Raksha Bandhan Wishes 2026: ఈ ఉత్తమ సందేశాలతో రక్షా బంధన్ శుభాకాంక్షలు పంపండి, 'హ్యాపీ రాఖీ' అని చెప్పండి!

రక్షా బంధన్ శుభాకాంక్షలు 2026: రక్షా బంధన్ పండుగ సోదరులు మరియు సోదరీమణులకు ప్రత్యేకమైనది కావచ్చు, కానీ ప్రజలు తమ ప్రియమైన వారికి కూడా ఈ రోజు శుభాకాంక్షలు పంపుతారు. ఈ ఎంపిక చేసిన సందేశాలతో మీరు రక్షా బంధన్ శుభాకాంక్షలు కూడా పంపవచ్చు.

Published on: Aug 27, 2026, 16:00:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, ఆప్యాయతలకు ప్రతీక అయిన పండుగ రక్షాబంధన్. ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి రోజున ఈ వేడుకను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది రక్షాబంధన్ వేడుక ఆగస్టు 28, 2026 శుక్రవారం రోజున వస్తోంది. ఈ పవిత్రమైన రోజున చంద్రగ్రహణం ఏర్పడుతున్నప్పటికీ, అది భారతదేశంలో గోచరించకపోవడం వల్ల ఎలాంటి సూతక కాలం లేదా అశుభ నియమాలు వర్తించవు. దీనివల్ల రోజంతా ఎటువంటి ఆటంకం లేకుండా రాఖీ పండుగను జరుపుకోవచ్చు. అంతేకాకుండా, ఈసారి భద్రా దోషం కూడా లేకపోవడం విశేషం. అయితే రాఖీ కట్టే సమయంలో రాహుకాలం వంటి అంశాలను మాత్రం పరిశీలించడం మంచిది.

Raksha Bandhan Wishes 2026: ఈ ఉత్తమ 25+ సందేశాలతో రక్షా బంధన్ శుభాకాంక్షలు పంపండి, 'హ్యాపీ రాఖీ' అని చెప్పండి! (AI)
Raksha Bandhan Wishes 2026: ఈ ఉత్తమ 25+ సందేశాలతో రక్షా బంధన్ శుభాకాంక్షలు పంపండి, 'హ్యాపీ రాఖీ' అని చెప్పండి! (AI)

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే అంతులేని ప్రేమను, అప్యాయతలను చాటిచెప్పే ఈ ప్రత్యేక రోజున దూరంగా ఉన్న తమ ప్రియమైన వారికి అందమైన సందేశాలు పంపి శుభాకాంక్షలు తెలియజేయడం ఆనవాయితీగా వస్తోంది. మీ తోబుట్టువుల ముఖంలో చిరునవ్వులు పూయించే కొన్ని అద్భుతమైన శుభాకాంక్షల మెసేజ్‌లు మీకోసం..

అన్నయ్యకు పంపాల్సిన ప్రత్యేకమైన రాఖీ మెసేజ్‌లు

మాటల్లో చెప్పలేనిది అన్నాచెల్లెళ్ల అనుబంధం.. ఎప్పటికీ చెరగని ఈ ప్రేమ బంధానికి రాఖీ శుభాకాంక్షలు.

ఎక్కడ ఉన్నా నా అన్నయ్య నిత్యం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ రక్షాబంధన్!

నీ తోడుంటే చాలు ప్రపంచాన్ని ఎదురించగలను, నా ప్రియమైన అన్నయ్యకు రాఖీ పండుగ శుభాకాంక్షలు.

చెల్లెలు/అక్కకు పంపాల్సిన అపురూపమైన సందేశాలు

దూరంగా ఉన్నా మనసులో ఎప్పుడూ ఉండే నా ముద్దుల చెల్లెలికి రక్షాబంధన్ శుభాకాంక్షలు.

నా ప్రతి కష్టంలోనూ నీడలా నిలిచే నా చెల్లెలు దేవుడు నాకు ఇచ్చిన అమూల్యమైన బహుమతి.

శ్రావణ మాసంలో వెలువడిన ఈ పండుగ మన బంధాన్ని మరింత బలపరచాలని కోరుకుంటున్నాను.

నా జీవితంలోని ప్రతి ఆనందానికి కారణమైన నా చెల్లెలికి ప్రేమతో కూడిన రాఖీ శుభాకాంక్షలు..

అందరితో పంచుకునే ఆకర్షణీయమైన కోట్స్ 2026

చిన్ననాటి అల్లరి, గొడవలు, ఆపై పడే ప్రేమ.. ఇవన్నీ కలిపితేనే అన్నాచెల్లెళ్ల ప్రయాణం.

గులాబీ లాంటి మంచితనంతో ఉండే నా తోబుట్టువుకు జీవితాంతం సంతోషాలు కలగాలని కోరుకుంటూ.. హ్యాపీ రక్షాబంధన్

"నువ్వు దూరంగా ఉన్నా నీ ఆలోచనలు ఎప్పుడూ నా వెంటే ఉంటాయి.. నా ప్రతి గెలుపు వెనుక నిలిచే ధైర్యం నువ్వు.. రక్షాబంధన్ శుభాకాంక్షలు!"

"చేతికి కట్టే ఆ దారం కేవలం ఒక రంగురంగుల దారం కాదు.. అది నాపై నీకు ఉండే నమ్మకానికి, రక్షణకు ప్రతీక. హ్యాపీ రాఖీ!"

అలకలు, బుజ్జగింపులు, అంతులేని ప్రేమ కలిపితేనే మన బంధం. జన్మజన్మకూ ఇదే బంధం కావాలని కోరుకుంటూ.. రక్షాబంధన్ శుభాకాంక్షలు

లోకం ఎవరైనా వ్యతిరేకమైనా నా వైపు నిలబడే ఏకైక శక్తి నువ్వు. నా ప్రతి సంతోషానికి కారణమైన నీకు హృదయపూర్వక రాఖీ శుభాకాంక్షలు

చాక్లెట్లు పంచుకున్న రోజులు పోయినా, ఆప్యాయత మాత్రం అలాగే ఉంది.. నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి రాఖీ శుభాకాంక్షలు..

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More