రేపటి నుంచి శ్రావణ మాసం.. ప్రాధాన్యత, పూజా విధానం, పరిహారాలు.. శివ, లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తుంది!

శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగు పంచాంగం ప్రకారం 2026 ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం కొనసాగుతుంది. ఈ మాసంలో శివారాధనతో పాటు లక్ష్మీదేవి పూజ, వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీ వ్రతం, నాగపంచమి, రక్షాబంధన్ వంటి పర్వదినాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.  

Published on: Aug 12, 2026, 12:30:26 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్ర మాసాల్లో ఒకటి. ప్రాంతాన్ని బట్టి శ్రావణమాసం తేదీలు, ఆచారాలు మారుతూ ఉంటాయి. తెలుగు పంచాంగం సాంప్రదాయం ప్రకారం చూసినట్లయితే, ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణమాసం ఉంది.

రేపటి నుంచి శ్రావణ మాసం.. ప్రాధాన్యత, పూజా విధానం, పరిహారాలు.. శివ, లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తుంది! (pinterest)
రేపటి నుంచి శ్రావణ మాసం.. ప్రాధాన్యత, పూజా విధానం, పరిహారాలు.. శివ, లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తుంది! (pinterest)

శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. శ్రావణ మాసంలో శివుడిని కూడా ప్రత్యేకించి ఆరాధిస్తారు. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ కూడా చాలా విశేషమైనది. శ్రావణ మాసంలో చేయాల్సిన పరిహారాలు, శ్రావణ మాసంలో పాటించాల్సిన నియమాలతో పాటుగా పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రావణ మాసం 2026 ప్రాధాన్యత, పూజా విధానం, పరిహారాలు

శివ పూజ

శ్రావణ మాసంలో శివుడిని ఆరాధించడం వలన విశేష ఫలితాలు కలుగుతాయి. శివుడికి సమర్పించి, ఓం నమ: శివాయ మంత్రాన్ని జపిస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అలాగే సోమవారాలను శివారాధనకు ప్రత్యేకంగా భావించే సాంప్రదాయం కూడా ఉంది.

శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం, నాగ పంచమి, శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, లక్ష్మీ పూజ, రక్షాబంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి లాంటి పర్వదినాలు వస్తాయి. దీంతో శ్రావణమాసం అంతా కలకల్లాడుతూ ఉంటుంది. ఆడపడుచులు అందంగా అలంకరణ చేసుకుని ఆ అమ్మవారిని ఇష్టంగా పూజిస్తారు.

శ్రావణ సోమవారం ఎలా పూజ చేయాలి?

శ్రావణ సోమవారం నాడు తలస్నానం చేసి, శుభ్రమైన దుస్తులను ధరించి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. శివలింగాన్ని శుభ్రంగా ఉంచి అభిషేకం చేయాలి. నీళ్లతో అభిషేకం చేయడంతో పాటుగా పాలు, పెరుగు, తేనె వంటివి సమర్పించవచ్చు. పండ్లు, పుష్పాలు, నైవేద్యాన్ని కూడా సమర్పించండి.

శ్రావణ శుక్రవారం పూజ

శ్రావణ శుక్రవారం ఉన్న ప్రాముఖ్యత గురించి విశేషంగా చెప్పక్కర్లేదు. ఇంటిని శుభ్రంగా ఉంచుకొని, పూజ మందిరాన్ని అలంకరించుకుని లక్ష్మీదేవిని ప్రతిష్టించి పూజ చేయాలి. అలాగే కలశాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష్మీదేవి పూజ చేసి అష్టోత్తరం చదువుకోవాలి. నైవేద్యం, హారతి, వ్రతకథ పఠనం ఇలా విధానాన్ని పాటిస్తూ భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించాలి.

శ్రావణ మాసంలో చేయాల్సిన పరిహారాలు

1.శివ పంచాక్షరి జపం:

ప్రతి రోజు ఓం నమశ్శివాయ మంత్రాన్ని భక్తితో జపించండి. ఆధ్యాత్మిక సాధనగా చేయొచ్చు.

2.బిల్వదళాల సమర్పణ:

శివారాధనలో బిల్వదళాలకు ప్రత్యేక స్థానం. ప్రతి సోమవారం శివుడికి బిల్వదళాలను సమర్పించండి.

3.నిత్యం దీపారాధన:

సాయంత్రం పూజా మందిరంలో దీపాన్ని వెలిగించి, కాసేపు ధ్యానం చేస్తే చాలా మంచిది.

4.అన్నదానం:

సామర్థ్యానికి తగ్గట్టుగా పేదలకు, అవసరమైన వారికి ఆహారాన్ని అందించండి.

ఉదయం స్నానం చేసి, పూజ స్థలాన్ని శుభ్రంగా చేసుకొని, దీపం వెలిగించి ఇష్టదైవాన్ని ఆరాధించండి. సాయంత్రం కూడా దీపం వెలిగించి ఓం నమశ్శివాయ మంత్రాన్ని జపించండి. శివుడు లేదా లక్ష్మీదేవిని ఆరాధించండి. రోజూ ఎక్కువ సమయం కేటాయించలేకపోయినా, భక్తి శ్రద్ధలతో చిన్న పూజ చేసుకున్నా మంచి ఫలితం వస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More