రోహిణి కార్తె ఎప్పటి నుంచి? రోళ్ళు పగిలే ఎండలు ఎందుకు? ఈ సమయంలో సూర్య అనుగ్రహం కోసం వీటిని పాటించండి!

Rohini karthi 2026: రోహిణి కార్తె నుంచి ఎండలు మరింత తీవ్రంగా మారతాయి. ఈ ఏడాది రోహిణి కార్తె ఎప్పటి నుంచి మొదలవుతుంది? రోళ్ళు పగలే ఎండలు ఎందుకు? అలాగే ఈ సమయంలో సూర్య అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి, ఎలాంటి దానాలు చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.

Published on: May 21, 2026, 10:20:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rohini karthi 2026: ఈ ఏడాది రోహిణి కార్తె మే 25 నుంచి ప్రారంభమవుతుంది. అంటే అప్పటి నుంచి తీవ్రమైన ఎండలు మొదలవుతాయి. రోహిణి కార్తె అంటే ఏంటి? ఈ సమయంలో ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? అలాగే సూర్యుని అనుగ్రహం కలగాలని, జాతకంలో సూర్యుడు బలపడాలన్నా కొన్ని దానాలు చేయడం వంటివి పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. మరి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రోహిణి కార్తె ఎప్పటి నుంచి? రోళ్ళు పగిలే ఎండలు ఎందుకు? (pinterest)
రోహిణి కార్తె ఎప్పటి నుంచి? రోళ్ళు పగిలే ఎండలు ఎందుకు? (pinterest)

రోహిణి కార్తె 2026

రోహిణి కార్తె మే 25న ప్రారంభమవుతుంది. రోహిణి కార్తె అంటే సూర్యుడు ప్రతి 13 రోజులకు ఒకసారి తన నక్షత్రంలో మార్పు చేస్తూ ఉంటాడు. రోహిణి కార్తె సమయంలో సూర్యుడు రోహిణి నక్షత్రంలో ఉంటాడు. ఈ సమయంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతాయి. జూన్ 8 వరకు రోహిణి కార్తె ఉంటుంది. ఆ తర్వాత మృగశిర కార్తె, ఆరుద్ర కార్తె మొదలవుతాయి.

రోహిణి కార్తె సమయంలో రోళ్ళు పగిలే ఎండలు ఎందుకు ఉంటాయి?

సూర్యుడు ఈ సమయంలో మన నెత్తి మీదకు వస్తాడు. ఈ కార్తె సమయంలో సూర్యుడు ఉగ్రరూపంలో ఉంటాడు. ఆ ఉగ్ర రూపాన్ని భూమి తట్టుకోలేదు. ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. 15 రోజుల పాటు తీవ్రమైన ఎండలు, వేడి గాలులు కలుగుతాయి. అచ్చం అగ్నిగోళంలాగే సూర్యుడు ఈ సమయంలో మండుతాడు.

రోహిణి కార్తె సమయంలో ఎలాంటి దానాలు చేయాలి?

రోహిణి కార్తె సమయంలో చేసే దానాలకు విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో కాటన్ దుస్తులు, గొడుగులు, చెప్పులు, ఫ్యాన్లు వంటివి దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది మతపరంగా మంచిది మాత్రమే కాదు, మానవత్వం కూడా.

ఈ ఆహారాన్ని దానం చేయండి

రోహిణి కార్తె సమయంలో ఆహారాన్ని దానంగా చేస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. గోధుమలు, బియ్యం, బెల్లం, పప్పులు వంటివి అవసరమైన వారికి లేదా పేదవారికి దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సంతోషం, ప్రశాంతత పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు.

నీళ్లు, చల్లటి పదార్థాలు కూడా దానం చేయండి

రోహిణి కార్తె సమయంలో కుండలు, మజ్జిగ, పండ్లు వంటివి దానం చేస్తే కూడా విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు. జాతకంలో సూర్యుడి స్థానాన్ని బలపరుచుకోవచ్చు. విజయాలను కూడా అందుకోవచ్చు. అనేక విధాలుగా లాభాలను పొందడానికి వీలవుతుంది.

సూర్యుడికి అర్ఘ్యం

సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి, ఆదిత్య హృదయ స్తోత్రం పఠిస్తే కూడా సూర్య అనుగ్రహాన్ని పొందవచ్చు.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More