రాహువు అనుగ్రహంతో ఈ నాలుగు రాశులకు వరాల జల్లు... 2026 నుంచి డబ్బు, సంతోషం ఇలా దేనికీ లోటు ఉండదు!

గ్రహాలు రాశి మార్పు చెందినప్పుడు 12 రాశుల వారిపై ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. 2026లో జరిగే గ్రహాల మార్పులు కొన్ని రాశుల వారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. రాహువు కారణంగా కొన్ని రాశుల వారి జీవితంలో చాలా సమస్యలు తొలగిపోతాయి. రాహువు కుంభ రాశిలో సంచారం చేస్తున్నాడు. 2026లో మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

Published on: Oct 24, 2025, 10:00:07 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. గ్రహాలు రాశి మార్పు చెందినప్పుడు అవి ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. 2026లో జరిగే గ్రహాల మార్పులు కొన్ని రాశుల వారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ముఖ్యంగా చెప్పుకుంటే, రాహువు కారణంగా కొన్ని రాశుల వారి జీవితంలో చాలా సమస్యలు తొలగిపోతాయి. మే 18, 2025 నుండి రాహువు కుంభ రాశిలో సంచారం చేస్తున్నాడు. 2026లో మకరరాశిలోకి ప్రవేశిస్తాడు.

రాహువు నుంచి ఈ నాలుగు రాశులకు వరాల జల్లు (pinterest)
రాహువు నుంచి ఈ నాలుగు రాశులకు వరాల జల్లు (pinterest)

రాహువు సంచారం

ఈ కారణంగా నాలుగు రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు కలగబోతున్నాయి. ద్వాదశ రాశుల వారిపై రాహువు సంచారం ప్రభావం చూపించినప్పటికీ, కొన్ని రాశుల వారికి మాత్రం ఎక్కువ లాభాలు కలుగుతాయి. మరి ఏఏ రాశుల వారికి రాహువు కారణంగా ఎక్కువ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మకర రాశిలోకి రాహువు ప్రవేశం.. 2026లో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం

1.మిథున రాశి:

మిథున రాశి వారికి 2026 బాగా కలిసొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు మంచి ఉద్యోగ అవకాశాలను పొందుతారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా సక్సెస్ అందుతుంది. విద్యార్థులకు కూడా ఇది శుభ సమయం. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.

ఈ రాశి వారు ఈ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ప్రతి పనిలో విజయాన్ని అందుకుంటారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.

2.వృషభ రాశి:

ఈ రాశి వారికి రాహువు కారణంగా అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశాలు ఈ సమయంలో లభిస్తాయి. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా ఎక్కువ లాభాలు వస్తాయి. సక్సెస్‌ను అందుకుంటారు.

3.కన్య రాశి:

కన్య రాశి వారికి రాహు కారణంగా శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. పిల్లల కారణంగా ఎక్కువ సంతోషాన్ని పొందుతారు. కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తారు. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.

4.మీన రాశి:

మీన రాశి వారికి రాహువు కారణంగా శుభ ఫలితాలు ఎదురవుతాయి. సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. లక్ష్యాలను చేరుకుంటారు. అన్నిట్లో విజయాలను అందుకుంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More