Mercury Set in Retrograde: బుధ అస్తమయంతో ఈ 3 రాశుల వారి జీవితమే మారిపోతుంది.. కనీవినీ ఎరుగని విధంగా లాభాలు!
బుధుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. త్వరలోనే బుధుడు అస్తమించబోతున్నాడు. బుధుడు అస్తమయంతో కొన్ని రాశుల వారి జీవితంలో మార్పులు రాబోతున్నాయి. ఫిబ్రవరి 28న తిరోగమనంలో ఉన్న బుధుడు అస్తమిస్తాడు. రాత్రి సుమారు 10:09కి ఇది జరుగుతుంది. మార్చి 13 వరకు ఇలాగే ఉంటాడు. ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు?
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పులు చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మంచి యోగాలను చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. బుధుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. త్వరలోనే బుధుడు అస్తమించబోతున్నాడు. బుధుడు అస్తమయంతో కొన్ని రాశుల వారి జీవితంలో మార్పులు రాబోతున్నాయి. ఫిబ్రవరి 28న తిరోగమనంలో ఉన్న బుధుడు అస్తమిస్తాడు. రాత్రి సుమారు 10:09కి ఇది జరుగుతుంది. మార్చి 13 వరకు ఇలాగే ఉంటాడు.

బుధ సంచారం
బుధుడు గ్రహాలకు రారాజు. తెలివితేటలు, కమ్యూనికేషన్, మాటతీరు మొదలైన వాటికి కారకుడు. వ్యాపారంలో వృద్ధి చెందడానికి కూడా బుధుని అనుగ్రహం ఉండాలి. అయితే బుధుడు అస్తమించడంతో కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. మరి ఏ రాశుల వారికి ఎలాంటి మార్పులు కలగబోతున్నాయి? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? ఏ రాశుల వారికి ఒక్కసారిగా బోలెడు ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బుధుడు అస్తమయంతో ఈ రాశుల వారి జీవితమే మారిపోతుంది.. కనీవినీ ఎరుగని విధంగా లాభాలు కలుగుతాయి.
1.తులా రాశి:
తులా రాశి వారికి బుధుని సంచారంలో మార్పు అనేక విధాలుగా లాభాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థికపరంగా ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారంలో అనేక లాభాలు ఉంటాయి. కొత్త ఉద్యోగాన్ని పొందుతారు. అలాగే శుభవార్తలను వింటారు. క్రియేటివ్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది.
ఎడ్యుకేషన్, మేనేజ్మెంట్ వంటి రంగాల్లో సక్సెస్‌ను అందుకుంటారు. ప్రేమ జీవితంలో అపార్థాలు తొలగిపోతాయి. గొడవల నుంచి బయటపడతారు. ఆర్థికపరంగా లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు. భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రయోజనాలను పొందుతారు.
2.కుంభ రాశి:
కుంభ రాశి వారికి బుధుడి అస్తమయం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఈ రాశి మొదటి ఇంట్లో ఈ సంచారం జరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
కొత్త ఉద్యోగం లేదా పని ప్రదేశంలో అవకాశాలను పొందుతారు. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తే వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
3.మీన రాశి:
మీన రాశి వారికి ఇది ప్రత్యేకమైన సమయం. ఈ సమయంలో మీన రాశి వారు ఊహించని మార్పులను చూస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి. వ్యాపారస్తులకు శుభ సమయం.
పాత పనులు కూడా ఇప్పుడు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పెళ్లయిన వారికి వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. అత్తమామల సపోర్ట్ కూడా ఉంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


