ఈరోజు ధన త్రయోదశి వేళ చీపురుని ఎందుకు కొనుగోలు చెయ్యాలి? బంగారం, వెండి కొనడానికి శుభ సమయం తెలుసుకోండి!

ఈ సంవత్సరం ధన త్రయోదశి అక్టోబర్ 18 అంటే ఈరోజు వచ్చింది. ఈరోజు ధన్వంతరిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి. అదే విధంగా కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం మంచి ఫలితాలను తీసుకు వస్తుంది. ధన త్రయోదశి నాడు చీపురుని కొనుగోలు చేస్తే మంచి జరుగుతుంది అంటారు. ధన త్రయోదశి రోజు చీపురుని ఎందుకు కొనుగోలు చేయాలి?

Published on: Oct 18, 2025, 08:06:33 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దీపావళి పండుగ ధన త్రయోదశి నుంచి మొదలవుతుంది. ఆ తర్వాత ఐదు రోజుల పాటు దీపావళి పండుగను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ధన త్రయోదశి, దీపావళికి రెండు రోజుల ముందు వస్తుంది. ఆ తర్వాత రోజు నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమ విదియ జరుపుకుంటాము. అశ్వయుజ మాసం బహుళ త్రయోదశి నాడు ధన త్రయోదశి జరుపుకుంటాము. ఆ రోజు ధనం, ఆరోగ్యం కలగాలని ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది.

ధన త్రయోదశి రోజు చీపురుని ఎందుకు కొనుగోలు చేయాలి? (pinterest)
ధన త్రయోదశి రోజు చీపురుని ఎందుకు కొనుగోలు చేయాలి? (pinterest)

ఈరోజే ధన త్రయోదశి

ఈ సంవత్సరం ధన త్రయోదశి అక్టోబర్ 18 అంటే ఈరోజు వచ్చింది. ఈరోజు ధన్వంతరిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి. అదే విధంగా కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం కూడా మంచి ఫలితాలను తీసుకు వస్తుంది. ఇంట్లో సంపద, సంతోషం కూడా నిలుస్తాయి. ఈరోజు చీపురు కొనుగోలు చేస్తే కూడా సకల శుభాలు కలుగుతాయి. అసలు ధన త్రయోదశి నాడు చీపురుని ఎందుకు కొనుగోలు చేయాలి? దీని వెనుక కారణాలేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ధన త్రయోదశి రోజు చీపురుని ఎందుకు కొనుగోలు చేయాలి?

ధన త్రయోదశి నాడు చీపురుని కొనుగోలు చేస్తే చాలా మంచి జరుగుతుంది అంటారు. ఈరోజు చీపురిని కొనుగోలు చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. చీపురుని కొనుగోలు చేయడం వలన సంతోషం, ధనం కూడా పెరుగుతాయి, దరిద్రం తొలగిపోతుందని నమ్మకం.

ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. చీపురు ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది. కాబట్టి చెత్తను తొలగించే చీపురుని ఈరోజు కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తే మంచి జరుగుతుందని నమ్మకం. శుభ్రత లేని ఇంట్లో దరిద్రం కొలువై ఉంటుందని, లక్ష్మీదేవి నివసించదని అంటారు.

ఈరోజు ఎందుకు కొత్త చీపురుని కొనుగోలు చెయ్యాలి?

కొత్త చీపురుని కొనుగోలు చేస్తే ఇంటిని శుభ్రం చేసి దరిద్రాన్ని దూరం చేయొచ్చు. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి సమస్యలను అన్నింటిని తొలగిస్తుంది, ధనం పెరుగుతుంది. ధన త్రయోదశి నాడు చీపురుని కొంటే ధనం కూడా పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అనవసరమైన వాటిని ఇంటి నుంచి తొలగించి సానుకూల శక్తిని ప్రవహిస్తే సంపద పెరిగి, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులకు దూరంగా ఉండవచ్చు.

ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయడానికి శుభ ముహూర్తం

ధన త్రయోదశి నాడు బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకుంటే ఈరోజు మధ్యాహ్నం 1:10 నిమిషాల నుంచి రేపు మధ్యాహ్నం 1:05 నిమిషాల వరకు శుభ సమయం. కాబట్టి ఆ ముహూర్తంలో బంగారం, వెండి కొనుగోలు చేయొచ్చు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More