Sravana Pournami 2026: శ్రావణ పౌర్ణమి రాత్రి ఈ పనులు చేస్తే శుభ ఫలితాలు.. ధనసంపద కూడా!

శ్రావణ పౌర్ణమి హిందూ సనాతన ధర్మంలో ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున శివుడు, పార్వతీ దేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం, నదీ స్నానాలు, దానధర్మాలు చేయడం ద్వారా శుభఫలితాలు లభిస్తాయని నమ్మకం. ముఖ్యంగా పౌర్ణమి రాత్రి చంద్ర దర్శనం, లక్ష్మీ పూజ వంటి కొన్ని ఆధ్యాత్మిక ఆచారాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది

Published on: Aug 28, 2026, 12:30:55 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రావణ పౌర్ణమికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హిందూ సనాతన ధర్మంలో శ్రావణమాసానికి, అందులో పౌర్ణమికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. శ్రావణ పౌర్ణమి నాడు శివుడు, పార్వతీ దేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శ్రావణ పౌర్ణమి నాడు నదీ స్నానాలు ఆచరించడం, దానధర్మాలు చేయడం వలన కూడా విశేషమైన ఫలితాలను పొందవచ్చు. శ్రావణ పౌర్ణమి రోజు రాత్రి కొన్ని పరిహారాలను పాటిస్తే అనేక విధాలుగా ప్రయోజనాలను పొందడానికి వీలవుతుంది.

Sravana Pournami 2026: శ్రావణ పౌర్ణమి రాత్రి ఈ పనులు చేస్తే శుభఫలితాలు.. ధనసంపద కూడా! (AI)
Sravana Pournami 2026: శ్రావణ పౌర్ణమి రాత్రి ఈ పనులు చేస్తే శుభఫలితాలు.. ధనసంపద కూడా! (AI)

శ్రావణ పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తి కళలతో ప్రకాశిస్తూ కనిపిస్తాడు. పౌర్ణమి రాత్రి మనసు, శరీరంపై ప్రత్యేక ప్రభావం ఉంటుంది. పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఆచారాల ప్రకారం, పౌర్ణమి రోజు రాత్రి వేళ కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

చంద్ర దర్శనం

చంద్ర దర్శనం అత్యంత ప్రాధానం. పౌర్ణమి రోజు రాత్రి చంద్రోదయమైన తర్వాత చల్లటి వెన్నెలలో కాసేపు సమయాన్ని గడిపితే ఆరోగ్యంగా ఉండొచ్చు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో ఆవు పాలతో చేసిన పాయసం లేదా పాలను వెన్నెల్లో పెట్టి, కుటుంబ సభ్యులందరూ కలిసి స్వీకరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. చంద్రుడికి వెండి పాత్రలో పాలు లేదా నీటితో అర్ఘ్యం సమర్పిస్తే చంద్ర దోషాలు తొలగిపోతాయి.

లక్ష్మీ పూజ

పౌర్ణమి రోజు రాత్రి మహాలక్ష్మి దేవిని ఆరాధించడం వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. ఆ రోజు రాత్రి పూజా గదిలో అమ్మవారి ముందు దీపం వెలిగించి, సూక్తం లేదా కనకధార స్తోత్రం పఠిస్తే మంచిది. అలా చేస్తే ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రాత్రి పూట దీపం ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అలాగే పసుపు రంగు వస్త్రాలను ధరించి అమ్మవారిని ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలను చూడొచ్చు.

జపాలు, దానధర్మాలు

ఈ పవిత్రమైన రోజున పేదలకు అన్నదానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తెల్లని వస్తువులు అంటే బియ్యం, పాలు వంటివి దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇష్టదైవం మంత్రాలను, “ఓం నమో భగవతే వాసుదేవాయ నమః” అనే మంత్రాన్ని జపిస్తే మనసులో అశాంతి తొలగిపోయి, ఏకాగ్రతను పొందవచ్చు.

నిరాకరణ: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More