ఒడిశాలో ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఆలయం గురించి తెలియని వారు ఉండరు. పూరీ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. అలాగే పూరీ ఆలయం చుట్టూ ఎన్నో ప్రత్యేకమైన ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే పూరీ దగ్గర ఉన్న సముద్రంలో ఆంజనేయ స్వామిని గొలుసులతో కట్టేసిన విషయం మీకు తెలుసా? హనుమంతుడిని ఎందుకు అలా గొలుసులతో కట్టేశారు? దీని వెనుక ఉన్న కథ, బేడీ హనుమాన్ ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బేడీ హనుమాన్ ఆలయం:

పూరీ జగన్నాథ్ ఆలయానికి సమీపంలో చాలా ఆలయాలు ఉన్నాయి. వాటిలో చాలా ప్రత్యేకమైన ఆలయం బేడీ హనుమాన్ ఆలయం. ఇక్కడ ఉన్న హనుమంతుడి విగ్రహం బంగారు బేడీలతో బంధించబడి ఉంటుంది. సముద్ర అలలు జగన్నాథ ఆలయంలోకి వెళ్లకుండా జగన్నాథుడే స్వయంగా హనుమంతుడిని బంగారు గొలుసులతో కట్టేశాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన వివరాలను కూడా చూద్దాం.
బేడీ హనుమాన్ ఆలయ చరిత్ర:
ఈ ఆలయాన్ని బేడీ హనుమాన్ ఆలయం అని పిలవడం వెనుక కారణం హనుమంతుడిని గొలుసులతో బంధించడమే. పురాతన కాలంలో ఒకసారి సముద్ర అలలు జగన్నాథ ఆలయానికి ప్రవేశించాయి. అంతేకాకుండా సునామి రావడంతో పూరీ ప్రజలంతా కూడా ఎన్నో బాధలు పడేవారు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా మూడుసార్లు సముద్ర అలలు ప్రవేశించాయి.
అప్పుడు జగన్నాథుడు పూరీ ప్రజల కోసం వాయుపుత్రుడైన హనుమంతుడిని సముద్రాన్ని నియంత్రించడానికి నియమించాడు. ఒకసారి రాముల వారి పూజ చూడడానికి హనుమంతుడు సముద్రం దగ్గర నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు సముద్రం కూడా అతని తర్వాత నగరంలోకి ప్రవేశించింది. దాంతో జగన్నాథుడు సముద్ర అలలను నిరోధించడానికి అక్కడే హనుమంతుడిని బంగారు గొలుసులతో బంధించాడు. అందుకనే ఈ ఆలయాన్ని బేడీ హనుమాన్ ఆలయం అని పిలుస్తారు.
ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది. ప్రధాన విగ్రహమైన హనుమాన్ గుడి చేతిలో గద ఉంటుంది. ఎడమ చేతిలో లడ్డు పట్టుకుని హనుమాన్ మనకు దర్శనం ఇస్తాడు. ఆలయ బయట గోడలపై చూసినట్లయితే వివిధ దేవుళ్ల చిత్రాలు ఉంటాయి. దక్షిణ గోడపై హనుమ వినాయకుని విగ్రహం ఉంటుంది. పశ్చిమ గోడపై హనుమాన్ తల్లి అయిన అంజనా దేవి విగ్రహం ఉంటుంది. ఆమె ఒడిలో బాల హనుమాన్ ఉంటాడు. పూరీ వెళ్లినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శించాలి.
{{/usCountry}}ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది. ప్రధాన విగ్రహమైన హనుమాన్ గుడి చేతిలో గద ఉంటుంది. ఎడమ చేతిలో లడ్డు పట్టుకుని హనుమాన్ మనకు దర్శనం ఇస్తాడు. ఆలయ బయట గోడలపై చూసినట్లయితే వివిధ దేవుళ్ల చిత్రాలు ఉంటాయి. దక్షిణ గోడపై హనుమ వినాయకుని విగ్రహం ఉంటుంది. పశ్చిమ గోడపై హనుమాన్ తల్లి అయిన అంజనా దేవి విగ్రహం ఉంటుంది. ఆమె ఒడిలో బాల హనుమాన్ ఉంటాడు. పూరీ వెళ్లినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శించాలి.
{{/usCountry}}నిరాకరణ: (ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము.) వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి రత్నాల నిపుణుడిని సంప్రదించండి. )