ఆంజనేయస్వామిని జగన్నాధుడు గొలుసులతో కట్టేసాడని తెలుసా? మీరెప్పుడైనా ఈ ఆలయానికి వెళ్ళారా?
పూరీ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. అలాగే పూరీ ఆలయం చుట్టూ ఎన్నో ప్రత్యేకమైన ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే పూరీ దగ్గర ఉన్న సముద్రంలో ఆంజనేయ స్వామిని గొలుసులతో కట్టేసిన విషయం మీకు తెలుసా? హనుమంతుడిని ఎందుకు అలా గొలుసులతో కట్టేశారు? దీని వెనుక ఉన్న కథ, బేడీ హనుమాన్ ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఒడిశాలో ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఆలయం గురించి తెలియని వారు ఉండరు. పూరీ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. అలాగే పూరీ ఆలయం చుట్టూ ఎన్నో ప్రత్యేకమైన ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే పూరీ దగ్గర ఉన్న సముద్రంలో ఆంజనేయ స్వామిని గొలుసులతో కట్టేసిన విషయం మీకు తెలుసా? హనుమంతుడిని ఎందుకు అలా గొలుసులతో కట్టేశారు? దీని వెనుక ఉన్న కథ, బేడీ హనుమాన్ ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

బేడీ హనుమాన్ ఆలయం:
పూరీ జగన్నాథ్ ఆలయానికి సమీపంలో చాలా ఆలయాలు ఉన్నాయి. వాటిలో చాలా ప్రత్యేకమైన ఆలయం బేడీ హనుమాన్ ఆలయం. ఇక్కడ ఉన్న హనుమంతుడి విగ్రహం బంగారు బేడీలతో బంధించబడి ఉంటుంది. సముద్ర అలలు జగన్నాథ ఆలయంలోకి వెళ్లకుండా జగన్నాథుడే స్వయంగా హనుమంతుడిని బంగారు గొలుసులతో కట్టేశాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన వివరాలను కూడా చూద్దాం.
బేడీ హనుమాన్ ఆలయ చరిత్ర:
ఈ ఆలయాన్ని బేడీ హనుమాన్ ఆలయం అని పిలవడం వెనుక కారణం హనుమంతుడిని గొలుసులతో బంధించడమే. పురాతన కాలంలో ఒకసారి సముద్ర అలలు జగన్నాథ ఆలయానికి ప్రవేశించాయి. అంతేకాకుండా సునామి రావడంతో పూరీ ప్రజలంతా కూడా ఎన్నో బాధలు పడేవారు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా మూడుసార్లు సముద్ర అలలు ప్రవేశించాయి.
అప్పుడు జగన్నాథుడు పూరీ ప్రజల కోసం వాయుపుత్రుడైన హనుమంతుడిని సముద్రాన్ని నియంత్రించడానికి నియమించాడు. ఒకసారి రాముల వారి పూజ చూడడానికి హనుమంతుడు సముద్రం దగ్గర నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు సముద్రం కూడా అతని తర్వాత నగరంలోకి ప్రవేశించింది. దాంతో జగన్నాథుడు సముద్ర అలలను నిరోధించడానికి అక్కడే హనుమంతుడిని బంగారు గొలుసులతో బంధించాడు. అందుకనే ఈ ఆలయాన్ని బేడీ హనుమాన్ ఆలయం అని పిలుస్తారు.
ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది. ప్రధాన విగ్రహమైన హనుమాన్ గుడి చేతిలో గద ఉంటుంది. ఎడమ చేతిలో లడ్డు పట్టుకుని హనుమాన్ మనకు దర్శనం ఇస్తాడు. ఆలయ బయట గోడలపై చూసినట్లయితే వివిధ దేవుళ్ల చిత్రాలు ఉంటాయి. దక్షిణ గోడపై హనుమ వినాయకుని విగ్రహం ఉంటుంది. పశ్చిమ గోడపై హనుమాన్ తల్లి అయిన అంజనా దేవి విగ్రహం ఉంటుంది. ఆమె ఒడిలో బాల హనుమాన్ ఉంటాడు. పూరీ వెళ్లినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శించాలి.
నిరాకరణ: (ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము.) వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి రత్నాల నిపుణుడిని సంప్రదించండి. )
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


