4 Planets Retrograde: హోలీ నాడు తిరోగమనంలో నాలుగు ప్రధాన గ్రహాలు.. ఈ రాశులకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది!
ఫిబ్రవరి 26న బుధుడు కూడా తిరోగమనంలోకి వెళ్తాడు. మార్చి 20 వరకు బుధుడు తిరోగమనంలోనే పయనిస్తాడు. బుధుడు డబ్బు, జ్ఞానం మొదలైన వాటికి కారకుడు. గురువు డిసెంబర్ 5 వరకు అతిరోగమనంలోనే ఉంటాడు. మార్చి 11 వరకు గురువు తిరోగమనంలోనే పయనిస్తాడు. కొన్ని రాశుల వారికి లాభాలు కలుగుతాయి.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచలనాలు మారితే అది అందరి మీద ప్రభావం చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు, కేతువులు ఎప్పుడూ కూడా తిరోగమనంలోనే పయనిస్తారు. ఫిబ్రవరి 26న బుధుడు కూడా తిరోగమనంలోకి వెళ్తాడు. మార్చి 20 వరకు బుధుడు తిరోగమనంలోనే పయనిస్తాడు. బుధుడు డబ్బు, జ్ఞానం మొదలైన వాటికి కారకుడు. గురువు డిసెంబర్ 5 వరకు అతిరోగమనంలోనే ఉంటాడు.

మార్చి 11 వరకు గురువు తిరోగమనంలోనే పయనిస్తాడు. ఈ హోలీకి నాలుగు గ్రహాలు తిరోగమనంలో ఉండడంతో కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు కూడా భారీ లాభాలు వస్తాయి. బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. హోలీకి సంతోషం కూడా పెరుగుతుంది. ప్రమోషన్లు పొందుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.
హోలీ నాడు నాలుగు ప్రధాన గ్రహాలు తిరోగమనంలో ఉంటాయి.. ఈ రాశుల వారికి బ్యాంకు బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది
రాహు ప్రభావంతో సువర్ణ కాలం
రాహువు హోలీ నాడు తిరోగమనంలో ఉండడంతో ఆర్థిక పరంగా ఈ రాశులకు లాభాలు కలుగుతాయి. మేష రాశి, సింహ రాశి వారికి రాహువు హోలీ నాడు తిరోగమనంలో ఉండడంతో ఆర్థిక పరంగా ప్రయోజనాలు పొందుతారు. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. ఈ సమయంలో మరీ ఎక్కువ రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు.
కేతువుతో ఈ రాశి వారికి సమస్యలు తొలగిపోతాయి
కేతువు కూడా హోలీ నాడు తిరోగమనంలో ఉండడంతో మకర రాశి, వృశ్చిక రాశి వారికి బాగుంటుంది. ఈ సమయంలో ఈ రాశుల వారు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. ఊహించని విధంగా లాభాలను పొందుతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు.
బుధ సంచారంతో భారీ లాభాలు
బుధ సంచారం కారణంగా హోలీ నాడు ఈ రాశుల వారికి బాగుంటుంది. మిథున రాశి, కన్యా రాశి వారు హోలీ నాడు బుధుడు తిరోగమనంలో ఉండడం వలన ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారస్తులకు కూడా భారీ లాభాలు వస్తాయి. మొత్తం మీద ఈ సమయంలో ఈ రాశి వారికి బాగుంటుంది.
గురువు సంచారం
హోలీ నాడు గురువు తిరోగమనంలో ఉండడంతో ధనుస్సు రాశి, మీన రాశి వారికి బాగుంటుంది. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. చదువుపరంగా కూడా బాగుంటుంది. ఆర్థిక పరంగా లాభాలను పొందుతారు. డబ్బు వస్తుంది. హోలీకి సంతోషం కూడా పెరుగుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


