రక్షాబంధన్ వేళ ఈ 4 రాశులకు అదృష్టమే అదృష్టం.. కెరీర్, ఆర్థిక లాభాలు!
2026లో రక్షాబంధన్ ఆగస్టు 28న జరగనుంది. ఈ ఏడాది రాఖీ పండుగ జ్యోతిష్య పరంగా కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. బుధాదిత్య రాజయోగం ఏర్పడటంతో పాటు సూర్యుడు సింహరాశిలో ఉండటం వల్ల శుభ ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య విశ్వాసం.
ఈ ఏడాది రక్షాబంధన్ ఆగస్ట్ 28, అంటే రేపు వచ్చింది. అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రత్యేకంగా నిలిచే ఈ పండుగ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు వస్తుంది. 2026లో రక్షాబంధన్ రోజు ఆధ్యాత్మికంగానే కాదు, జ్యోతిష్య పరంగా కూడా ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది.

రాఖీ పండుగ నాడు బుధాదిత్య రాజయోగం కూడా ఏర్పడనుంది. అలాగే సూర్యుడు తన స్వరాశి అయిన సింహరాశిలో ఉంటాడు. దాంతో శుభ ప్రభావం చోటుచేసుకోబోతోంది. అన్ని రాశుల వారికి తన అనుగ్రహాన్ని అందిస్తాడు. ఈ ప్రత్యేక గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. కెరీర్‌లో అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి.
వ్యాపారులకి కూడా ఇది అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. అలాగే ఈ సమయంలో ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న పనులు అన్నీ కూడా పూర్తయిపోతాయి. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మరి ఏ రాశుల వారికి ఈ రక్షాబంధన్ బాగా కలిసి రాబోతోంది? అదృష్ట రాశులు ఎవరు? వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.
రక్షాబంధన్ వేళ ఈ రాశుల వారికి అద్భుతమైన లాభాలు.. అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారా?
1.మేష రాశి
మేష రాశి వారు పెండింగ్‌లో ఉన్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. కోరుకున్న వాటిని పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులు అడ్డంకులను తొలగించి ముందుకు వెళ్తారు. సన్నిహిత బంధువులు తిరిగి కుటుంబంలోకి వస్తారు. కెరీర్, ఆర్థికపరంగా మీరు చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను తీసుకొస్తాయి. ఆర్థికపరంగా కూడా మేష రాశి వారికి బాగా కలిసి వస్తుంది.
2.సింహ రాశి
సింహ రాశి వారు రక్షాబంధన్ అనేక శుభ ప్రయోజనాలను పొందుతారు. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారు. కెరీర్‌లో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. అవకాశాలు పెరుగుతాయి.
3.కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి శుభ ఘడియలు మొదలవుతాయి. రక్షాబంధన్ బాగా కలిసి వస్తుంది. కోరుకున్న విజయాలను సాధిస్తారు. ముఖ్యమైన పనులను టైంకి పూర్తి చేస్తారు. వ్యాపారులకి కూడా ఇది మంచి సమయం. భారీగా లాభాలు వస్తాయి. కెరీర్‌లో మంచి మార్పులు చూస్తారు. ఈ సమయంలో విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కళా రంగంలో పురోగతిని సాధిస్తారు. కష్టపడి పని చేస్తే కచ్చితంగా బాగా కలిసి వస్తుంది. అన్ని పనులను సరిగ్గా పూర్తి చేయగలుగుతారు.
4.తులా రాశి
తులా రాశి వారికి కొత్త ఆరంభాలకు అనుకూలమైన సమయం. చాలా కాలంగా కొనసాగుతున్న ప్రయత్నాల్లో విజయాలను సాధిస్తారు. కెరీర్‌లో అనేక మార్పులు వస్తాయి. కొత్త పెట్టుబడి ప్రణాళికలు విజయవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో కూడా సానుకూల మార్పులను చూస్తారు. ఇలా మొత్తం మీద ఈ రాశి వారికి కూడా రక్షాబంధన్ బాగా కలిసి వస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


