...
...
Next Story

Sri Rama Navami 2026 Wishes: శ్రీరామనవమి 2026 విషెస్ & కోట్స్.. మీ ఆత్మీయులకు ఇలా ప్రత్యేకంగా విషెస్ చెప్పేయండి!

ఈ ఏడాది శ్రీరామనవమి మార్చి 27న వచ్చింది. శ్రీరామనవమి నాడు భక్తిశ్రద్ధలతో సీతారాములను ఆరాధించి, వారి అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అత్యంత వేడుకగా శ్రీరామనవమి జరుపుతారు. ఊరు రా నవమి రోజున సీతారాముల కళ్యాణం చేస్తారు. మీ ఆత్మీయులకు ఇలా ప్రత్యేకంగా విషెస్ చెప్పేయండి.

Published on: Mar 26, 2026, 17:01:12 IST
Advertisement

ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామనవమినే జరుపుకుంటాము. ఈ ఏడాది శ్రీరామనవమి మార్చి 27న వచ్చింది. శ్రీరామనవమి నాడు భక్తిశ్రద్ధలతో సీతారాములను ఆరాధించి, వారి అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అత్యంత వేడుకగా శ్రీరామనవమి జరుపుతారు. ఊరు రా నవమి రోజున సీతారాముల కళ్యాణం చేస్తారు.

Sri Rama Navami 2026 Wishes: శ్రీరామనవమి 2026 విషెస్ & కోట్స్ (pinterest)
Sri Rama Navami 2026 Wishes: శ్రీరామనవమి 2026 విషెస్ & కోట్స్ (pinterest)

పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి పంచుతారు. శ్రీరామనవమి నాడు శ్రీరాముడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి, ఉపవాసం ఉంటే ఆ రామయ్య దివ్య అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండొచ్చు. శ్రీరామనవమి సందర్భంగా మీ ఆత్మీయులకు విషెస్‌ని (Sri Rama Navami 2026 Wishes and quotes) ఇలా చెప్పేయండి.

శ్రీరామనవమి 2026 విషెస్ & కోట్స్.. శ్రీరామనవమి శుభాకాంక్షలు 2026.. ఇలా శ్రీరామనవమి విషెస్ చెప్పేయండి:

ఆ రామయ్య ఆశీస్సులు మీ కుటుంబం పై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. (Sri Rama Navami 2026)

ఈ శ్రీరామనవమి మీకు శుభకరం, ఆనందకరం అవ్వాలని ఆశిస్తున్నాను. హ్యాపీ శ్రీరామనవమి!

శ్రీరామ అనుగ్రహంతో కుటుంబంలో సర్వ దోషాలు తొలగిపోయి, సర్వ శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. శ్రీరామనవమి శుభాకాంక్షలు.

శ్రీరామనవమి మీ ఇంట్లో అందరికీ సుఖసంతోషాలను, ఆరోగ్యాన్ని అందించాలని, రామయ్య దయ మీ కుటుంబం పై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రీరామనవమి శుభాకాంక్షలు.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.

శ్రీరామనవమి మీ ఇంట్లో అందరికీ సుఖ సంతోషాలను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రీరామనవమి శుభాకాంక్షలు.

శ్రీరామ జయరామ జయ జయ రామ

ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ

కాలాత్మక పరమేశ్వర రామ

శేషతల్ప సుఖనిద్ర రామ

బ్రహ్మధ్యామర ప్రార్థిత రామ

మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.

సీతారాముల కళ్యాణం చూసి తరించిన వారి జన్మ సార్థకం అవుతుంది.. రామయ్య అనుగ్రహంతో సర్వ దోషాలు తొలగి, సర్వ శుభాలు కలుగుతాయి.. శ్రీరామనవమి శుభాకాంక్షలు.

శ్రీరామ నామం పలికితే పాపాలు అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయి.. రామస్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది.. శ్రీరామనవమి శుభాకాంక్షలు.

రామ రాజ్యంలో ప్రజలంతా ఐశ్వర్య సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈ రామయ్య అనుగ్రహంతో ఇప్పుడు అందరూ అలానే ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీరామనవమి శుభాకాంక్షలు. (Sri Rama Navami 2026)

అత్యంత ధైర్యశాలి, సర్వజీవుల పట్ల దయ కలిగిన ఆ శ్రీరాముని అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీరామనవమి శుభాకాంక్షలు.

పుణ్య దంపతులైన సీతారాముల శుభాశీస్సులతో మన అందరి మనసులు ఎప్పుడూ కూడా మంచిన ఆలోచనలతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe