చిన్న జీయర్ స్వామి దివ్య మంగళ శాసనములతో జర్మనీ మాన్హైమ్లోని జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వహించిన శ్రీ గోదా రంగనాథ స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ధనుర్మాసం సందర్భంగా నిర్వహించిన ఈ కళ్యాణాన్ని వీక్షించేందుకు నగరంలోని తెలుగువారు, భక్తులు తరలివెళ్లారు. అందరు ఎంతగానో శ్రమపడి అమ్మవారిని, స్వామి వారిని, ప్రాంగణాన్ని అత్యంత వైభవోపేతంగా అలంకరించి, భక్తిశ్రద్ధలతో పూజించారు.
మాన్హైమ్ పట్టణంలో తొలిసారి..

జర్మనీ మాన్హైమ్ పట్టణంలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని మొట్టమొదటిసారిగా నిర్వహించింది జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. ఆగమ శాస్త్ర విద్వాంసులు అయిన శ్రీ గోపాలకృష్ణ రంగరాజన్, దేవనాథన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.
- మౌని అమావాస్య 2026: మౌని అమావాస్య ఎప్పుడు వచ్చింది? తేదీ, శుభ సమయంతో పాటు ఏం చెయ్యాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
అంతేకాదు, సంక్రాంతి నేపథ్యంలో ఇదే వేదికగా పిల్లలకు భోగి పండ్లు కూడా పోశారు. తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ఎన్నో జ్ఞాపకాలను పోగుచేసుకున్నారు.
{{/usCountry}}అంతేకాదు, సంక్రాంతి నేపథ్యంలో ఇదే వేదికగా పిల్లలకు భోగి పండ్లు కూడా పోశారు. తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ఎన్నో జ్ఞాపకాలను పోగుచేసుకున్నారు.
{{/usCountry}}ఈ సంస్థ గత నాలుగేళ్లుగా, ప్రతి శ్రీరామ నవమికి సీతారాముల కళ్యాణాన్ని జర్మనీలో ఘనంగా నిర్వహిస్తోంది.
జర్మనీలో నివశిస్తున్న భారతీయులందరికి భారత సంస్కృతి, సాంప్రదాయాలు తెలియజేసే ఉద్దేశంతో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాలను జరుపుతోంది.
సొంత వారికి దూరంగా, విదేశాల్లో జీవిస్తున్న వారందరికి ఈ కార్యక్రమాలు చక్కటి వేదికగా మారుతున్నాయి. పిల్లలకు భారత దేశ సంస్కృతిని వివరించేందుకు తల్లిదండ్రులు ఈ వేదికను ఉపయోగించుకుంటున్నారు.