గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పులు చోటు చేసుకుంటే, అది అందరిపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఏప్రిల్ 2న కుజుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహ ప్రవేశంతో కొన్ని రాశుల వారికి లాభాలు కలుగుతాయి. అలాగే ఇదే సమయంలో శనితో సంయోగం ఏర్పడడంతో, కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆస్తులను పొందుతారు, కోరికలు నెరవేరుతాయి. మరి మీన రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.
మీన రాశిలో శని, కుజ గ్రహాల కలయిక.. ఈ రాశుల వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది
1.వృషభ రాశి:

ఏప్రిల్ 2న ఏర్పడే ఈ రెండు గ్రహాల కలయిక వృషభ రాశి వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఆస్తులను పొందుతారు, కోరికలు నెరవేరుతాయి. కష్టానికి తగ్గ ఫలితాలను చూస్తారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.
2.మిధున రాశి:
మిధున రాశి వారికి కూడా ఈ రెండు గ్రహాల కలయిక వలన అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. కెరీర్‌లో, వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. అంతే కాకుండా సక్సెస్‌ను, పేరు ప్రతిష్టలను పొందుతారు.
ఈ రాశి వారు స్నేహితులు, బంధువుల ద్వారా కూడా భారీ లాభాలను పొందుతారు. ఇలా ఈ రాశి వారికి ఈ గ్రహాల కలయిక వలన అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి.
3.తులా రాశి:
తులా రాశి వారికి ఈ కలయిక ఆరో ఇంట్లో ఏర్పడుతుంది. దీంతో ఈ రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది, అప్పులు తీరిపోతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగుపడుతుంది. అయితే ఇతరుల వాహనాలను తీసుకుని నడపడం ఈ సమయంలో మంచిది కాదు.
4.సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ రెండు గ్రహాల కలయిక అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పూర్వికుల నుంచి ఆస్తి లాభాలను పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. ఈ రాశి వారి పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఆర్థికపరంగా కూడా మంచి స్థితి ఉంటుంది.
{{/usCountry}}సింహ రాశి వారికి ఈ రెండు గ్రహాల కలయిక అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పూర్వికుల నుంచి ఆస్తి లాభాలను పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. ఈ రాశి వారి పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఆర్థికపరంగా కూడా మంచి స్థితి ఉంటుంది.
{{/usCountry}}