రథసప్తమి 2026: రథసప్తమి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయం, పూజా విధానంతో పూర్తి వివరాలు ఇవిగో!

ప్రతి ఏటా రథసప్తమి మాఘ మాసం శుక్లపక్ష సప్తమి నాడు వస్తుంది. ఆ రోజును సూర్య జయంతిగా జరుపుకుంటాము. ఈ ఏడాది రథ సప్తమి జనవరి 25న వచ్చింది. ఆ రోజు చంద్రుడికి చెందిన శ్రవణ నక్షత్రంలోకి సూర్యుడు రావడం వలన సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అన్నీ సవ్యంగా జరుగుతాయి. అంతా మంచి జరుగుతుంది. 

Published on: Jan 19, 2026, 16:30:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రథసప్తమి నాడు సూర్య భగవానుడిని ఆరాధించే సంప్రదాయం ఉంది. ప్రతి ఏటా రథసప్తమి మాఘ మాసం శుక్లపక్ష సప్తమి నాడు వస్తుంది. ఆ రోజును సూర్య జయంతిగా జరుపుకుంటాము. సూర్యుడు రథాన్ని దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మార్చి, ఏడు గుర్రాల రథంపై ప్రయాణం సాగిస్తాడని, ఆ పర్వదినాన సూర్యుని ఆరాధిస్తే ఆరోగ్యం, సంపద కలుగుతాయని నమ్మకం.

రథసప్తమి 2026 (pinterest)
రథసప్తమి 2026 (pinterest)

రథసప్తమి 2026

ఈ ఏడాది రథ సప్తమి జనవరి 25న వచ్చింది. ఆ రోజు చంద్రుడికి చెందిన శ్రవణ నక్షత్రంలోకి సూర్యుడు రావడం వలన సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అన్నీ సవ్యంగా జరుగుతాయి. అంతా మంచి జరుగుతుంది, కోరికలు కూడా నెరవేరుతాయి.

రథసప్తమి విశిష్టత

హిందూ సంప్రదాయం ప్రకారం చూసినట్లయితే సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా రథసప్తమి నాడు సూర్యుని ఆరాధిస్తే ఎంతో మంచి జరుగుతుంది. సూర్యుడు ఏడు గుర్రాలపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దశగా ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఆ రోజు నుంచి ఈ దిశగా ప్రయాణం సాగుతుందని నమ్ముతారు.

సూర్య జయంతి

మాఘ సప్తమి నుంచి రాబోయే ఆరు నెలలు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంగా భావిస్తారు. ఏడు గుర్రాలను వేద ఛందస్సులుగా పిలుస్తారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు ఉన్న 12 రాశుల్లో ప్రయాణిస్తాడు. 12 రాశులను పూర్తి చేయడానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుని పుట్టినరోజు కాదు; భూమిపైకి సూర్యుడు సాగించే ప్రయాణం మొదలవుతుందని ఆ రోజును సూర్య జయంతిగా జరుపుతారు.

రథసప్తమి నాడు ఏం చేయాలి?

  1. మాఘ సప్తమి నాడు ఇలా చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. కొన్ని పనులు చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా బయటపడొచ్చు.
  2. రథ సప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి, తర్వాత రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి.
  3. స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులు మగవారు, ఏడు చిక్కుడు ఆకులు ఆడవారు పెట్టుకుని తలస్నానం చేయాలి.
  4. రథ సప్తమి నాడు ఆవునెయ్యితో దీపారాధన చేయాలి. తూర్పు దిక్కున తులసి కోట పక్కన ఆవుపేడతో అలికి పద్మం వేసి, పొయ్యి పెట్టి ఆవుపాలు పొంగించాలి.
  5. పాలల్లో కొత్త బియ్యం, నెయ్యి, బెల్లం వేయాలి. ఇలా పరమాన్నాన్ని తయారు చేయాలి.
  6. తులసి కోట ఎదురుగా ఏడు చిక్కుడు ఆకులతో రథం చేయాలి. ఆ తర్వాత ఆ చిక్కుడు ఆకులపై పరమాన్నం పెట్టి నైవేద్యం సమర్పించాలి.
  7. ఇలా వీలుకాకపోతే గ్యాస్ స్టవ్ పైన అయినా నైవేద్యం వండి సమర్పించవచ్చు. ఇలా చిత్తశుద్ధితో సూర్యుని ఆరాధిస్తే విశేష ఫలితాలను పొందడానికి వీలవుతుంది.
  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More