ఆగస్టు 28న చంద్రగ్రహణం.. గ్రహణ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?
ఆగస్టు 28న ఏర్పడనున్న చంద్రగ్రహణాన్ని మతపరమైన విశ్వాసాల ప్రకారం ప్రత్యేకమైన సమయంగా భావిస్తున్నారు. గ్రహణ సమయంలో మంత్ర జపం, ప్రార్థన, ధ్యానం చేయడం, గ్రహణం అనంతరం తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవడం, పేదలకు ఆహారం, బట్టలు లేదా అవసరమైన వస్తువులను దానం చేయడం మంచిదని చెబుతున్నారు.
ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఆగస్ట్ 28న ఏర్పడబోతోంది. మతపరమైన విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే, గ్రహణకాలం ఒక ప్రత్యేకమైన సమయంగా భావిస్తారు. గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయకూడదు. ఈ సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు? ఎటువంటి నియమాలను పాటించాలి? అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. భారతదేశంలో కనపడదు కనుక సూతక కాలం వర్తించదు.

ఏకాగ్రత, ప్రార్థన మనశ్శాంతిని కాపాడడానికి సహాయపడతాయని అంటారు. చంద్రగ్రహణం సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చంద్రగ్రహణం సమయంలో ఏం చేయాలి?
- చంద్రగ్రహణం సమయంలో మహా విష్ణువును, చంద్రదేవుని స్మరిస్తూ మంత్రాలు జపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
- అలాగే గ్రహణం తర్వాత తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
- పేదవాళ్లకు ఆహారం, బట్టలు లేదా ఇతర ఉపయోగకరమైన వస్తువులను దానం చేయడం మంచిది.
- చంద్రగ్రహణం సమయంలో ఆహారం, నీటిని తులసి ఆకులతో కప్పి ఉంచడం మంచిది. అలాగే, ఈ చంద్రగ్రహణం సమయంలో కొన్ని తప్పులు చేయకూడదు. అవేంటో కూడా చూద్దాం.
గ్రహణ సమయంలో చేయకూడని ఐదు పనులు ఇవి
శుభకార్యాలు, మంచి పనులు చేయకూడదు:
గ్రహణ సమయంలో శుభకార్యాలు, మంచి పనులు చేయడం నిషిద్ధం. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, నామకరణం ఇలాంటివి చేయకూడదు. ఈ సమయంలో కొత్త పనులను మొదలుపెట్టడం కూడా మంచిది కాదు.
గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు:
గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు. గ్రహణకాలం ప్రారంభం అవ్వడానికి ముందే భోజనం చేసేయాలి. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం, పానీయాలు తీసుకోకూడదు. ముందుగా తయారు చేసిన వంటలపై తులసి ఆకులను వేయాలి లేదా దర్భ వేయడం మంచిది.
దేవుని విగ్రహాలను తాకకూడదు:
గ్రహణ సమయంలో ఆలయాలను కూడా మూసివేస్తారు. ఇంట్లో ఉండే విగ్రహాలను కూడా తాకకూడదు. ఈ సమయంలో కేవలం మనసులో దేవుడిని స్మరించుకుని మంత్రాలను జపించాలి.
గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి
చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టమైన పనులు, అనవసరమైన టెన్షన్స్ వంటివి తీసుకోకూడదు. వాటికి దూరంగా ఉండాలి. ఈ గ్రహణాల వలన కడుపులో ఉన్న బిడ్డకు హాని జరుగుతుందని శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేవు. కాబట్టి ఆందోళన చెందడం మంచిది కాదు.
ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. బరువైన పనులు, ఒత్తిడికి దూరంగా ఉండాలి. గ్రహణం సమయంలో శారీరకంగా అతిగా శ్రమించడం లేదా ఒత్తిడికి గురవడం మంచిది కాదు. ధ్యానం చేస్తూ ప్రశాంతమైన మంత్రాలను జపిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మతపరమైన నమ్మకాల ప్రకారం చూసినట్లయితే, చంద్రగ్రహణం సమయంలో సంయమనం మరియు జాగ్రత్తలు పాటించడం శుభప్రదం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


