Ketu Transit 2026: కేతువు సంచారంతో నాలుగు రాశులకు ఊహించని లాభాలు.. డబ్బు, అదృష్టం, విజయాలతో పాటు ఎన్నో!
కేతువు నీడ గ్రహం. కేతువు కూడా కాలానుగుణంగా రాశులను మారుస్తూ ఉంటాడు. కేతువు మఖ నక్షత్రానికి అధిపతి. తన సొంత నక్షత్రంలోకి కేతువు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందబోతున్నారు. ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి. కెరీర్‌లో కూడా మంచి మార్పులను చూస్తారు.
Ketu Transit: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా చాలా మార్పులను తీసుకొస్తుంది. ఒక్కోసారి శుభ ఫలితాలు కలిగితే, ఒక్కోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేతువు నీడ గ్రహం. కేతువు కూడా కాలానుగుణంగా రాశులను మారుస్తూ ఉంటాడు.

కేతువు సంచారం
ద్రిక్ పంచాంగం ప్రకారం, కేతువు ఏప్రిల్ 22, 2026 సోమవారం నాడు సాయంత్రం 4:49కి మఖ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. కేతువు మఖ నక్షత్రానికి అధిపతి. తన సొంత నక్షత్రంలోకి కేతువు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందబోతున్నారు. ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి. కెరీర్‌లో కూడా మంచి మార్పులను చూస్తారు. మొత్తం మీద కొన్ని రాశుల వారికి దశ తిరగబోతుంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
మఖ నక్షత్రంలోకి కేతువు.. నాలుగు రాశుల వారికి ఊహించని లాభాలు:
1.వృషభ రాశి:
వృషభ రాశి వారికి కేతువు నక్షత్ర సంచారం బాగా కలిసి రాబోతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఊహించని ప్రయోజనాలను పొందుతారు. కెరీర్‌లో మంచి మార్పులు వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు. పెండింగ్‌లో ఉన్న టాస్కులు పూర్తవుతాయి. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. మానసిక ప్రశాంతత ఉంటుంది.
2.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఉద్యోగంలో కూడా మంచి మార్పులు వస్తాయి. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అప్పులు తీరిపోతాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది.
3.సింహ రాశి:
సింహ రాశి వారికి కేతువు నక్షత్ర సంచారం బాగా కలిసి రాబోతోంది. సక్సెస్‌ను అందుకుంటారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పాత ఇన్వెస్ట్మెంట్ల నుంచి ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఆదాయం పెరుగుతుంది. అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి.
4.మకర రాశి:
మకర రాశి వారికి కేతువు నక్షత్ర సంచారం మంచి మార్పులను తీసుకొస్తుంది. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. ఆర్థికపరంగా బాగుంటుంది. సంతోషం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. ప్రశాంతత ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


