సాయంత్రం నిద్రపోవద్దని పెద్దలు చెప్పడానికి ఇదే కారణం.. వాస్తు శాస్త్రం ఆసక్తికర వివరణ!

సాయంత్రం సంధ్యా సమయంలో నిద్రపోవద్దని పెద్దలు ఎందుకు చెబుతారు? హిందూ ధర్మశాస్త్రం, వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం వేళ పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏమిటి? మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

Published on: Jul 9, 2026, 14:00:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం చూసినట్లయితే, 24 గంటల కాలాన్ని వివిధ భాగాలుగా విభజించడం జరిగింది. ప్రతి కాలానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఆ సమయాల్లో పాటించాల్సిన నియమాలను కూడా శాస్త్రాలు వివరించాయి. ఉదయం నుంచి ప్రదోషకాలం వరకు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రతి సమయానికి ఏదో ఒక ప్రత్యేకతతో పాటు ఆధ్యాత్మిక విశిష్టత కూడా ఉంది.

సాయంత్రం నిద్రపోవద్దని పెద్దలు చెప్పడానికి ఇదే కారణం.. వాస్తు శాస్త్రం ఆసక్తికర వివరణ! (pinterest)
సాయంత్రం నిద్రపోవద్దని పెద్దలు చెప్పడానికి ఇదే కారణం.. వాస్తు శాస్త్రం ఆసక్తికర వివరణ! (pinterest)

సూర్యాస్తమయం, ప్రదోషకాలాన్ని అత్యంత పవిత్రమైన, సున్నితమైన సమయంగా భావిస్తారు. సాయంత్ర వేళను మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన సమయంగా చెబుతారు. ఈ సమయంలో పాటించాల్సిన అనేక వాస్తు నియమాలు ఉన్నాయి. అయితే, సాయంత్రం పూట నిద్రపోకూడదని పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. సాయంత్రం సంధ్యా సమయంలో నిద్రపోకూడదని, ఇల్లు చీకటిగా ఉండకూడదని, ఇలా చాలా నియమాలు ఉన్నాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

సాయంత్రం పూట పాటించాల్సిన నియమాలు

సాయంత్రం పూట ఇల్లు చీకటిగా ఉండకూడదు.

సాయంత్రం సంధ్యా సమయం తర్వాత గోళ్లు కత్తిరించడం వంటివి చేయకూడదు.

సాయంత్రం సంధ్యా సమయంలో ఇల్లు ఊడుస్తూ ఇంటి నుంచి చెత్తను బయట పారేయకూడదు.

అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో నిద్రపోవడం కూడా మంచిది కాదు.

సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఎందుకు నిద్రపోకూడదు?

వాస్తు ప్రకారం సాయంత్రం లేదా సూర్యాస్తమయం అత్యంత పవిత్రమైన సమయం. ఈ సమయంలో పగలు, రాత్రి కలుస్తాయి. ఈ వేళ ప్రతిరోజూ దీపం వెలిగిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. ఐశ్వర్యం కలుగుతుంది. దేవుడిని ఆరాధించడానికి, ప్రార్థనలు చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో కొన్ని నియమాలను పాటిస్తే సానుకూల శక్తి ప్రవేశించి, ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్మకం.

మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం

హిందూ ధార్మిక విశ్వాసాల ప్రకారం, సాయంత్రం సమయంలో మహాలక్ష్మీదేవి భూమిపై సంచరిస్తుందని అంటారు. ఆ సమయంలో ఇంట్లో సభ్యులు నిద్రలో ఉంటే, ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదని, ఆర్థిక ఇబ్బందులు, దరిద్రం కలిగే అవకాశాలు ఉంటాయని నమ్మకం. అందుకే సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో దీపం వెలిగించడం ఆనవాయితీ. ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమై ఇంట్లోకి ప్రవేశించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు.

సాయంత్రం వేళ నిద్రపోవడం వల్ల బద్ధకం కూడా పెరుగుతుంది. శక్తి, ఉత్సాహం తగ్గిపోతాయి. అలాంటి వారికి ఏ పని చేయాలన్నా ఆసక్తి కలగదు. అందుకే హిందూ సంప్రదాయం ప్రకారం సంధ్యా సమయంలో నిద్రపోవడం మంచిది కాదని చెబుతారు.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More