నక్కతోక తొక్కనున్న నాలుగు రాశులు.. గురువు తిరోగమనంతో ఊహించని లాభాలు.. డబ్బు, ఆస్తులు, అదృష్టం ఇలా ఎన్నో!

గురువు కర్కాటక రాశిలో తిరోగమనం చెందడంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కానీ కొన్ని రాశుల వారికి మాత్రం ఎక్కువ లాభాలు వస్తాయి. మరి గురువు సంచారంలో మార్పు రావడంతో ఏ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు? ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Oct 14, 2025 12:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు ద్వాదశ రాశుల వారి జీవితంలో కూడా మార్పు వస్తుంది. వచ్చే నెల అంటే నవంబరులో గురువు తిరోగమనంలో ఉంటాడు. గురువు కర్కాటక రాశిలో తిరోగమనం చెందడంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కానీ కొన్ని రాశుల వారికి మాత్రం ఎక్కువ లాభాలు వస్తాయి. మరి గురువు సంచారంలో మార్పు రావడంతో ఏ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు? ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నక్కతోక తొక్కనున్న నాలుగు రాశులు.. గురువు తిరోగమనంతో ఊహించని లాభాలు (pinterest)
నక్కతోక తొక్కనున్న నాలుగు రాశులు.. గురువు తిరోగమనంతో ఊహించని లాభాలు (pinterest)

గురువు తిరోగమనంతో ఏ రాశుల వారు మంచి ఫలితాలను ఎదుర్కొంటారు?

నవంబర్ 11, మంగళవారం నాడు రాత్రి 10:11కు గురువు కర్కాటక రాశిలో తిరోగమనం చెందుతాడు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. గురువు ప్రస్తుతం మిధున రాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే గురువు తిరోగమనం ఏ రాశుల వారికి మంచి ఫలితాలను అందిస్తుంది? గురువు తిరోగమనంతో ఏ రాశుల వారు మంచి ఫలితాలను ఎదుర్కొంటారు, ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం.

గురువు తిరోగమనంతో ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు

1.వృషభ రాశి

వృషభ రాశి వారికి నవంబర్ నెలలో గురువు తిరోగమనం మంచి ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. పాత లోన్లు కట్టేస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎప్పటి నుంచో తీరని కుటుంబ సమస్యలు కూడా ఈ సమయంలో తీరిపోతాయి.

2.తులా రాశి

తులా రాశి వారికి గురువు తిరోగమనం అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్న పనులను ఈ సమయంలో పూర్తి చేసేస్తారు. ఆదాయం పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. పూర్వీకుల నుంచి ఆస్తి వస్తుంది.

3.వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి గురువు తిరోగమనం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో పూర్తికాని పనులను ఈ సమయంలో చక్కగా పూర్తి చేస్తారు.

4.మీన రాశి

మీన రాశి వారికి గురువు తిరోగమనం బాగా కలిసి వస్తుంది. అనేక విధాలుగా లాభాలను పొందుతారు. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పాత ఇన్వెస్ట్మెంట్ల నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి. స్నేహితులతో సంతోషంగా ఉంటారు.

News/Rasi Phalalu/నక్కతోక తొక్కనున్న నాలుగు రాశులు.. గురువు తిరోగమనంతో ఊహించని లాభాలు.. డబ్బు, ఆస్తులు, అదృష్టం ఇలా ఎన్నో!
News/Rasi Phalalu/నక్కతోక తొక్కనున్న నాలుగు రాశులు.. గురువు తిరోగమనంతో ఊహించని లాభాలు.. డబ్బు, ఆస్తులు, అదృష్టం ఇలా ఎన్నో!