మీన రాశిలో శని, కుజ గ్రహాల కలయిక.. ఈ రాశుల వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది!

గ్రహాల సంచారంలో మార్పులు చోటు చేసుకుంటే, అది అందరిపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఏప్రిల్ 2న కుజుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహ ప్రవేశంతో కొన్ని రాశుల వారికి లాభాలు కలుగుతాయి. అలాగే ఇదే సమయంలో శనితో సంయోగం ఏర్పడడంతో, కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. 

Published on: Mar 24, 2026 11:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పులు చోటు చేసుకుంటే, అది అందరిపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఏప్రిల్ 2న కుజుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహ ప్రవేశంతో కొన్ని రాశుల వారికి లాభాలు కలుగుతాయి. అలాగే ఇదే సమయంలో శనితో సంయోగం ఏర్పడడంతో, కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆస్తులను పొందుతారు, కోరికలు నెరవేరుతాయి. మరి మీన రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.

మీన రాశిలో శని, కుజ గ్రహాల కలయిక.. ఈ రాశుల వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది (pinterest)
మీన రాశిలో శని, కుజ గ్రహాల కలయిక.. ఈ రాశుల వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది (pinterest)

మీన రాశిలో శని, కుజ గ్రహాల కలయిక.. ఈ రాశుల వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది

1.వృషభ రాశి:

ఏప్రిల్ 2న ఏర్పడే ఈ రెండు గ్రహాల కలయిక వృషభ రాశి వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఆస్తులను పొందుతారు, కోరికలు నెరవేరుతాయి. కష్టానికి తగ్గ ఫలితాలను చూస్తారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

2.మిధున రాశి:

మిధున రాశి వారికి కూడా ఈ రెండు గ్రహాల కలయిక వలన అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. కెరీర్‌లో, వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. అంతే కాకుండా సక్సెస్‌ను, పేరు ప్రతిష్టలను పొందుతారు.

ఈ రాశి వారు స్నేహితులు, బంధువుల ద్వారా కూడా భారీ లాభాలను పొందుతారు. ఇలా ఈ రాశి వారికి ఈ గ్రహాల కలయిక వలన అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి.

3.తులా రాశి:

తులా రాశి వారికి ఈ కలయిక ఆరో ఇంట్లో ఏర్పడుతుంది. దీంతో ఈ రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది, అప్పులు తీరిపోతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగుపడుతుంది. అయితే ఇతరుల వాహనాలను తీసుకుని నడపడం ఈ సమయంలో మంచిది కాదు.

4.సింహ రాశి:

సింహ రాశి వారికి ఈ రెండు గ్రహాల కలయిక అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పూర్వికుల నుంచి ఆస్తి లాభాలను పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. ఈ రాశి వారి పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఆర్థికపరంగా కూడా మంచి స్థితి ఉంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More