...
...
Next Story

Saphala Ekadashi vrata katha: ఈరోజే సఫల ఏకాదశి, ఈ కథ వింటే అన్నింటా శుభ ఫలితాలే.. కార్యసిద్ధి, ఐశ్వర్య ప్రాప్తి!

Saphala Ekadashi vrata katha: సఫల ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే చాలా మంది ఆ రోజు ఉపవాసం ఉంటారు. చేపట్టిన పనులన్నీ విజయవంతం కావాలనే సఫల ఏకాదశి నాడు వీటిని పాటించడం జరుగుతుంది. అయితే సఫల ఏకాదశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించే వారు తప్పక వ్రత కథ చదువుకోవాలి.

Published on: Dec 15, 2025, 08:00:21 IST
Advertisement

Saphala Ekadashi vrata katha: సఫల ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే చాలా మంది ఆ రోజు ఉపవాసం ఉంటారు. చేపట్టిన పనులన్నీ విజయవంతం కావాలనే సఫల ఏకాదశి నాడు వీటిని పాటించడం జరుగుతుంది. అయితే సఫల ఏకాదశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించే వారు తప్పక వ్రత కథ చదువుకోవాలి. ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సఫల ఏకాదశి వ్రత కథ:

Saphala Ekadashi vrata katha: ఈరోజే సఫల ఏకాదశి, ఈ కథ వింటే అన్నింటా శుభ ఫలితాలే (pinterest)
Saphala Ekadashi vrata katha: ఈరోజే సఫల ఏకాదశి, ఈ కథ వింటే అన్నింటా శుభ ఫలితాలే (pinterest)

ఈ సఫల ఏకాదశి వ్రత మహత్యాన్ని శివుడు స్వయంగా పార్వతి దేవికి చెప్పాడని పద్మ పురాణంలో చెప్పబడింది. సఫల ఏకాదశి నాడు ఈ వ్రత కథను చదువుకుని, శిరస్సుపై అక్షింతలు వేసుకుంటే వ్రతం సంపూర్ణమవుతుంది. వ్రత ఫలితాన్ని పొందవచ్చు.

కృష్ణుడు పాండవులకు చెప్పిన కథ:

సఫల ఏకాదశి నాడు జాగరణ చేసి ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం కలుగుతుంది. ఈ వ్రతానికి సమానమైన యజ్ఞం లేదు, తీర్థం లేదు. సఫల ఏకాదశి విశిష్టతను చాటి చెప్పే కథను కృష్ణుడు పాండవులకు చెప్పాడని పురాణాలు తెలుపుతున్నాయి.

పూర్వము చంపావతి రాజ్యం అన్న మాహిష్మంతుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఆ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించేవాడు. అతనికి లుంబకుడు అనే కొడుకు ఉండేవాడు. అయితే లుంబకుడు చెడు సహవాసాలతో ఎప్పుడూ అధర్మంలో జీవించేవాడు. కుమారుణ్ని వదిలేయకుండా ఆ రాజు అతనికి రాజబహిష్కరణ శిక్ష విధించాడు. దీంతో రాజు కొడుకు లొంబకుడు అడవులు పాలయ్యాడు. ఆహారం లేక తన పరిస్థితిని చూసి పశ్చాత్తాపపడ్డాడు. ఒక మఱ్ఱి చెట్టు దగ్గరికి వెళ్లి రాత్రంతా అక్కడే గడిపి, ఏమీ తినకుండా స్పృహ తప్పి పడిపోయాడు.

ఉపవాస ఫలితం:

పాండవులు అరణ్య వాసం చేసినప్పుడు ఈ కథను కృష్ణుడు పాండవులకు చెప్పి, వారి చేత ఈ వ్రతాన్ని చేయించాడు. దీంతో వారు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి. అందుకనే తెలిసి కానీ తెలియక కానీ ఈ సఫల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి, కార్యసాఫల్యత ఉంటుంది, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కృష్ణుడు పాండవులకు ఈ కథను తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ కథను చదివినా, విన్నా కూడా కార్యసిద్ధి కలుగుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe