్టోబర్ 30 ఉదయం 10:06 కి మొదలవుతుంది. అక్టోబర్ 31 ఉదయం 10:03 వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం చూసుకోవాలి కాబట్టి అక్టోబర్ 31న అక్షయ నవమిని జరుపుకోవాలి. ఈరోజు శుభ యోగాలు కూడా ఏర్పడతాయి.
అక్షయ నవమి నాడు ఏర్పడే అరుదైన యోగాలు:
అక్షయ నవమి నాడు వృద్ధి యోగం, రవి యోగం ఏర్పడతాయి. ఈ సమయంలో పూజ చేసుకోవడానికి చాలా మంచిది.
అక్షయ నవమి పూజా ముహూర్తం:
అక్షయ నవమి లేదా ఉసిరి నవమి నాడు పూజ చేసుకోవడానికి సరైన సమయం అక్టోబర్ 31 ఉదయం 6:38 నుంచి 10:03 వరకు. అంటే పూజ చేసుకోవడానికి సుమారు మూడున్నర గంటల సమయం ఉంటుంది. ఈ సమయంలో పూజ చేసుకోవచ్చు. విష్ణుమూర్తిని ఈ సమయంలో ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు.
అక్షయ నవమి పూజా విధానం:
- అక్షయ నవమి నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి. ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది.
- ఉసిరి చెట్టుపై గంగాజలాన్ని సమర్పించాలి.
- చందనం, పువ్వులు వంటి వాటితో అలంకరించాలి.
- ఉసిరి చెట్టు దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగిస్తే మంచిది.
- ఆ తర్వాత ఉసిరి చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయాలి.
- అక్షయ నవమి నాడు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తే మంచిది.
- విష్ణుమూర్తిని ఆరాధించేటప్పుడు “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపించండి.
- ఈరోజు దుస్తులు, ఆహారం వంటి వాటిని దానం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.
అక్షయ నవమి నాడు ఇలా చేస్తే మంచిది
- అక్షయ నవమి నాడు శ్రీహరిని ఆరాధించి జామకాయలను నైవేద్యంగా పెట్టాలి.
- అలాగే జామకాయలను దానం చేస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది.
- నిరుపేదలకు లేదా బ్రాహ్మణులకు జామ చెట్టు కింద భోజనం పెడితే కూడా శుభ ఫలితాలు ఎదురవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.
- అక్షయ నవమి నాడు పూర్వికులను స్మరించుకుని బట్టలు, దుప్పట్లు వంటి వాటిని దానం చేస్తే కూడా చాలా మంచి జరుగుతుంది.
- దీపావళి నాడు వెండి, బంగారం కొనేవారు అక్షయ నవమి నాడు కొనుగోలు చేసినా కూడా శుభఫలితాలు ఎదురవుతాయి.
- ఇంటి ఆవరణలో ఉసిరి మొక్కలను నాటితే కూడా ఎంతో మంచి జరుగుతుంది.
- వీలైతే ఉత్తర వైపు ఉసిరి చెట్టు నాటాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది. ఉత్తర దిశలో వీలు కాకపోతే తూర్పు వైపు నాటవచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


