...
...
Next Story

రేపు శ్రావణ మంగళవారం వేళ సిరి సంపదల కోసం లక్ష్మీదేవి స్తోత్రాలు.. ధ్యాన శ్లోకం నుంచి అష్టకం వరకు!

శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవి, పార్వతీదేవి, గౌరీదేవి, దుర్గాదేవి, అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం పఠించదగిన పలు శ్లోకాలు, స్తోత్రాలు ఇందులో అందించారు. ఇందులో శ్రీ లక్ష్మీ ధ్యాన శ్లోకం, మహాలక్ష్మ్యష్టకం, లక్ష్మీ గాయత్రీ మంత్రం, లక్ష్మీదేవి ప్రార్థన, లక్ష్మీ స్తోత్రం, ఫలశ్రుతి ఉన్నాయి.

Published on: Aug 17, 2026, 14:00:10 IST
Advertisement

శ్రీ లక్ష్మీ ధ్యాన శ్లోకం

రేపు శ్రావణ మంగళవారం వేళ సిరి సంపదల కోసం లక్ష్మీదేవి స్తోత్రాలు.. ధ్యాన శ్లోకం నుంచి అష్టకం వరకు! (pinterest)
రేపు శ్రావణ మంగళవారం వేళ సిరి సంపదల కోసం లక్ష్మీదేవి స్తోత్రాలు.. ధ్యాన శ్లోకం నుంచి అష్టకం వరకు! (pinterest)

పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే

నారాయణప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా

లక్ష్మీ అష్టకం

నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే

శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే..

నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి

సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే

లక్ష్మీ గాయత్రీ మంత్రం

ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే

విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్

లక్ష్మీదేవి ప్రార్థన

సర్వజ్ఞే సర్వవరదే

సర్వదుష్టభయంకరి

సర్వదుఃఖహరే దేవి

మహాలక్ష్మి నమోస్తుతే..

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం

దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురామ్

శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం

త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్

లక్ష్మీపూజ

నమస్తుభ్యం వరదే

శ్రీమహాలక్ష్మి నమోస్తుతే

సర్వసంపత్ప్రదే దేవి

నమస్తుభ్యం నమో నమః

అపరాధసహస్రాణి

క్రియంతే హర్నిశం మయా

దాసోయమితి మాం మత్వా

క్షమస్వ పరమేశ్వరి

ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః

భక్తితో 11, 21 లేదా 108 సార్లు జపించవచ్చు.

శ్రీ లక్ష్మీ స్తోత్రం

నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే

శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే

నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి

సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి

సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే

సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని

మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే

ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి

యోగజే యోగసంభూతే మహాలక్ష్మి నమోస్తుతే

స్థూలసూక్ష్మమహారౌద్రే మహాశక్తి మహోదరే

మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే

పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి

పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే

శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే

జగత్స్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే..

ఫలశ్రుతి

సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా

ఏకకాలం పఠేన్నిత్యం మహాపాపవినాశనం

ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం

మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా..

పార్వతీ గాయత్రీ మంత్రం

ఓం కాత్యాయనాయై విద్మహే

కన్యకుమారి ధీమహి

తన్నో దుర్గిః ప్రచోదయాత్

సౌభాగ్యం కోసం ప్రసిద్ధ శ్లోకం

దేవి త్వం భక్తసులభే సౌభాగ్యప్రదాయిని

పతిసౌభాగ్యదే గౌరీ నమస్తే శంకరప్రియే

అమ్మవారి మహిమను స్తుతించే శ్లోకం

యా దేవీ సర్వభూతేషు

శక్తిరూపేణ సంస్థితా

నమస్తస్యై నమస్తస్యై

నమస్తస్యై నమో నమః

యా దేవీ సర్వభూతేషు

మాతృరూపేణ సంస్థితా

నమస్తస్యై నమస్తస్యై

నమస్తస్యై నమో నమః

అన్నపూర్ణా దేవి శ్లోకం

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే

జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి

అమ్మవారి ధ్యాన శ్లోకం

విద్యుద్దామ సమప్రభాం మృగపతిస్కంధస్థితాం భీషణాం

కన్యాభిః కరవాలఖేటవిలసద్ధస్తాభిరాసేవితామ్

హస్తైశ్చక్రగదాసిఖేటవిశిఖాంశ్చాపం గుణం తర్జనీం

బిభ్రాణామనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe