Dhanteras 2025 : ధన త్రయోదశికి బంగారం కొనాలా? డిస్కౌంట్​తో పాటు మీ ఇంటికే డెలివరీ..

ధన త్రయోదశికి బంగారం కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! జ్యువెల్లరీ స్టోర్స్​లో రద్దీని స్కిప్​ చేసి, మీ ఇంటికే నేరుగా బంగారం, వెండిని పొందొచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Oct 18, 2025, 09:10:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
ధన త్రయోదిశికి బంగారం కొనాలా? (ANI)
ధన త్రయోదిశికి బంగారం కొనాలా? (ANI)

ఈరోజు, అంటే శనివారం, అక్టోబర్ 18న ధన త్రయోదశి 2025 జరుగుతోంది. హిందూ సంప్రదాయాల ప్రకారం.. ఈ ధన త్రయోదశి రోజున బంగారం, వెండి వంటి విలువైన లోహాలను కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఈ పండుగ సీజన్‌లో కేవలం నిమిషాల వ్యవధిలోనే బంగారం, వెండిని మీ ఇంటికి చేర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. అంతేకాదు, ధన త్రయోదశి 2025 కోసం బ్లింకిట్, స్విగ్గీ , జెప్టో వంటి సంస్థలు బంగారం, వెండి డెలివరీకి ప్రత్యేక ఆఫర్లను సైతం ప్రకటించాయి.

ధన త్రయోదశి 2025 రోజున మీరు బంగారం, వెండి ఎక్కడ కొనుగోలకు ఉన్న ఆప్షన్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

10 నిమిషాల్లో ఇంటికి డెలివరీ చేసే క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు..

బ్లింకిట్..

ధన త్రయోదశి 2025 సందర్భంగా, బ్లింకిట్ MMTC-PAMPతో జతకట్టి, కేవలం 10 నిమిషాల్లో మీ ఇంటి వద్దకే బంగారాన్ని డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. కొనుగోలుదారులు తమ ఇంటి నుంచే MMTC-PAMP 24K 999.9+ స్వచ్ఛత కలిగిన బంగారం, వెండి ఉత్పత్తులను ఆర్డర్ చేసి, నిమిషాల్లో పొందవచ్చు.

మీరు బ్లింకిట్ యాప్‌లో 1 గ్రాము లోటస్ గోల్డ్ బార్, 0.5 గ్రాముల లోటస్ గోల్డ్ కాయిన్, 10 గ్రాముల లక్ష్మీ గణేశ్ సిల్వర్ కాయిన్‌ను కొనుగోలు చేయవచ్చు.

భద్రత: బ్లింకిట్ ద్వారా డెలివరీ అయ్యే ప్రతి ఉత్పత్తి MMTC-PAMP భద్రతా ప్రమాణాలను పాటిస్తుంది. ఇందులో ట్యాంపర్-ప్రూఫ్ ప్యాకేజింగ్, ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంటాయి. ప్యాకేజింగ్‌ను తెరిచి లోపల కాయిన్‌ను తనిఖీ చేసే అవకాశం కస్టమర్‌లకు లభిస్తుంది.

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్..

క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ కూడా ధన త్రయోదశి సందర్భంగా.. ఎంపిక చేసిన మెట్రో నగరాల్లో బంగారం, వెండి డెలివరీ కోసం ప్రత్యేక ఆఫర్‌ను అమలు చేస్తోంది.

ధన త్రయోదశి 2025కి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు 1 కిలో వెండి బ్రిక్స్​, అలాగే బంగారం, వెండి నాణేలను కొనుగోలు చేసి, నిమిషాల్లో ఇంటికి డెలివరీ పొందవచ్చు. ఇందులో 0.1 గ్రాము నుంచి 10 గ్రాముల వరకు బంగారం కొనే వీలుంది.

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్.. కళ్యాణ్ జ్యువెలర్స్, మలబార్ గోల్డ్ & డైమండ్స్, ముత్తూట్ ఎక్సిమ్, MMTC-PAMP, మియా బై తనిష్క్, వోయిల్లా, కొత్తగా వచ్చిన గుల్లక్ వంటి వాటితో సర్టిఫైడ్ బంగారం, వెండి నాణేలను అందించడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది.

జెప్టో, బిగ్ బాస్కెట్, అమెజాన్​లో కూడా..

ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు అయిన జీప్టో, బిగ్ బాస్కెట్, అమెజాన్ కూడా ధన త్రయోదశి సందర్భంగా బంగారం డెలివరీ చేస్తున్నాయి.

జెప్టోలో బంగారం నాణేలు కొనుగోలు చేయవచ్చు. నిమిషాల్లో డెలివరీ పొందొచ్చు.

ఇదిలా ఉండగా, టాటా యాజమాన్యంలోని బిగ్ బాస్కెట్, ధన త్రయోదశికి బంగారం, వెండి నాణేలను డెలివరీ చేయడానికి తనిష్క్​తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో కస్టమర్‌లు లక్ష్మీ గణేశ్ (999.9 స్వచ్ఛత) వెండి నాణెం (10 గ్రాములు), తనిష్క్ 22 క్యారెట్ బంగారం నాణెం (1 గ్రాము), లక్ష్మీ మోటిఫ్‌తో కూడిన తనిష్క్ 22 క్యారెట్ బంగారం నాణెం (1 గ్రాము) కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్.. క్యారట్‌లేన్, పీఎన్ గాడ్గిల్, జోయాలుక్కాస్, పీసీ చంద్ర, మలబార్ గోల్డ్ & డైమండ్స్ వంటి బ్రాండ్‌ల నుంచి విభిన్నమైన బంగారు ఉత్పత్తుల కలెక్షన్‌ను ప్రారంభించింది. ఇది తన ప్లాట్‌ఫామ్‌లో 5 లక్షలకు పైగా ఆభరణాల డిజైన్‌లను అందిస్తోంది!

ఈ ఈ-కామర్స్ దిగ్గజం ఆభరణాలపై 20 శాతం వరకు తగ్గింపు, 10 శాతం తక్షణ బ్యాంక్ డిస్కౌంట్, ఎంపిక చేసిన డిజైన్‌లపై రూ. 1,000 కూపన్‌ను కూడా అందిస్తోంది.

ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌లు- స్థానిక దుకాణాలు..

కస్టమర్‌లు ధన త్రయోదశి సందర్భంగా ఆఫర్‌లను పొందడానికి తనిష్క్, కళ్యాణ్ జ్యువెలర్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, జోయాలుక్కాస్, పీఎం గాడ్గిల్ అండ్ సన్స్, సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్, పీసీ చంద్ర జ్యువెలర్స్ వంటి బ్రాండ్‌ల నుంచి కూడా ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోలు చేయవచ్చు!

ఈ బ్రాండ్‌ల దుకాణాల్లో వివిధ ప్రాంతాలలో తయారీ ఛార్జీలపై 100 శాతం తగ్గింపుతో పాటు ఆఫర్‌లు నడుస్తున్నాయి.

ఇవేవీ కుదరకపోతే.. ధంతేరాస్‌కు బంగారం కొనడానికి మీరు ఎప్పుడైనా మీ స్థానిక ఆభరణాల దుకాణానికి వెళ్లవచ్చు. అయితే, బంగారం నాణ్యత కోసం ఆ దుకాణం మీకు హాల్‌మార్క్ చేసిన ఆభరణాలను ఇస్తోందో లేదో ఖచ్చితంగా చూసుకోవాలి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More