జూలై 29న గురు పౌర్ణమి.. తప్పక పఠించాల్సిన శక్తివంతమైన గురు శ్లోకాలు!
హిందూ సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో గురు పౌర్ణమి ఒకటి. ప్రతి ఏడాది ఆషాఢ పౌర్ణమి రోజున ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. 2026లో గురు పౌర్ణమి జూలై 29, బుధవారం వచ్చింది. ఈ రోజున మహర్షి వేదవ్యాసుల జయంతిని కూడా జరుపుకోవడంతో దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు.
హిందూ సనాతన ధర్మంలో చాలా పవిత్రమైన పర్వదినాల్లో గురు పౌర్ణమి కూడా ఒకటి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు గురు పౌర్ణమిని జరుపుకుంటాము. జ్ఞానాన్ని ప్రసాదించి, అజ్ఞానాంధకారాన్ని తొలగించి, సన్మార్గంలో నడిపించే గురువుకు గురు పౌర్ణమి నాడు కృతజ్ఞతలు తెలుపుతాము.

ఈ ఏడాది జూలై 29, బుధవారం నాడు గురు పౌర్ణమి వచ్చింది. మహర్షి వేదవ్యాసుల జయంతిని కూడా ఆ రోజే జరుపుకుంటాము. వేదాలను విభజించి, మహాభారతం, అష్టాదశ పురాణాలను రచించిన వేదవ్యాసులను భారతీయ సంస్కృతిలో ఆదిగురువు అని అంటారు. అందుకే దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు.
గురు పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి?
గురు పౌర్ణమి నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి గురు పూజకు సంకల్పం చేయాలి. వేదవ్యాసులు, శ్రీమహావిష్ణువు లేదా గురువు చిత్రపటాన్ని పూజించాలి. గురు స్తోత్రాలు, గురు గాయత్రీ మంత్రం, విష్ణు సహస్రనామం పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
అలాగే కింద ఉన్న శ్లోకాలను చదివినా మంచి ఫలితం ఉంటుంది. ధ్యానం, జపం, ఆధ్యాత్మిక గ్రంథాల పారాయణం చేస్తే కూడా విశేషమైన ఫలితాలను పొందవచ్చు. పేదలకు వస్త్రదానం, అన్న దానం, విద్యార్థులకు పుస్తకాలను దానం చేయడం వలన విశేషమైన ఫలితాన్ని పొందడానికి వీలవుతుంది.
గురు పౌర్ణమి నాడు పఠించాల్సిన శ్లోకాలు
గురు బ్రహ్మా గురుర్ విష్ణుః
గురు దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః
అఖండ మండలాకారం
వ్యాప్తం యేన చరాచరం
తత్పదం దర్శితం యేన
తస్మై శ్రీ గురవే నమః
ధ్యానమూలం గురోర్మూర్తిః
పూజామూలం గురోః పదమ్
మంత్రమూలం గురోర్వాక్యం
మోక్షమూలం గురోః కృపా
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః
ఓం గురుదేవాయ విద్మహే
పరబ్రహ్మణే ధీమహి..
తన్నో గురుః ప్రచోదయాత్
గురవే సర్వలోకానాం
భిషజే భవరోగిణామ్
నిధయే సర్వవిద్యానాం
శ్రీ దక్షిణామూర్తయే నమః
బ్రహ్మానందం పరమసుఖదం
కేవలం జ్ఞానమూర్తిమ్
ద్వంద్వాతీతం గగనసదృశం
తత్త్వమస్యాదిలక్ష్యం
ఏకం నిత్యం విమలమచలం
సర్వధీ సాక్షిభూతమ్
భావాతీతం త్రిగుణరహితం
సద్గురుం తం నమామి..
త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవ దేవ
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


