సూర్య భగవానుడి శక్తివంతమైన మంత్రాలు ఇవి.. వీటిని పఠిస్తే డబ్బు, విజయాలు ఇలా ఎన్నో పొందవచ్చు!

సూర్యుడిని గ్రహాలకు రాజు అని చెప్తారు. సూర్యుడు జీవితంలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాడు. సూర్యోదయం సరైన పద్ధతిలో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. వ్యాపారంతో పాటుగా అనేక రంగాల్లో అద్భుతమైన లాభాలను చూడొచ్చు. కోరికలు నెరవేరుతాయి. ఏ సమస్యకు దూరంగా ఉండడానికి ఏ మంత్రాన్ని పఠించాలో తెలుసుకుందాం.

Published on: Dec 8, 2025, 14:08:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సూర్యనారాయణ మూర్తిని ఆరాధించడం వలన సకల సంతోషాలు కలుగుతాయి. సూర్యుడిని గ్రహాలకు రాజు అని చెప్తారు. అత్యంత శక్తి, విశ్వాసానికి సంకేతం. సూర్యుడు జీవితంలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాడు. సూర్యోదయం సరైన పద్ధతిలో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. వ్యాపారంతో పాటుగా అనేక రంగాల్లో అద్భుతమైన లాభాలను చూడొచ్చు. కోరికలు కూడా నెరవేరుతాయి.

సూర్య భగవానుడి శక్తివంతమైన మంత్రాలు ఇవి (pinterest)
సూర్య భగవానుడి శక్తివంతమైన మంత్రాలు ఇవి (pinterest)

సూర్య అనుగ్రహం

సూర్యుడు స్థానం జాతకంలో బలంగా ఉన్నట్లయితే అనేక సమస్యలకు దూరంగా ఉండొచ్చు. అదే బలహీనంగా ఉంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సూర్య దేవుని అనుగ్రహాన్ని పొందడం కోసం, ఈ సూర్య శక్తివంతమైన మంత్రాలను పఠిస్తే మంచిది.

చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. అలాగే తెలివితేటలు పెరుగుతాయి. బుద్ధి వికాసం, శరీర బలం కూడా పెంచుకోవచ్చు. అలాగే ఏదో మానసిక శక్తుల్ని కూడా పెంచుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడొచ్చు. మరి ఏ సమస్యకు దూరంగా ఉండడానికి ఏ మంత్రాన్ని పఠించాలో తెలుసుకుందాం.

సూర్య భగవానుడి శక్తివంతమైన మంత్రాలు ఇవి.. ఏ మంత్రాన్ని పఠిస్తే ఎలాంటి లాభాలు వస్తాయి?

1.ఓం హం మిత్రయ నమః

ఆరోగ్యం, పని సామర్థ్యం పెరగాలంటే ఈ మంత్రాన్ని జపించండి. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి.

2.ఓం హ్రీం రవయే నమః

క్షయ వ్యాధులతో బాధపడితే, రక్త ప్రసరణ మెరుగుపరచడానికి ఈ మంత్రాన్ని పఠిస్తే మంచిది.

3.ఓం హ్రీం బానవే నమః

మూత్రాశయ సమస్యల కోసం ఈ మంత్రాన్ని ఉపయోగించవచ్చు.

4.ఓం హూం సూర్యాయ నమః

మానసిక ప్రశాంతత, తెలివి పెరుగుదల కోసం ఈ మంత్రాన్ని జపించాలి. దీనితో సంతోషంగా ఉండడానికి కూడా వీలవుతుంది.

5.ఓం హ్రోం ఖగే నమః

బుద్ధి వికాసం, శరీర బలం పెరుగుదల కోసం ఈ మంత్రాన్ని జపించాలి.

6.ఓం హ్రీం హిరణ్య గర్భాయ నమః

ఈ మంత్రాన్ని పఠిస్తే విద్యార్థులకు మేలు కలుగుతుంది. శారీరక, మేధో, మానసిక శక్తులను పెంచుకోవచ్చు.

7.ఓం ఆదిత్యాయ నమః

ఈ మంత్రాన్ని జపిస్తే తెలివి, ఆర్థిక సమస్యల తొలగింపు వంటి ప్రయోజనాలను పొందడానికి వీలవుతుంది.

8.ఓం అర్కే నమః

వేదాల రహస్యాలను తెలుసుకోవడానికి ఈ మంత్రాన్ని పఠించండి. మనసు దృఢంగా ఉంటుంది. సమస్యలు తీరుతాయి.

9.ఓం భాస్కరాయై నమః

శరీరం, మనసు శుభ్రంగా, సంతోషంగా ఉండడానికి రోజూ ఈ మంత్రం జపించాలి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More