ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం వేళ చదువుకోవాల్సిన శ్లోకాలు, శ్రీసూక్తం!

శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధనకు విశేషమైన రోజుగా భావిస్తారు. ఈ రోజు ఉదయం శుభ్రంగా స్నానం చేసి, ఇంటిని మరియు పూజా స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచి, లక్ష్మీదేవి ఎదుట దీపం వెలిగించి పుష్పాలతో పూజ చేయవచ్చు. 

Published on: Aug 14, 2026, 08:01:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈరోజు శ్రావణ శుక్రవారం పూజలో దీపం వెలిగించి, పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించండి. కింద ఉన్న శ్లోకాలు, శ్రీసూక్తం చదువుకుని భక్తితో పారాయణం చేస్తే మంచిది.

ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం వేళ చదువుకోవాల్సిన శ్లోకాలు, శ్రీసూక్తం!
ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం వేళ చదువుకోవాల్సిన శ్లోకాలు, శ్రీసూక్తం!

లక్ష్మీదేవి శ్లోకాలు

ప్రాతః స్మరామి ధనదాం మధుకైటభారేః

వక్షఃస్థలే స్థితవతీం కమలాం మనోజ్ఞామ్

ఉద్యత్సూర్యాభాం అమృతకలశం బిభ్రతీం తాం

సర్వార్థసిద్ధి జననీం శరణం ప్రపద్యే

పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే

నారాయణప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా

నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే

శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి

సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే

ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే

విష్ణుపత్న్యై చ ధీమహి

తన్నో లక్ష్మీః ప్రచోదయాత్

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం

దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురామ్

శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం

త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్

సర్వమంగళ మాంగల్యే

శివే సర్వార్థ సాధికే

శరణ్యే త్ర్యంబకే దేవి

నారాయణి నమోస్తుతే..

శ్రీసూక్తం

ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్

చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్

యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీమ్

శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్

కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్

పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్

చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్

తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే

ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః

తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ

ప్రాదుర్భూతో స్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహమ్

అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్

గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్

ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్

మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి

పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః

కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ

శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్

ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీతి వస మే గృహే

ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే

ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగలాం పద్మమాలినీమ్

చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్

సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్

యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోఽశ్వాన్ విందేయం పురుషానహమ్..

శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు లేదా ప్రతిరోజూ ఉదయం శుభ్రంగా స్నానం చేసి, లక్ష్మీదేవి ఎదుట దీపం పెట్టి, ప్రశాంతంగా శ్రీ సూక్తాన్ని పారాయణం చెయ్యండి. శ్రీ సూక్త పారాయణం చేస్తే ఐశ్వర్యం, శాంతి, సుఖ సంతోషాలు కలుగుతాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More